Pooja Hegde: డిమోంటీ కాల‌నీ 2 డైరెక్ట‌ర్‌తో పూజాహెగ్డే హార‌ర్ వెబ్‌సిరీస్ - ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడంటే?-pooja hegde ajay gnanamuthu horror thriller web series streaming on netflix from this year end demonte colony 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pooja Hegde: డిమోంటీ కాల‌నీ 2 డైరెక్ట‌ర్‌తో పూజాహెగ్డే హార‌ర్ వెబ్‌సిరీస్ - ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడంటే?

Pooja Hegde: డిమోంటీ కాల‌నీ 2 డైరెక్ట‌ర్‌తో పూజాహెగ్డే హార‌ర్ వెబ్‌సిరీస్ - ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 08, 2024 08:19 AM IST

Pooja Hegde: డిమోంటీ కాల‌నీ 2 ద‌ర్శ‌కుడు అజ‌య్ జ్ఞాన‌ముత్తుతో బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే ఓ హార‌ర్ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్న‌ది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. డిసెంబ‌ర్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

పూజాహెగ్డే
పూజాహెగ్డే

Pooja Hegde: అల వైకుంఠ‌పుర‌ములో బ్యూటీ పూజాహెగ్డే హార‌ర్ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు డిమోంటీ కాల‌నీ, డిమోంటీ కాల‌నీ 2 సినిమాల ఫేమ్ అజ‌య్‌ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అజ‌య్ జ్ఞాన‌ముత్తు గ‌త సినిమాల త‌ర‌హాలోనే ఔట్ అండ్ ఔట్ హార‌ర్ క‌థాంశంతో ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్క‌నున్న‌ట్లు స‌మాచారం. డిమోంటీ కాల‌నీ మూవీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ద‌ర్శ‌కుడు అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ వెబ్‌సిరీస్ క‌థ‌ను రాసిన‌ట్లు స‌మాచారం.

ఓ మ‌హ‌ల్ మిస్ట‌రీని ఛేదించే క్ర‌మంలో యువ‌తి తెలుసుకున్న వాస్త‌వాలు, ఆ మ‌హాల్‌లో ఆమెకు ఎదుర‌య్యే విచిత్ర‌మైన అనుభ‌వాల‌తో హార‌ర్‌, స‌స్పెన్స్ అంశాల‌తో చివ‌రి వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా ఈ సిరీస్ సాగుతుంద‌ని చెబుతోన్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌...

మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో తెర‌కెక్క‌నున్న ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ప్ర‌స్తుతం చెన్నైలో జ‌రుగుతోన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. త‌మిళంతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్‌ను తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇన్నాళ్లు డిమోంటీ కాల‌నీ షూటింగ్‌లో అజ‌య్ జ్ఞాన‌ముత్తు బిజీగా ఉండ‌టంతో ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ఆల‌స్య‌మైన‌ట్లు తెలిసింది. మ‌రో రెండు నెల‌ల్లో షూటింగ్‌ను కంప్లీట్ చేసి డిసెంబ‌ర్‌లో ఈ హార‌ర్ వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది.

గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు భిన్నంగా...

గ‌తంలో పూజాహెగ్డే ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే క‌నిపించింది. వాటికి భిన్నంగా ఈ హార‌ర్ వెబ్‌సిరీస్‌లో ఆమె ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. మోడ్ర‌న్, పీరియాడిక‌ల్ ట‌చ్‌తో సాగే రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో పూజాహెగ్డే క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

ఏవీఎమ్ ప్రొడ‌క్ష‌న్స్‌...

కోలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ఏవీఎమ్ సంస్థ పూజాహెగ్డే, అజ‌య్ జ్ఞాన‌ముత్తు హార‌ర్ వెబ్‌సిరీస్‌ను నిర్మించ‌బోతున్న‌ది.ఈ బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న సెకండ్ వెబ్‌సిరీస్ ఇది. గ‌తంలో ఈ సంస్థ నుంచి త‌మిళ్ రాక‌ర్స్ అనే వెబ్‌సిరీస్ వ‌చ్చింది.

సూర్య‌కు జోడీగా...

గ‌త రెండేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్న పూజాహెగ్డే ప్ర‌స్తుతం త‌మిళంతో సూర్య‌తో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే హిందీలో షాహిద్ క‌పూర్‌కు జోడీగా దేవా అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో పూజాహెగ్డే క‌నిపించ‌బోతున్న‌ది.

ప‌రాజ‌యాల కార‌ణంగా...

తెలుగులో స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా చెలామ‌ణి అయినా ఈ బ్యూటీ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ వ‌చ్చింది. ప‌రాజ‌యాల కార‌ణంగా ఆమె జోరుకు బ్రేక్ ప‌డింది. 2022లో రిలీజైన ఆచార్య త‌ర్వాత తెలుగులో మ‌ళ్లీ క‌నిపించ‌లేదు పూజాహెగ్డే. రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. ఆచార్య కంటే ముందు ఆమె న‌టించిన రాధేశ్యామ్‌తో పాటు త‌మిళ సినిమా బీస్ట్‌, బాలీవుడ్ మూవీస్ స‌ర్క‌స్‌, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలు డిజాస్ట‌ర్స్ అయ్యాయి.