Gangster Thriller OTT:ర‌జ‌నీకాంత్ కూతురు గ్యాంగ్‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ - క‌ట్ట‌ప్ప లీడ్ రోల్ -టైటిల్ ఫిక్స్‌-soundarya rajinikanth crime thriller web series gangs kuruthipunal streaming on amazon prime video this year end ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gangster Thriller Ott:ర‌జ‌నీకాంత్ కూతురు గ్యాంగ్‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ - క‌ట్ట‌ప్ప లీడ్ రోల్ -టైటిల్ ఫిక్స్‌

Gangster Thriller OTT:ర‌జ‌నీకాంత్ కూతురు గ్యాంగ్‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ - క‌ట్ట‌ప్ప లీడ్ రోల్ -టైటిల్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 05, 2024 07:26 PM IST

ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య ఓ గ్యాంగ్‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌కు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో స‌త్య‌రాజ్‌, అశోక్ సెల్వ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.

గ్యాంగ్‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌
గ్యాంగ్‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌

Gangster Thriller OTT: సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ త‌మిళంలో ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తోంది. గ్యాంగ్‌స్ట‌ర్ పీరియ‌డ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు గ్యాంగ్స్‌కురుథిపునాల్ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. ఆర్గ‌నైజ్‌డ్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోన్న‌ట్లు తెలిసింది. ఈ వెబ్‌సిరీస్‌కు సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ కేవ‌లం ప్రొడ్యూస‌ర్‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తోంది.

బాహుబ‌లి క‌ట్ట‌ప్ప‌...

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు నోహా అబ్ర‌హం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ త‌మిళ వెబ్‌సిరీస్‌లో బాహుబ‌లి ఫేమ్ స‌త్య‌రాజ్‌, అశోక్ సెల్వన్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.వీరితో పాటు నాజ‌ర్‌, నిమిషా స‌జ‌య‌న్‌, ఈశ్వ‌ర‌రావు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్‌లో...

గ్యాంగ్స్ కురుథిపునాల్ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ గ్యాంగ్‌స్ట‌ర్ సిరీస్ రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది. ఈ వెబ్‌సిరీస్‌లో స‌త్య‌రాజ్ ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. అశోక్ సెల్వ‌న్‌, నిమిషా స‌జ‌య‌న్ పోలీస్ ఆఫీస‌ర్లుగా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

న‌ర‌సింహా, బాబా సినిమాల‌కు...

సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఫ‌స్ట్ వెబ్‌సిరీస్ ఇది. గ‌తంలో తండ్రి ర‌జ‌నీకాంత్ న‌టించిన న‌ర‌సింహా, బాబా, చంద్ర‌ముఖి తో పాటు ప‌లు సినిమాల‌కు సౌంద‌ర్య గ్రాఫిక్ డిజైన‌ర్‌గా ప‌నిచేసింది. ర‌జ‌నీకాంత్‌, దీపికా ప‌దుకోణ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన కొచ్చాడ‌యాన్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీ స‌హాయంతో ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కికిన కొచ్చాడ‌యాన్ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

140 కోట్ల బడ్జెట్ 40 కోట్ల కలెక్షన్స్…

దాదాపు 140 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ న‌ల‌భై కోట్ల లోపు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నిర్మాతలకు వంద కోట్లకుపైనే నష్టాలను మిగిల్చింది. ఆ త‌ర్వాత ధ‌నుష్ హీరోగా న‌టించిన వెళ్లై ఇల్లా ప‌ట్టాధారి 2 మూవీకి సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. తెలుగులో వీఐపీ 2 పేరుతో ఈ మూవీ డ‌బ్ అయ్యింది. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఈ మూవీ మెప్పించ‌లేక‌పోయింది.

ప‌ర్‌ఫెక్ట్ హ‌జ్బెండ్‌...

మ‌రోవైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో స‌త్య‌రాజ్ బిజీగా ఉన్నాడు. అత‌డు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ప‌ర్‌ఫెక్ట్ హ‌జ్బెండ్ వెబ్‌సిరీస్ ఇటీవ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో రిలీజైంది.