Tamil Web Series: త‌మిళంలోకి రీమేక్ అవుతోన్న పంచాయ‌త్ వెబ్‌సిరీస్ - టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-panchayat web series remake in tamil thala vettiyan palayam cast and streaming details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamil Web Series: త‌మిళంలోకి రీమేక్ అవుతోన్న పంచాయ‌త్ వెబ్‌సిరీస్ - టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Tamil Web Series: త‌మిళంలోకి రీమేక్ అవుతోన్న పంచాయ‌త్ వెబ్‌సిరీస్ - టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 04, 2024 03:00 PM IST

Tamil Web Series: హిందీలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన పంచాయ‌త్ వెబ్‌సిరీస్ త‌మిళంలోకి రీమేక్ అవుతోంది. త‌ళ‌వెట్టియాన్‌పాళ్యం అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ త‌మిళ్ సిరీస్‌లో అభిషేక్‌కుమార్‌, దేవ‌ద‌ర్శిని కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

పంచాయ‌త్ వెబ్‌సిరీస్
పంచాయ‌త్ వెబ్‌సిరీస్

Tamil Web Series: హిందీలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన పంచాయ‌త్ వెబ్‌సిరీస్ త‌మిళంలోకి రీమేక్ అవుతోంది. ఈ త‌మిళ రీమేక్‌కు త‌ళ‌వెట్టియాన్‌పాళ్యం అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌కు నాగ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పంచాయ‌త్ త‌మిళ రీమేక్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ కాబోతోంది.

అభిషేక్ కుమార్ లీడ్ రోల్‌...

ఈ త‌మిళ రీమేక్‌లో అభిషేక్‌కుమార్‌, దేవ‌ద‌ర్శిని, చేత‌న్‌, ఆనంద్ స‌మీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

హిందీలో జితేంద్ర కుమార్ చేసిన పాత్ర‌లో అభిషేక్ కుమార్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నీనా గుప్తా పాత్ర‌లో దేవ‌ద‌ర్శిని న‌టిస్తున్న‌ట్లు చెబుతోన్నారు. కంప్లీట్ త‌మిళ్ నేటివిటీతో ఔట్ అండ్ ఔట్ రూర‌ల్ ఫ‌న్ డ్రామాగా త‌ళ‌వెట్టియాన్‌పాళ్యం వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోన్న‌ట్లు చెబుతోన్నారు.

అభిషేక్ కుమార్ త‌మిళంలో ఇదివ‌ర‌కు ఓ మ‌న‌పెన్నే, క‌న్నిరాశి, లాల్ ఎంగ సిరి పాప్పంతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. ప్ర‌స్తుతం పంచాయ‌త్ త‌మిళ వెబ్‌సిరీస్ రీమేక్‌కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలిసింది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.

మూడు సీజ‌న్లు...

పంచాయ‌త్ వెబ్‌సిరీస్ హిందీలో ఇప్ప‌టివ‌ర‌కు మూడు సీజ‌న్లు వ‌చ్చాయి. ఇటీవ‌లే థ‌ర్డ్ సీజ‌న్ రిలీజైంది. 2024లో హ‌య్యెస్ట్ స్ట్రీమింగ్‌ వ్యూస్ ద‌క్కించుకున్న వెబ్‌సిరీస్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఫ‌స్ట్ వీక్‌లోనే ఈ సిరీస్ 12 మిలియిన్ల వ్యూస్ సొంతం చేసుకున్న‌ది. ఐఎమ్‌డీబీలో 2024 ఇండియ‌న్‌ వెబ్‌సిరీస్‌ల‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా టాప్ 100 వెబ్‌సిరీస్‌ల‌లో 56వ స్థానంలో నిలిచింది. పంచాయ‌త్ వెబ్‌సిరీస్‌క‌కు నాలుగో సీజ‌న్‌ను అనౌన్స్‌చేశారు.

పంచాయ‌త్ సీజ‌న్ 3 రివ్యూ...

పంచాయతీ సెక్రటరీ అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్) ఫులేరా నుంచి బదిలీ కావ‌డంతో అత‌డి స్థానంలో కొత్త వ్య‌క్తి వ‌స్తాడు. కానీ సర్పంచ్ మంజు దేవి (నీనా గుప్త), ఆమె భర్త బ్రిజ్ భూషణ్ దూబే (రఘువీర్ యాదవ్), ప్రహ్లాద్ సహా గ్రామస్తులు కొందరు కొత్త సెక్రటరీని అడ్డుకుంటారు. మళ్లీ ఫులేరాకు అభిషేక్ త్రిపాఠిని సెక్రటరీగా తిరిగి తెచ్చుకుంటారు. అభిషేక్ త్రిపాఠిపై ప‌గ‌ను పెంచుకున్న‌ ఎమ్మెల్యే చంద్రకిశోర్ సింగ్ (ప్రకాశ్ జా) ఎలాంటి కుట్ర‌లు ప‌న్నాడు? గ్రామ‌స్తుల సాయంతో ఎమ్మెల్యే రాజ‌కీయ కుట్ర‌ల‌ను అభిషేక్ త్రిపాఠి ఎలా తిప్పికొట్టాడ‌నే అంశాల‌తో మూడో సీజ‌న్ సాగింది.