Vijay Deverakonda: ఆ సినిమా ఆడిషన్‍కు వెళితే దిల్‍రాజు ఛాన్స్ ఇవ్వలేదు: విజయ్ దేవరకొండ-i did not select in kerintha movie auditions says vijay deverakonda at family star pre release press meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  I Did Not Select In Kerintha Movie Auditions Says Vijay Deverakonda At Family Star Pre Release Press Meet

Vijay Deverakonda: ఆ సినిమా ఆడిషన్‍కు వెళితే దిల్‍రాజు ఛాన్స్ ఇవ్వలేదు: విజయ్ దేవరకొండ

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 01, 2024 03:03 PM IST

Vijay Deverakonda - Family Star Movie: ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ప్రీ రిలీజ్ ప్రెస్‍మీట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను విజయ్ దేవరకొండ వెల్లడించారు. గతంలో దిల్‍రాజు బ్యానర్లో ఓ సినిమా ఆడిషన్‍కు వెళితే తనను సెలెక్ట్ చేయలేదని వెల్లడించారు.

Vijay Deverakonda: ఆ సినిమా ఆడిషన్‍కు వెళితే దిల్‍రాజు ఛాన్స్ ఇవ్వలేదు.. ఏదో ఒకరోజు చూపిస్తా అనుకున్నా: విజయ్ దేవరకొండ
Vijay Deverakonda: ఆ సినిమా ఆడిషన్‍కు వెళితే దిల్‍రాజు ఛాన్స్ ఇవ్వలేదు.. ఏదో ఒకరోజు చూపిస్తా అనుకున్నా: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda - Family Star Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మరో నాలుగు రోజుల్లో అంటే ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ప్రమోషన్లలో జోరు పెంచింది మూవీ టీమ్. ఇందులో భాగంగా నేడు (ఏప్రిల్ 1) ప్రీ-రిలీజ్ ప్రెస్‍మీట్‍ను టీమ్ నిర్వహించింది. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నిర్మాత దిల్‍రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.

పెళ్లి చూపులు (2016) సినిమా కంటే ముందే కేరింత (2015) చిత్రం కోసం ఆడిషన్‍కు వెళ్లారట విజయ్ దేవరకొండ. అయితే, నిర్మాత దిల్‍రాజు ప్రొడక్షన్ హౌస్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ నిర్మించిన ఆ చిత్రానికి విజయ్‍ను ఎంపిక చేయలేదు. ఆ విషయంపై ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ప్రెస్‍మీట్‍లో విజయ్ దేవరకొండకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన రెస్పాండ్ అయ్యారు.

దిల్‍రాజు నన్ను తీసుకోలేదు

ఎస్‍వీసీ బ్యానర్లో ఓసారి ఆడిషన్లకు వెళ్లినా క్యారెక్టర్ ఇవ్వలేదు కదా అని విజయ్ దేవరకొండకు ప్రశ్న ఎదురైంది. దీంతో ‘రాజుగారు (దిల్‍రాజు) నాకు రోల్ ఇవ్వలేదు” అని విజయ్ అన్నారు. దీంతో దిల్‍రాజు కల్పించుకున్నారు. కేరింత కోసం ప్రత్యేకంగా తీసుకున్న బిల్డింగ్‍లో ఆడిషన్స్ పెట్టామని, అప్పుడు విజయ్ కూడా వచ్చారని అన్నారు. డైరెక్టర్ ఏదేదో చెప్పడంతో దాంట్లో విజయ్ విషయాన్ని చూడలేదని ఆయన తెలిపారు. తన ఆఫీస్‍కు వచ్చి ఆడిషన్ ఇచ్చానని పెళ్లి చూపులు తర్వాత విజయ్ చెబితే తనకు ఆ విషయం తెలిసిందని దిల్‍రాజు వివరణ ఇచ్చారు.

అందరికీ ఓరోజు చూపిస్తా అనుకున్నా..

ఆడిషన్‍కు వెళ్లినా సెలెక్ట్ కాకపోవటంతో తాను అప్పుడు హర్ట్ అయ్యానని విజయ్ దేవరకొండ చెప్పారు. వీళ్లందరికీ ఓ రోజు చూపిస్తా అని అనుకున్నానని చెప్పారు. ఇప్పుడు దిల్‍రాజుతో ఏప్రిల్ 5వ తేదీ ఒక బిగ్ హిట్ ఇస్తే అందరికీ ఓ శాంతి అని విజయ్ అన్నారు.

లైగర్ సినిమా తర్వాత తాను ఓ నిర్ణయం తీసుకున్నట్టు విజయ్ దేవరకొండ చెప్పారు. మూడు సినిమాల వరకు రిజల్ట్ గురించి మాట్లాడకుండా, మూసుకొని కూర్చుంటా అని శిక్ష విధించుకున్నానని విజయ్ చెప్పారు.

ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ హిట్ గీతగోవిందం తర్వాత విజయ్ - పరుశురామ్ కాంబో మళ్లీ రిపీట్ అయింది. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ పాటలు మంచి రెస్పాన్స్ రాగా.. ఇటీవలే వచ్చిన ట్రైలర్ కూడా అదిరిపోయింది.

ఫ్యామిలీ స్టార్ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రంలో కుటుంబ బాధ్యతలను మోసే మధ్యతరగతి యువకుడి పాత్రను పోషించారు విజయ్ దేవరకొండ. ట్రైలర్లో మృణాల్ ఠాకూర్ లుక్ మరోసారి సూపర్‌గా ఉంది.

IPL_Entry_Point