Vijay Deverakonda: రష్మిక పుట్టిన రోజున ఫ్యామిలీ స్టార్ రిలీజ్.. ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఏమన్నారంటే..
Vijay Deverakonda - Family Star: రష్మిక మందన్నా పుట్టిన రోజున ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవుతుండడం గురించి విజయ్ దేవరకొండకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
Family Star Movie - Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ సహా మూవీ టీమ్ చాలా జోరుగా ప్రమోషన్లు చేస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియల్స్ నటీమణులతో విజయ్ దేవరకొండ ముచ్చటించారు. ఫ్యామిలీ స్టార్‌తో కిట్టీ పార్టీ అంటూ ఈ చిట్‍చాట్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్‍కు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది.
హీరోయిన్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ కొన్నేళ్లుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో వారు సైలెంట్‍గా ఉన్నా.. వారు లవ్‍లో ఉన్నారని కొన్నిసార్లు పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చారు. అయితే, యాదృచ్ఛికంగా రష్మిక పుట్టిన రోజైన ఏప్రిల్ 5వ తేదీనే ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవుతోంది. దీనిపై విజయ్‍కు ఈ కిట్టీ పార్టీలో ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు.
లక్కీ అనుకుంటున్నా
ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రీలీజ్ అవుతోంది కదా.. ఆ తేదీన ఏదైనా స్పెషాలిటీ ఉందా అని విజయ్ దేవరకొండను ఓ నటి అడిగారు. దీనికి స్పందిస్తూ చాలా హాలీడేస్ ఉన్నాయి ఆ సమయంలో అని విజయ్ అన్నారు. దీంతో అక్కడ ఉన్న వారు నవ్వారు. “కోఇన్సిడెన్స్ ఇంకేదో ఉంది.. అదే రష్మిక మంధాన బర్త్‌డే అనుకుంటా” అని వారు అడిగారు. దీనికి విజయ్ ఆన్సర్ ఇచ్చాడు. “అవును రష్మిక బర్త్‌డే. అది మాకు లక్కీ అవుతుందని అనుకుంటున్నా” అని విజయ్ దేవరకొండ అన్నారు.
ఫ్యామిలీ స్టార్‌లో రష్మిక!
ఫ్యామిలీ స్టార్ చిత్రంలో రష్మిక మందన్నా ఓ పాటలో కాసేపు కనిపిస్తారని రూమర్లు ఉన్నాయి. వెడ్డింగ్ సాంగ్ అయిన కల్యాణి వచ్చా.. వచ్చా పాటలో రష్మిక కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని ఇప్పటి వరకు సీక్రెట్‍గానే ఉంచింది మూవీ టీమ్. ఆ పాట లిరికల్ వీడియోలోనూ రష్మికను చూపించలేదు.
ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ - డైరెక్టర్ పరుశురామ్ కాంబో రెండోసారి వస్తోంది. గతంలో వారిద్దరి కాంబినేషన్‍లో వచ్చిన గీతగోవిందం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పాటలు ఇప్పటికే బాగా పాపులర్ అవడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో హైప్ బాగా పెరిగింది. అందులోనూ ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ దూకుడుగా చేస్తోంది. ఇటీవల హోలీ వేడుకలను ప్రజలతో జరుపుకున్నారు హీరో విజయ్, హీరోయిన్ మృణాల్.
ఫ్యామిలీ స్టార్ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు. ఇప్పటి వరకు వచ్చిన మూడు పాటలు పాపులర్ ఆకట్టుకున్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించారు. ట్రైలర్లో విజయ్ దేవరకొండ డైలాగ్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‍లా ఈ చిత్రంలో నటించారు రౌడీ హీరో. దీంతో ఆసక్తి నెలకొంది. ఉగాది పండుగకు నాలుగు రోజుల ముందు వస్తుండటం కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్‍గా ఉంది.