Guppedantha Manasu August 29th Episode: మ‌ను...జ‌గ‌తి కొడుకే - ట్విస్ట్ రివీల్ - దేవ‌యాని విల‌న్ అని తెలుసుకున్న రిషి-guppedantha manasu august 29th episode anupama reveals truth about manu parents guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu August 29th Episode: మ‌ను...జ‌గ‌తి కొడుకే - ట్విస్ట్ రివీల్ - దేవ‌యాని విల‌న్ అని తెలుసుకున్న రిషి

Guppedantha Manasu August 29th Episode: మ‌ను...జ‌గ‌తి కొడుకే - ట్విస్ట్ రివీల్ - దేవ‌యాని విల‌న్ అని తెలుసుకున్న రిషి

Nelki Naresh Kumar HT Telugu
Aug 29, 2024 07:31 AM IST

Guppedantha Manasu August 29th Episode: గుప్పెడంత మ‌న‌సు ఆగ‌స్ట్ 29 ఎపిసోడ్‌లో రిషి, మ‌ను క‌వ‌ల‌లు అనే నిజం జ‌గ‌తి రాసిన లెట‌ర్ ద్వారా మ‌హేంద్ర‌కు తెలిసిపోతుంది. అనుప‌మ కూడా మ‌ను క‌న్న‌త‌ల్లి జ‌గ‌తి అనే నిజం కొడుకుకు చెబుతుంది.

గుప్పెడంత మ‌న‌సు ఆగ‌స్ట్ 29 ఎపిసోడ్‌
గుప్పెడంత మ‌న‌సు ఆగ‌స్ట్ 29 ఎపిసోడ్‌

Guppedantha Manasu August 29th Episode: నా తండ్రి మ‌హేంద్ర అనే నిజం నాకు తెలిసిపోయింద‌ని అనుప‌మ‌తో అంటాడు మ‌ను. ఇక‌నైనా నా పుట్టుక గురిం, త‌ల్లిదండ్రుల గురించి చెప్ప‌మ‌ని అనుప‌మ‌ను అడుగుతాడు మ‌ను. నువ్వు భ‌య‌ప‌డిన‌ట్లుగా మ‌హేంద్ర‌ను నేను ఏం చేయ‌లేద‌ని, నా ఎమోష‌న్స్‌ను కంట్రోల్ చేసుకున్నాన‌ని అనుప‌మ‌తో అంటాడు మ‌ను. అస‌లు నా క‌న్న త‌ల్లివి నువ్వేనా అని అనుప‌మ‌ను నిల‌దీస్తాడు మ‌ను.

నువ్వు కాక‌పోతే ఇంకెవ‌రూ...త‌ను ఎలా ఉంటుంది..ఎక్క‌డుంది...అస‌లు మా అమ్మ బ‌తికే ఉందా, చ‌నిపోయిందా...నేను ఉన్నాన‌ని త‌న‌కు తెలుసా అని అనుప‌మ‌ను ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు అడుగుతాడు మ‌ను. ఎంత అడిగినా అనుప‌మ స‌మాధానం చెప్ప‌కోవ‌డం మ‌ను స‌హించ‌లేక‌పోతాడు. గ‌న్ తీసుకొని త‌న త‌ల‌పై గురిపెట్టుకుంటాడు.

రిషి, మ‌ను క‌వ‌ల పిల్ల‌లు...

జ‌గ‌తి రాసిన లెట‌ర్ ద్వారా రిషి, మ‌ను ట్విన్స్ అనే విష‌యం మ‌హేంద్ర‌కు తెలిసిపోతుంది. రిషి, మ‌ను సొంత అన్న‌ద‌మ్ముల‌ని లెట‌ర్‌లో రాస్తుంది జ‌గ‌తి. అనుప‌మ‌కు, త‌న‌కు ఉన్న స్నేహానికి గుర్తుగా...పుట్టిన క‌వ‌ల పిల్ల‌ల్లో మ‌నును ఆమెకు ఇచ్చాన‌ని, క‌న్న త‌ల్లి కంటే ఎక్కువ ప్రేమ‌గా మ‌నును అనుప‌మ పెంచెపెద్ద‌చేసింద‌ని ఆ లెట‌ర్‌లో రాస్తుంది జ‌గ‌తి.

ఈ నిజం మీకు తెలిసే స‌రికి నేనుబ‌తికి ఉంటానో లేదో తెలియ‌దు...అందుకే ఈ లెట‌ర్ రాస్తున్నాన‌ని జ‌గ‌తి పేర్కొంటుంది. నీ కొడుకును నీకు దూరం చేసినందుకు క్ష‌మించ‌మ‌ని మ‌హేంద్ర‌ను ఉద్దేశించి లెట‌ర్‌లో రాస్తుంది జ‌గ‌తి. ఆ లెట‌ర్ చ‌ద‌వ‌గానే ఎమోష‌న‌ల్ అవుతాడు మ‌హేంద్ర‌.

నిజం చెప్పిన అనుప‌మ‌...

మ‌రోవైపు అనుప‌మ కూడా మ‌నుకు నిజం చెప్పేస్తుంది. నువ్వు జ‌గ‌తి కొడుకువేన‌ని మ‌నుతో అంటుంది. నాకు పిల్ల‌లు అంటే చాలా ఇష్టం. కానీ నాకు పిల్ల‌లు పుట్ట‌ర‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో పెళ్లి కి దూరంగా ఉన్నాన‌ని, నేను ప‌డుతోన్న ఆవేద‌న‌, బాధ చూడ‌లేక న‌న్ను అమ్మ‌గా మార్చ‌డం కోసం త‌న‌కు పుట్టిన బిడ్డ‌ను జ‌గ‌తి నాకు ఇచ్చింద‌ని ఇన్నాళ్లు త‌న మ‌న‌సులో దాచుకున్న నిజాలు మొత్తం మ‌నుకు చెప్పేస్తుంది అనుప‌మ‌.

అమ్మ అని పిలిచే అదృష్టం...

నిన్ను నాకు వ‌రంగా ఇచ్చి అమ్మ అని పిలుపించుకునే అదృష్టాన్ని జ‌గ‌తి నాకు ఇచ్చింద‌ని చెప్పి అనుప‌మ ఎమోష‌న‌ల్ అవుతుంది. ఆది పాప‌మో పుణ్య‌మో నాకు తెలియ‌దు...నిన్ను మాత్రం ఏ లోటు రాకుండా పెంచాన‌ని, తండ్రి బాధ్య‌త‌ల్ని కూడా నేనే తీసుకొని ప్ర‌తి క్ష‌ణం కంటికి రెప్ప‌లా నిన్ను కాపాడుకున్నాన‌ని మ‌నుతో అంటుంది అనుప‌మ‌. తండ్రి లేక‌పోవ‌డ‌మే నాకు శాప‌మైంది. నీకు బాధ‌ను మిగిల్చింద‌ని చెప్పి మ‌నును క్ష‌మించ‌మ‌ని అడుగుతుంది అనుప‌మ.

ముగింపు ప‌ల‌కాల్సిందే...

ఎండీ సీట్ కోసం జ‌గ‌తిని శైలేంద్ర పెట్టిన ఇబ్బందులు మొత్తం లెట‌ర్ ద్వారా తెలుసుకొని మ‌హేంద్ర షాక‌వుతాడు. ఆవేశం ప‌ట్ట‌లేక‌పోతాడు. ఇదంతా తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నావ‌ని, ఇప్పుడే వాళ్ల‌కు శాశ్వ‌తంగా ముగింపు ప‌ల‌కాల్సిందేన‌ని కొడుకుతో అంటాడు మ‌హేంద్ర‌.

వాళ్లు చేసిన దుర్మార్గాలు, ఆరాచ‌కాల‌కు ఎన్నిసార్లు చంపిన త‌ప్పులేదు...కానీ వాళ్ల‌ను చంపితే మ‌నం త‌ప్పు చేసిన వాళ్ల‌మే అవుతామ‌ని తండ్రికి స‌ర్ధిచెబుతాడు రిషి. చంప‌డం ప‌రిష్కారం కాద‌ని, వాళ్ల‌ను ఏం చేయ‌బోతున్నాన‌న్న‌ది మీరే చూస్తార‌ని తండ్రితో అంటాడు రిషి.

కుప్ప‌కూలిన దేవ‌యాని...

నేను రంగాను కాదు రిషిని అనే విష‌యం స‌రోజ ద్వారా అన్న‌య్య శైలేంద్ర‌కు తెలిసిపోయింద‌ని తండ్రికి చెబుతాడు రిషి. నేనే ప్లాన్ చేసి అన్న‌య్య‌కు ఈ నిజం తెలిసేలా చేశాన‌ని అంటాడు. మ‌రోవైపు ఇన్నాళ్లుగా త‌మ‌ను రంగాగా న‌మ్మించింది రిషి అని తెలియ‌గానే దేవ‌యాని కుప్ప‌కూలిపోతుంది.

శైలేంద్ర కూడ తెగ టెన్ష‌న్ ప‌డ‌తాడు. నిజ‌మైన రంగాను తాను క‌లిశాన‌ని త‌ల్లితో చెబుతాడు శైలేంద్ర‌. వ‌సుధార‌, రిషి క‌లిసి మ‌న‌ల్ని దెబ్బ‌కొట్ట‌డానికే ఈ డ్రామా ఆడార‌ని శైలేంద్ర చెప్ప‌గానే దేవ‌యాని వ‌ణికిపోతుంది. గుండెల్లో ద‌డ‌గా ఉంద‌ని, కాళ్లు చేతులు ఆడ‌టం లేద‌ని భ‌య‌ప‌డుతుంది.

రిషి క్ష‌మించ‌డు...

రిషిని తీసుకొచ్చి మ‌న గొయ్యి మ‌న‌మే త‌వ్వుకున్నామ‌ని, మ‌న నేర చ‌రిత్ర ఎవ‌రికైతే తెలియ‌కూడ‌ద‌ని అనుకున్నావో వాడికే తెలిసేలా చేశామ‌ని కంగారు ప‌డుతుంది దేవ‌యాని. రిషిని నాశ‌నం చేయాల‌ని ఇన్నాళ్లు ప్ర‌య‌త్నించింది మ‌న‌మే అని తెలిస్తే మ‌న అంతు చూడ‌కుండా వ‌దిలిపెట్ట‌డ‌ని, ఇంట్లో చోటు కూడా లేకుండా చేస్తాడ‌ని దేవ‌యాని టెన్ష‌న్ ప‌డుతుంది. మ‌నం చేసిన దుర్మార్గాలు, పాపాలు తెలిసిన వాళ్లు ఎవ‌రూ భూమిపై ఉండ‌టానికి వీలులేద‌ని, నా రాక్ష‌స‌త్వాన్ని వాళ్ల‌కు చూపిస్తాన‌ని, అంద‌రిని ఒకేసారి పైకి పంపిస్తాన‌ని శైలేంద్ర ఆవేశ‌ప‌డ‌తాడు.

నా మ‌న‌సు మొక్క‌లైపోయింది...

పెద్ద‌మ్మ‌, అన్న‌య్య‌లే త‌న శ‌త్రువులు అని తెలిసి రిషి కూడా ఎమోష‌న‌ల్ అవుతాడు. దేవ‌యానిని క‌న్న‌త‌ల్లి కంటే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ్డాను. ఆరాధించాన‌ని రిషి అంటాడు. న‌న్ను పెంచిన పెద్ద‌మ్మ నా ప్రాణాలు తీయాల‌ని అనుకుంటుంద‌ని తెలిసి నా మ‌న‌సు ముక్కలైపోయింద‌ని రిషి చెబుతాడు.

మా పెద్ద‌మ్మ‌, అన్న‌య్య‌ గురించి నువ్వు ఎన్నిసార్లు నిజం చెప్పిన నేను ప‌ట్టించుకోలేద‌ని వ‌సుధార‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు. త‌ప్పుచేశాన‌ని అంటాడు. ప‌ద‌వుల మీద ఉన్న ఆశ‌తో నీ ప్రాణాలు తీస్తార‌ని ఊహించ‌లేక‌పోయాన‌ని, న‌న్ను కాపాడుకోవ‌డం కోసం నువ్వు ఎన్నో బాధ‌లు, క‌ష్టాలు ప‌డ్డావ‌ని జ‌గ‌తి ఫొటో ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి క‌న్నీళ్లు పెట్టుకుంటాడు రిషి. న‌న్ను కాపాడుకోవ‌డానికి నువ్వు, వ‌సుధార, మ‌హేంద్ర ప్ర‌తిక్ష‌ణం న‌ర‌క‌యాత‌న ప‌డ్డార‌ని తెలిసి అర్థ‌మ‌వుతుంద‌ని రిషి అంటాడు.

మ‌హేంద్ర ఆవేశం...

రిషి, వ‌సుధార‌ల‌ను రూమ్‌లో పెట్టి బ‌య‌టినుంచి లాక్ చేస్తాడు మ‌హేంద్ర‌. శైలేంద్ర‌ను నేను ఏం చేయాలో నాకు తెలుసున‌ని అంటాడు. ఇప్పుడే శైలేంద్ర‌ను చంపేస్తాన‌ని ఆవేశంగా బ‌య‌లుదేరుతాడు. రిషి, వ‌సుధార ఎంత చెప్పిన విన‌డు.