Guppedantha Manasu Sequel: రిషిధార ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు సీక్వెల్ రానుందా?-star maa planning to make guppedantha manasu serial sequel telugu tv serials ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Sequel: రిషిధార ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు సీక్వెల్ రానుందా?

Guppedantha Manasu Sequel: రిషిధార ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు సీక్వెల్ రానుందా?

Nelki Naresh Kumar HT Telugu
Aug 24, 2024 11:18 AM IST

Guppedantha Manasu Sequel: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు త్వ‌ర‌లోనే ఎండ్‌కార్డ్ ప‌డ‌నుంది. ఈ సీరియ‌ల్ షూటింగ్ ముగిసిన‌ట్లు ఇటీవ‌లే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఈ సీరియ‌ల్‌కు సీక్వెల్ రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. గుప్పెడంత మ‌న‌సు క్లైమాక్స్ రోజు సీక్వెల్‌ను అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu Sequel: స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు త్వ‌ర‌లోనే ఎండ్‌కార్డ్ ప‌డ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. క్లైమాక్స్ ఎపిసోడ్ తాలూకు షూటింగ్‌ను పూర్తిచేశారు. కానీ ఎండింగ్ డేట్ ఎప్పుడున్న‌ది మాత్రం మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు.

స‌డెన్‌గా సీరియ‌ల్‌కు శుభం కార్డు వేసి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేయాల‌నే ప్లాన్‌లో మేక‌ర్స్ ఉన్న‌ట్లు చెబుతోన్నారు. ఆగ‌స్ట్ 31న ఈ సీరియ‌ల్ ముగియ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ట్విస్ట్‌ల‌న్నీ రివీల్‌...

శుభం కార్డు వేయాల‌ని ఫిక్సైన మేక‌ర్స్ సీరియ‌ల్‌లోని మెయిన్ ట్విస్ట్‌ల‌న్నీ రివీల్ చేశారు. శైలేంద్ర‌, దేవ‌యాని నిజ‌స్వ‌రూపం రిషి తెలుసుకున్న‌ట్లుగా చూపించారు. వారి నోటితోనే దారుణాలు బ‌య‌ట‌పెట్టి రిషి బుద్దిచెప్ప‌డం ఒక్క‌టే మిగిలిపోయింది. తాము తండ్రీకొడుకులం అనే నిజం మ‌ను, మ‌హేంద్ర‌ల‌కు తెలిసిపోయింది.

వారి మ‌ధ్య అపార్థాలు, అపోహ‌లు తొల‌గిపోయి ఒక్క‌ట‌వ్వ‌డం కూడా ఖాయంగానే క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఇన్నాళ్లు రంగా, రిషి వేర్వేరు అంటూ కొన‌సాగిన‌ స‌స్పెన్స్ డ్రామాపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. మిగిలిన ప్ర‌శ్న‌ల‌కు నెక్స్ట్ వీక్‌లో స‌మాధానాలు ఇస్తూ ప్రాప‌ర్ ఎండింగ్‌తో గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌ను ముగించ‌నున్న‌ట్లు స‌మ‌చారం.

సీక్వెల్ అనౌన్స్‌మెంట్‌...

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ చివ‌రి ఎపిసోడ్‌లో ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ ఓ గుడ్‌న్యూస్ వినిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. గుప్పెడంత మ‌న‌సు సీక్వెల్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రిషి, వ‌సుధార పాత్ర‌ల్లో త‌మ కెమిస్ట్రీతో ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ ఆడియెన్స్‌ను మెప్పించారు. నిజ‌మైన ల‌వ‌ర్స్ మాదిరిగానే సీరియ‌ల్‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచారు. అస‌లు పేర్ల కంటే సీరియ‌ల్ పేర్ల‌తోనే ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ‌ ఫేమ‌స్ అయ్యారు.

ఫ్యాన్స్ డిస‌పాయింట్‌...

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగియ‌నుంద‌ని తెలిసి రిషి, వ‌సుధార ఫ్యాన్స్ డిస‌పాయింట్ అయ్యారు.రిషిధార‌ల‌కు బుల్లితెర ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు సీక్వెల్‌ను తెర‌కెక్కించాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

గుప్పెడంత మ‌న‌సు 2 పేరుతోనే ఈ సీక్వెల్ తెర‌కెక్క‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సీక్వెల్‌లో రిషి, వ‌సుధార అవే పేర్ల‌తో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. క్యారెక్ట‌ర్స్ అవే అయినా సీక్వెల్ క‌థ మాత్రం గుప్పెడంత మ‌న‌సుతో సంబంధం లేకుండా కొత్త‌గా సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

కొత్త కథతో…

గుప్పెడంత మ‌న‌సులోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌తో పాటు మ‌రికొంత కొత్త ఆర్టిస్టులు కూడా ఈ సీక్వెల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. కార్తీక దీపం సీరియ‌ల్‌కు కార్తీక దీపం 2 పేరుతో సీక్వెల్‌ను తెర‌కెక్కించారు.

ఈ సీక్వెల్ స‌క్సెస్ కావ‌డంతోనే గుప్పెడంత మ‌న‌సు 2ను ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది.గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ 2020లో ప్రారంభ‌మైంది. మొత్తం నాలుగేళ్ల పాటు 1160కిపైగా ఎపిసోడ్స్‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఈ సీరియ‌ల్ అల‌రించింది.

ప్రియ‌మైన నాన్న‌కు...

ఓ వైపు గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో న‌టిస్తూనే మ‌రోవైపు సినిమాల‌పై ఫోక‌స్ పెడుతోన్నాడు ముఖేష్ గౌడ‌. ఇటీవ‌లే ప్రియ‌మైన నాన్న‌కు పేరుతో ఓ బైలింగ్వ‌ల్ మూవీ అనౌన్స్‌చేశాడు. ఈ సినిమాకోసం త‌న పేరును నిహార్ ముఖేష్‌గా మార్చుకున్నాడు ముఖేష్ గౌడ‌.