Karthika Deepam Sequel: కార్తీక దీపం సీరియ‌ల్‌కు సీక్వెల్ వ‌స్తోంది - మ‌ళ్లీ వంట‌ల‌క్క రీఎంట్రీ!-star maa officially announces karthika deepam serial second season title as karthika deepam idi nava vasantham ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Sequel: కార్తీక దీపం సీరియ‌ల్‌కు సీక్వెల్ వ‌స్తోంది - మ‌ళ్లీ వంట‌ల‌క్క రీఎంట్రీ!

Karthika Deepam Sequel: కార్తీక దీపం సీరియ‌ల్‌కు సీక్వెల్ వ‌స్తోంది - మ‌ళ్లీ వంట‌ల‌క్క రీఎంట్రీ!

Nelki Naresh Kumar HT Telugu
Feb 20, 2024 06:02 AM IST

Karthika Deepam Sequel: కార్తీక దీపం సీరియ‌ల్‌కు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్‌కు కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం అనే పేరును ఖ‌రారు చేశారు. ఈ సీరియ‌ల్ ప్రోమోను స్టార్ మా ఇటీవ‌ల రిలీజ్ చేసింది.

 కార్తీక దీపం సీరియ‌ల్‌
కార్తీక దీపం సీరియ‌ల్‌

Karthika Deepam Sequel: సినిమాల‌కు సీక్వెల్స్ రావ‌డం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. ఓ సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్స్‌ను ప్ర‌క‌టించి ఆడియెన్స్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు. కానీ ఓ సీరియ‌ల్‌కు సీక్వెల్ రావ‌డం మాత్రం చాలా అరుదునే చెప్పుకోవాలి. బుల్లితెర ప్రేక్ష‌కుల్ని చాలా ఏళ్ల పాటు అల‌రించిన కార్తీక దీపం సీరియ‌ల్‌కు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ టైటిల్‌ను సీరియ‌ల్ యూనిట్ రివీల్ చేసింది. ఈ సీక్వెల్‌కు కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం అనే పేరును క‌న్ఫామ్ చేశారు. కార్తీక దీపం న‌వ‌వ‌సంతం ప్రోమోను రిలీజ్ చేశారు. తెలుగు లోగిళ్లు మ‌రువ‌ని క‌థ కొత్త వెలుగుల‌తో మ‌ళ్లీ వ‌స్తోంది అని మేక‌ర్స్ ఈ ప్రోమోలో సీక్వెల్ గురించి వెల్ల‌డించారు. శౌర్య క్యారెక్ట‌ర్‌ను మాత్ర‌మే ఈ ప్రోమోలో చూపించారు.

ప్రోమోలో శౌర్య క్యారెక్ట‌ర్ మాత్ర‌మే...

నాకు చీక‌టి అంటే భ‌యం...ఈ చీక‌టిలో నాకు ధైర్యాన్ని ఇచ్చే వెలుగు మా అమ్మ‌. క‌ష్టాల నుంచి కాపాడే మా నాన్న ఎక్క‌డున్నాడో తెలియ‌దు. కానీ అమ్మైనా నాన్నైనా...నాకు మా అమ్మే. ఇంత‌కీ నా పేరు ఏంటో తెలుసా శౌర్య‌. ఇప్పుడు నేను చెప్ప‌బోయేది మా అమ్మనాన్న‌ల క‌థ అంటూ శౌర్య చెప్పిన డైలాగ్స్ ప్రోమోలో ఆక‌ట్టుకుంటున్నాయి. త్వ‌ర‌లోనే స్టార్ మా ఛానెల్‌లో కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం సీరియ‌ల్ టెలికాస్ట్ మొద‌లుకానున్న‌ట్లు స‌మాచారం.

వంట‌ల‌క్క రీఎంట్రీ...

కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం సీరియ‌ల్‌తో మ‌ళ్లీ వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు ఇద్ద‌రు రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం కార్తీక దీపంలో క‌నిపించిన శౌర్య‌, హిమ‌, మోనిత పాత్ర‌లు కూడా ఈ సీక్వెల్ ఉండ‌టం ఖాయంగానే క‌నిపిస్తోంది. వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు కెమిస్ట్రీ ఈ సీరియ‌ల్‌కు హైలైట్‌గా నిలిచింది.

కార్తీక దీపం సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క పాత్ర చాలా పాపుల‌ర్ అయ్యింది. ఈ క్యారెక్ట‌ర్‌లో ప్రేమీ విశ్వ‌నాథ్ న‌ట‌న‌కు బుల్లితెర ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. డాక్ట‌ర్ బాబుగా నిరుప‌మ్‌కు ఈ సీరియ‌ల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. 1569 ఎపిసోడ్స్‌తో దాదాపు ఆరేళ్ల పాటు కార్తీక దీపం సీరియ‌ల్ టెలికాస్ట్ అయ్యింది. తెలుగులో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా నిలిచింది. త‌మిళం, మ‌ల‌యాళం, మ‌రాఠీ, బెంగాళీతో పాటు ప‌లు భాష‌ల్లోకి ఈ సీరియ‌ల్ డ‌బ్ అయ్యింది.

కొవిడ్ టైమ్ నుంచి డౌన్‌...

కొవిడ్ నుంచి ఈ సీరియ‌ల్ బ్యాడ్‌టైమ్ స్టార్ట‌య్యింది. లాక్‌డౌన్ కార‌ణంగా కొద్ది రోజుల పాటు షూటింగ్ నిలిచిపోవ‌డం, వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల‌ను చ‌నిపోయిన‌ట్లుగా చూపించ‌డంతో టీఆర్‌పీ రేటింగ్స్ దారుణంగా ప‌డిపోయాయి. శౌర్య‌, హిమ క్యారెక్ట‌ర్స్‌ను పెద్ద‌వాళ్లు అయిన‌ట్లుగా చూపించి కొత్త క్యారెక్ట‌ర్‌తో కొన్నాళ్లు సీరియ‌ల్‌ను న‌డిపించారు. కానీ అనుకున్న స్థాయిలో డ్రామా పండ‌క‌పోవ‌డంతో స‌రైన ముగింపు లేకుండా అర్థాంత‌రంగా కార్తీక దీపం సీరియ‌ల్‌ను ఎండ్ చేశారు.

వంట‌ల‌క్క...డాక్ట‌ర్ బాబు...

కార్తీక దీపం సీరియ‌ల్‌లో డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క పెళ్లిచేసుకుంటారు. కానీ మోనిత కుట్ర‌ల వ‌ల్ల డాక్ట‌ర్ బాబుకు వంట‌ల‌క్క దూర‌మ‌వుతుంది. వారి క‌వ‌ల పిల్ల‌ల్లో హిమ తండ్రి ద‌గ్గ‌ర‌, శౌర్య త‌ల్లి ద‌గ్గ‌ర పెరుగుతారు. మోనిత కుట్ర‌ల‌ను డాక్ట‌ర్ బాబు ఎలా తెలుసుకున్నాడు? డాక్ట‌ర్ బాబుపై ప్రేమ‌తో వంట‌ల‌క్కను మోనిత ఎన్ని ఇబ్బందుల‌కు గురిచేసింది? విడిపోయిన త‌మ త‌ల్లిదండ్రుల‌ను శౌర్య‌, హిమ క‌ల‌ప‌గ‌లిగారా? లేదా? అన్న‌ది కార్తీక దీపం సీరియ‌ల్‌లో చూపించారు.

IPL_Entry_Point