Aadikeshava Trp: థియేట‌ర్ల‌లో, ఓటీటీలో డిజాస్ట‌ర్ - బుల్లితెర‌పై అదొర‌గొట్టిన వైష్ణ‌వ్‌తేజ్ మూవీ - బ్రో రికార్డ్ బ్రేక్-vaishnav tej adikeshava gets higher trp rating than pawan kalyan bro ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aadikeshava Trp: థియేట‌ర్ల‌లో, ఓటీటీలో డిజాస్ట‌ర్ - బుల్లితెర‌పై అదొర‌గొట్టిన వైష్ణ‌వ్‌తేజ్ మూవీ - బ్రో రికార్డ్ బ్రేక్

Aadikeshava Trp: థియేట‌ర్ల‌లో, ఓటీటీలో డిజాస్ట‌ర్ - బుల్లితెర‌పై అదొర‌గొట్టిన వైష్ణ‌వ్‌తేజ్ మూవీ - బ్రో రికార్డ్ బ్రేక్

Nelki Naresh Kumar HT Telugu
Feb 16, 2024 11:34 AM IST

Aadikeshava Trp: వైష్ణ‌వ్ తేజ్ ఆదికేశ‌వ మూవీ బుల్లితెర‌పై అద‌ర‌గొట్టింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో మూవీ కంటే ఎక్కువ‌గా టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

ఆదికేశ‌వ టీఆర్‌పీ రేటింగ్‌
ఆదికేశ‌వ టీఆర్‌పీ రేటింగ్‌

Aadikeshava Trp: థియేట‌ర్ల‌లో పాటు ఓటీటీలో డిజాస్ట‌ర్‌గా నిలిచిన వైష్ణ‌వ్‌తేజ్ ఆదికేశ‌వ మూవీ బుల్లితెర‌పై మాత్రం అద‌ర‌గొట్టింది. వైష్ణ‌వ్‌తేజ్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకున్న సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఉప్పెన‌ త‌ర్వాత మ‌రో క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్నాడు మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్‌. ఆదికేశ‌వ‌తో అత‌డు తిరిగి విజ‌యాల బాట ప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావించారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ ఆక‌ట్టుకున్నాయి.

స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ క‌థ‌లో మార్పులు చేర్పులు చేయ‌డంతో రిలీజ్‌కు ముందు అభిమానుల్లో అంచ‌నాలు రేకెత్తించింది. కానీ అవుట్‌డేటెడ్ స్టోరీ లైన్ కార‌ణంగా మొద‌టి ఆట నుంచే ఈ సినిమా నెగెటివ్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న‌ది. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే థియేట‌ర్ల‌లో క‌నిపించ‌కుండాపోయింది. ఫుట్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో కేవ‌లం మూడు కోట్ల వ‌ర‌కు మాత్ర‌మే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఎనిమిదిన్న‌ర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ నిర్మాత‌ల‌కు ఐదున్న‌ర కోట్ల‌కుపైగా న‌ష్టాల‌ను మిగిల్చింది.

ఓటీటీలో సేమ్ రిజ‌ల్ట్‌...

థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆదికేశ‌వ మూవీ రిలీజైంది. అక్క‌డ కూడా థియేట‌ర్ రిజ‌ల్ట్ ఎదురైంది. ఓటీటీ ఆడియెన్స్ ఆదికేశ‌వ‌పై పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూప‌లేదు. ఇటీవ‌లే ఆదికేశ‌వ మూవీ బుల్లితెర‌పైకి వ‌చ్చింది. స్టార్‌మా ఛానెల్‌లో టెలికాస్ట్ అయ్యింది. ఈ వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ చ‌క్క‌టి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఏకంగా 10.47 టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకున్న‌ది. ఉప్పెన త‌ర్వాత వైష్ణ‌వ్‌తేజ్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న మూవీగా నిలిచింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ‌మ్‌తేజ్ బ్రో మూవీ కంటే ఆదికేశ‌వ సినిమాకే ఎక్కువ టీఆర్‌పీ రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం. బ్రో మూవీ వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్‌కు 7.24 మాత్ర‌మే టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది.

శ్రీలీల హీరోయిన్‌...

ఆదికేశ‌వ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆదికేశ‌వ మూవీలో మ‌ల‌యాళ అగ్ర న‌టుడు జోజు జార్జ్ విల‌న్‌గా న‌టించాడు. అప‌ర్ణాదాస్ కీల‌క పాత్ర పోషించింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ మూవీని నిర్మించాడు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

ఆదికేశ‌వ క‌థ ఇదే...

బాలు స్నేహితుల‌తో క‌లిసి జులాయిగా తిరుగుతుంటాడు. చిత్ర అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డిన బాలు ఆమె కంపెనీలోనే ఉద్యోగంలో చేరుతాడు. చిత్ర‌ను ప్రేమించి పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటాడు. బాలు అస‌లు పేరు రుద్ర‌కాళేశ్వ‌ర్ అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది.

రాయ‌ల‌సీమ‌కు చెందిన చెంగారెడ్డితో అత‌డికి విరోధం ఉంటుంది. ఆ గొడ‌వ‌కు కార‌ణ‌మేమిటి? త‌న తండ్రి మ‌ర‌ణంపై బాలు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్న‌దే ఆదికేశ‌వ మూవీ క‌థ‌. ఆదికేశ‌వ మూవీకి జీవీ ప్ర‌కాష్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆదికేశ‌ల డిజాస్ట‌ర్ తో వైష్ణ‌వ్‌తేజ్ క‌థ‌ల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఓ రెండు సినిమాలు చేస్తున్నాడు.

టీ20 వరల్డ్ కప్ 2024