Aadikeshava vs Kotabommali Collection: కోట బొమ్మాలి vs ఆదికేశవ కలెక్షన్స్ - వైష్ణవ్‌తేజ్‌పై శ్రీకాంత్‌దే పై చేయి
Aadikeshava vs Kotabommali Collection: గత వారం విడుదలైన సినిమాల్లో కోట బొమ్మాళి బ్రేక్ ఈవెన్‌కు చేరువ కాగా...ఆదికేశవ సినిమా డిజాస్టర్ దిశగా సాగుతోంది. మూడు రోజుల్లో ఈ రెండు సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ ఇవే?
Aadikeshava vs Kotabommali Collection: గత వారం రిలీజైన సినిమాల్లో మెగా హీరో వైష్ణవ్‌తేజ్ ఆదికేశవతో పాటు శ్రీకాంత్ కోటబొమ్మాళి సినిమాల మధ్య పోటీ ప్రధానంగా నెలకొంది. అంతిమంగా వైష్ణవ్‌తేజ్‌పై శ్రీకాంత్‌దే పై చేయిగా మారింది. రొటీన్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఆదికేశవ సినిమా ఫస్ట్ షో నుంచే ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. మరోవైపు శ్రీకాంత్ కోట బొమ్మాళి పీఎస్ డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
తొలిరోజు 90 లక్షల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది కోట బొమ్మాలి. మౌత్ టాక్ బాగుండటంతో రెండో రోజు 80 లక్షలు వచ్చాయి. . మూడు రోజు కూడా ఈ సినిమా అటు ఇటుగా రెండు కోట్ల వరకు గ్రాస్, తొంభై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు చెబుతోన్నారు. మూడు రోజుల్లో ఈ సినిమా ఐదు కోట్లకుపైగా గ్రాస్‌ను, రెండున్నర కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. మరోవైపు ఆదికేశవ కలెక్షన్స్ రోజురోజుకు తగ్గుముఖం పడుతోన్నాయి.
తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా కోటి వరకు కలెక్షన్స్ రాబట్టింది ఈ మెగా హీరో మూవీ. నెగెటివ్ టాక్ కారణంగా రెండో రోజు వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి. కేవలం యాభై లక్షల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. మూడో రోజు కేవలం 30 లక్షల వరకు మాత్రమే వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఓవరాల్‌గా మూడు రోజుల్లో ఈ మూవీ కోటి ఎనభై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టి డిజాస్టర్ దిశగా సాగుతోంది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో ఏడు కోట్ల వరకు కలెక్షన్స్ రావాల్సిఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదికేశవ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. కోట బొమ్మాళి సినిమాకు తేజా మార్ని దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాలో శ్రీకాంత్‌తో పాటు రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్‌తో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో విజయవంతమైన నయట్టు ఆధారంగా కోట బొమ్మాళి సినిమా తెరకెక్కింది.