Guppedantha Manasu August 24th Episode: సీన్‌లోకి అసలు రంగా ఎంట్రీ - అన్నయ్యపై రిషి రివేంజ్ - దొరికిన జగతి లెటర్
Guppedantha Manasu August 24th Episode: గుప్పెడంత మనసు ఆగస్ట్ 24 ఎపిసోడ్‌లో అసలు రంగాను వసుధారకు పరిచయం చేస్తాడు రిషి. తనను ఓ ప్రమాదం నుంచి కాపాడి రంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని అంటాడు. మరోవైపు రంగా, వసుధార ఒక్కటేననే నిజం తెలిసి శైలేంద్ర షాకవుతాడు.
Guppedantha Manasu August 24th Episode: ఎండీ సీట్ కోసం సరోజను కూడా పావుగా వాడుకోవాలని ఫిక్సవుతాడు శైలేంద్ర. వసుధారపై సరోజ మనసులో ద్వేషాన్ని నింపుతాడు. మీ బావ నీకు దక్కాలంటే నేను చెప్పినట్లు చేయమని చెప్పి ఆమెను ట్రాప్‌లో ఇరికిస్తాడు.
వసుధారకు రిషి సర్‌ప్రైజ్...
వసుధారకు రిషి సర్‌ప్రైజ్ ఇస్తాడు. ఆమె తండ్రి చక్రపాణి ఇంటికి తీసుకెళతాడు. తండ్రిని చూసి వసుధార ఎమోషనల్ అవుతుంది. వసుధారను ఎలా ఉన్నావని ఒక్క మాట కూడా అడగడు చక్రపాణి. అదే మాట చక్రపాణిని అడుగుతాడు రిషి. నీ దగ్గర వసుధార ఉన్నప్పుడు అడగాల్సిన పనిలేదని అంటాడు.
అసలైన రంగా ఎంట్రీ...
ఇంతలోనే ఓ అపరిచిత వ్యక్తి వాకర్‌తో కుంటుకుంటూ వారివద్దకు వస్తాడు. అతడి ఒంటిగాయాలకు బ్యాండేజ్‌లతో కట్టు ఉంటాయి. ఎవరు ఇతడు అని రిషిని అడుగుతుంది వసుధార. ఇన్ని రోజులు ఎవరి పేరుతో తాను బయటతిరుగుతున్నానో అతడు ఇతను అని రిషి అంటాడు. అసలైన రంగా ఇతడేనని అంటాడు. అది విని వసుధార షాకవుతుంది.
రంగా ఒంటిపై దెబ్బలు...
రంగాను బుజ్జి గుర్తుపడతాడు. రంగా ఒంటిపై దెబ్బలు ఎందుకున్నాయి. అతడికి సీక్రెట్‌గా ఎందుకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు...రంగా ప్లేస్‌లో నువ్వు మా ఊరికి ఎందుకొచ్చావని రిషిని అడుగుతాడు బుజ్జి. అసలు ఏం జరుగిందని వసుధార కూడా భర్తను ప్రశ్నిస్తుంది. రంగా ఓ మెకానిక్ అని, నాపై కొందరు ఎటాక్ చేస్తోండగా..రంగా వారికి అడ్డుగా వెళ్లి తన ప్రాణాల మీదుకు తెచ్చుకున్నాడని జరిగిన కథ మొత్తం రిషి వివరిస్తాడు. రంగా ప్రాణాలు ఇబ్బందుల్లో ఉన్నాయని తెలిస్తే నానమ్మ తట్టుకోలేదని అతడి ప్లేస్‌లోకి తాను ఊరికి వెళ్లానని, చిన్నప్పుడే రంగా ఊరు వదిలిపెట్టి వెళ్లడంతో తననే అందరూ రంగా అనుకున్నారని రిషి అంటాడు.
జగతి లెటర్...
తనకు జగతి రాసిన లెటర్ ఇవ్వడానికి రంగా వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని రిషి అంటాడు. ఆ లెటర్ ఎవరూ రాశారు...అందులో ఏముందని వసుధార అడుగుతుంది. జగతి రాసిందని, అన్ని నిజాలు ఆ లెటర్ ద్వారానే బయటపడ్డాయని రిషి బదులిస్తాడు.
రంగానే రిషి...
రంగా, వసుధార ఒక్కటేనని తెలిసి శైలేంద్ర కంగారు పడతాడు. నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయని కొడుకుకు క్లాస్ ఇస్తుంది దేవయాని. అసలు అతడు రంగానే కాదని రిషి అని దేవయాని అంటుంది. వాడు రిషి కాబట్టే నువ్వు ఊరు వెళ్లినప్పుడు వసుధార నీ కంట పడకుండా దాచిపెట్టాడని, రిషి కాబట్టే ఏ భయం లేకుండా కాలేజీలో, ఇంట్లో తిరుగుతున్నాడని, రిషి కాకపోతే వసుధార వాడితో ఎందుకు కలిసి ఉంటుందని కొడుకుతో అంటుంది దేవయాని.
వసుధారపై నువ్వు ఎటాక్ చేసిన సంగతి తెలుసుకొని ఆమెను కాపాడి రిషినే ఊరికి తీసుకెళ్లి ఉంటాడని దేవయాని అనుమానం వ్యక్తం చేస్తుంది.వాడు రిషి అయితే మన గొయ్యి మనమే తీసుకున్నట్లు అవుతుందని కొడుకుతో అంటుంది దేవయాని.
రిషి డౌట్ క్లియర్...
సరోజకు ఫోన్ చేస్తాడు రిషి. వసుధారను మాట్లాడమని అంటాడు. వసుధార మాట వినగానే సరోజ ఫైర్ అవుతుంది. సరోజను కన్వీన్స్ చేయబోతుంది వసుధార. అయినా ఆమె మాటలను సరోజ వినదు. నిన్ను వదిలేది లేదని అంటుంది. నువ్వు, శైలేంద్ర కలిసే ఈ డ్రామా ఆడారంటూ కోపంగా అంటుంది. శైలేంద్రను తాను రంగాగా నమ్మిస్తున్న విషయం అతడికి తెలిసిపోయిందని సరోజ మాటలను బట్టి రిషి అర్థం చేసుకుంటాడు.
వారి నోటితోనే...
శైలేంద్ర కుట్రలు, కుతంత్రాలకు సంబంధించి జగతి మేడమ్ రాసిన లెటర్ ఆధారంగా ఉన్నప్పుడు మీ అన్నయ్యను ఎందుకు నిలదీయడం లేదని రిషిని అడుగుతుంది వసుధార. ఇన్ని చేసిన వాళ్లకు ఆ లెటర్ అబద్ధం అని నిరూపించడం పెద్ద విషయం కాదని రిషి సమాధానమిస్తాడు. వాళ్ల నోటితోనే ఈ నిజాలు బయటపెట్టిస్తానని అంటాడు. వాళ్ల నిజస్వరూపం బయటపడే టైమొచ్చిందని చెబుతాడు.
శైలేంద్ర అసహనం...
మను కు తండ్రి ఎవరనే నిజం చెబితే...అతడు మహేంద్ర చంపేస్తాడని అనుకుంటాడు. కానీ మను సైలెంట్‌గా ఉండటం చూసి శైలేంద్ర సహించలేకపోతాడు. దాంతో మహేంద్రను రెచ్చగొట్టడం మొదలుపెడతాడు. అప్పుడే రిషి, వసుధార లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఎక్కడికి వెళ్లావని రిషిని అడుగుతాడు. నేను మిస్సయినప్పుడు నన్ను కాపాడిన వ్యక్తి దగ్గరకు వెళ్లానని రిసి బదులిస్తాడు. నువ్వు ఏ పని మీద వచ్చావని శైలేంద్రను అడుగుతాడు రిషి. బాబాయ్ ఎలా ఉన్నాడో..అసలు ఉన్నాడో లేదో చూద్దామని వచ్చానని శైలేంద్ర బదులిస్తాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.