Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం ప్రాణాలకు డేంజర్.. లక్షల్లో ఖర్చు.. బాలు దగ్గర మీనా సంగతి దాచేసిన కుటుంబం-gunde ninda gudi gantalu serial october 29th episode prabhavathi blames sathyam in critical condition star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం ప్రాణాలకు డేంజర్.. లక్షల్లో ఖర్చు.. బాలు దగ్గర మీనా సంగతి దాచేసిన కుటుంబం

Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం ప్రాణాలకు డేంజర్.. లక్షల్లో ఖర్చు.. బాలు దగ్గర మీనా సంగతి దాచేసిన కుటుంబం

Sanjiv Kumar HT Telugu
Oct 29, 2024 12:03 PM IST

Gunde Ninda Gudi Gantalu Serial October 29 Episode: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో సత్యంకు మాసీవ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని, రెండు వాల్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని డాక్టర్స్ చెబుతారు. సత్యంను చూడటానికి వచ్చిన మీనాను అవమానిస్తారు. కొట్టడానికి కూడా వెళ్తుంది ప్రభావతి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 29 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 29 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉంటాడు. స్పృలో ఉండడు. బయట ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. మావయ్యకు ఏం కాదని రోహిణి ఓదార్చుతుంది. డాక్టర్ వచ్చి మాసీవ్ ఎటాక్. స్టేబుల్ అవ్వడానికి టైమ్ పడుతుంది. హార్ట్‌కు బ్లడ్ సప్లై చేసే వెజల్స్ చాలా వీక్‌గా ఉన్నాయి. బ్లడ్ ఫ్లో లెవెల్స్ చాలా బలహీనంగా ఉన్నాయి అని డాక్టర్ చెబుతాడు.

అంటే ప్రాణాలకు ప్రమాదమా. అలా ఉంటే ఏమైనా అవుతుందా అని ప్రభావతి భయంగా అడుగుతుంది. కంగారుపడకండి అమ్మా. బీపీ నార్మల్‌కు వస్తే ఆన్షియో గ్రాఫ్ చేయాల్సి వస్తుంది. అది చేస్తే తప్పా హార్ట్ పొజిషన్ మాకు పూర్తిగా అర్థం కాదు. సీనియర్ కార్డియాలజిస్ట్‌కు ఇన్ఫార్మ్ చేశాం. మార్నింగ్ ఆయన రాగానే మాట్లాడి చెబుతాం అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. మాసీవ్ అటాక్ అన్నారు. అంటే ఏంటీ అని మౌనికను బాలు అడుగుతాడు.

ముగ్గురు దరిద్రులు

ఏం లేదని మౌనిక అంటే.. గుండెపోటు ఎక్కువ వచ్చిందని మనోజ్ అంటాడు. దాంతో ప్రభావతి మరింత ఏడుస్తుంది. ఆయనకు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అలా వస్తే ఆయన ప్రాణాలకు డేంజర్ ఆ. చెప్పు రోహిణి అని ప్రభావతి బాధగా అడుగుతుంది. త్వరగా తీసుకొచ్చాం కదా. ప్రశాంతంగా ఉండండి అని రోహిణి చెబుతుంది. ఇంకెక్కడి ప్రశాంతత. ముగ్గురు కొడుకులు కన్నాం. ప్రశాంతంగా బతకొచ్చు అనుకున్నాం. కానీ, ఈ ముగ్గురు దరిద్రులు ఏరోజు అలా ఉండనివ్వలేదు అని ప్రభావతి అంటుంది.

దాంతో మనోజ్, బాలు బాధగా చూస్తారు. ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా. తాగొచ్చి ఇంత గొడవ చేశావ్. రవిగాడి వల్ల ఆయన గుండె బలహీనపడింది. నీ గొడవతో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఎలాంటివాళ్లు పుట్టార్రా. ఒక్కనాడైన ఆయన్ను మనశ్శాంతిగా ఉండనిచ్చావా. లేని గొడవలు పుట్టించావ్. ఆయనకు కానీ ఏదైనా అయిందనుకో అని ప్రభావతి అంటే.. ఆపు. ఆ నోరు ఏసుకుని ఏది మాట్లాడకు. ఆయనకు ఏం కాదు. రేపు పొద్దునకల్ల కళ్లు తెరిచి మాట్లాడుతారు అని సత్యం దగ్గరికి వెళ్తాడు బాలు.

ప్రభావతి ఏడుస్తుంటుంది. నాన్న నన్ను క్షమించు నాన్న. ఇంకెప్పుడు ఎవరితో గొడవ పడను. నువ్ బాగుండాలి నాన్న. నీకేం కాదు నాన్న. నీకేం కాదు అని బాలు అనుకుంటాడు. మరుసటి రోజు శివ కాలేజ్‌కు వెళ్తుంటే.. డబ్బులు ఇస్తానని పార్వతి అంటుంది. దానికి ఉన్నాయని శివ అంటే.. ఎప్పుడో ఇచ్చాను కదా. అయిపోలేదా అని పార్వతి అంటుంది. దాంతో ప్రభావతి దగ్గర కొట్టేసింది గుర్తు చేసుకుంటాడు శివ. అలా చూడకమ్మా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను అని శివ అంటే.. ఏమో ఎవరినీ నమ్మేలా లేదని పార్వతి అంటాడు.

చెప్పింది అర్థం చేసుకో

ఇంతలో మీనా వస్తే ఇక్కడే ఉండు. అల్లుడు గారు వస్తారేమో అని పార్వతి అంటుంది. ఆయన రారు. కేవలం నన్ను భయపెట్టాడనికే అని మీనా అంటుంది. ఒక అడుగు నువ్వే ముందు వేయాలి అని పార్వతి అంటుంది. దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి చేసి మీ ఇంటికి వెళ్లమ్మా అని పార్వతి అంటే.. నువ్ ఇంట్లోంచి వెళ్లిపో అన్నట్లు ఉంది అని మీనా అంటుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదు. చెప్పింది అర్థం చేసుకో అని పార్వతి అంటుంది.

ఆత్మ గౌరవం పేరుతో ఆత్మ వంచన చేసుకోకు అని పార్వతి అంటుంది. వీళ్ల విషయంలో బావతో నేను మాట్లాడనా అని సుమతీ అంటే.. చెంప గట్టిగా పగులుగుతుంది. ఇంకసారి వీళ్ల విషయంలో దూరితే ముందు చదువు వెలగబెట్టు అని పార్వతి హెచ్చరిస్తుంది. కనీసం మీ మావయ్యతో అయినా మాట్లాడే ప్రయత్నం చేయు అని మీనాకు చెప్పి వెళ్లిపోతుంది పార్వతి. నువ్ వెళ్లిపోయాక మావయ్య గారే దిక్కు అయ్యారు. ఆయన్ను కలిసి జరిగింది చెప్పడానికే వెళ్తున్నాను. ఆయన అర్థం చేసుకునేలా నువ్వే చేయు నాన్న అని మొక్కుకుంటుంది మీనా.

ముందు మావయ్య గారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని మౌనికకు కాల్ చేస్తుంది మీనా. మౌనిక పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. రవి మాటలు నమ్మి శ్రుతితో మాట్లాడేందుకు వెళ్లకుండా ఉండాల్సింది. కనీసం నా మాటలు మావయ్యగారు నమ్ముతురాని ఆశగా ఉన్నాను. మావయ్య గారు యూనియన్ ఆఫీస్‌కు వెళ్తారు కదా అక్కడ కలుస్తాను అని మీనా అంటుంది. మీనా ఇప్పుడు నీకు ఈ విషయం నేను చెప్పినట్లు తెలిస్తే ఏమంటారో. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చింది. చాలా సీరియస్‌గా ఉంది అని మౌనిక చెబుతుంది.

లీవ్ పెట్టేస్తాను

ఇప్పుడే వస్తున్నాను అని మీనా కంగారుగా కాల్ కట్ చేసి బయలుదేరుతుంది. ఎంతసేపు, ఎన్ని టెస్ట్‌లు చేయిస్తారు. అటు ఇటు తిప్పుతున్నారు. నాన్న ఎప్పుడు చూస్తాడు. డాక్టర్‌నే అడుగుతాను అని బాలు వెళ్లబోతుంటే మనోజ్ ఆపుతాడు. ఏదో ఒకటి నోరు జారతావ్ అని మనోజ్ అంటే.. నాకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసు అని బాలు వెళ్లిపోతాడు. అమ్మా మీరు వెళ్లి ఏమైనా తినండి అని మనోజ్ అంటే.. మీ నాన్నకు అలా ఉంటే తిండి తిప్పలు కావాలా అని ప్రభావతి అంటుంది.

రోహిణి నువ్ పార్లర్‌కు వెళ్లవా అని మనోజ్ అడిగితే.. పర్లేదు. ఈరోజుకు లీవ్ పెట్టేస్తాను అని రోహిణి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. డౌట్ వస్తుంది. ఏంటీ.. నీ పార్లర్‌లో లీవ్ పెట్టడం ఏంటీ అని మనోజ్ అంటాడు. ఇవాళ ఓపెన్ చేయొద్దని విద్యతో చెబుతాను అని రోహిణి అంటుంది. ఇంతలో మీనా రావడం చూసిన మనోజ్ వస్తుంది తాగుబోతోడి పెళ్లాం అని అంటాడు. మావయ్య ఎక్కడ, ఎలా ఉన్నారు అని మీనా అంటుంది.

నీకెంటీ సంబంధం. నిన్ను ఇంటి సభ్యుల్లో నుంచి తీసేశాం. మా ఇంట్లో అడుగుపెట్టి తెచ్చిపెట్టిన అరిష్టాలు చాలు అని ప్రభావతి అంటుంది. నువ్వెందుకు వచ్చావ్. నీ వల్ల ఆయన ఎప్పుడు అంత అవమానం పడలేదు. నీ వల్ల ఆయన గుండె బలహీన పడింది. ఏదైనా ఉంటే నువ్వు ఆ బాలు గాడు తేల్చుకోండి అని మనోజ్ అంటాడు. ఏదైనా చేస్తే కుటుంబం మంచికోసం చేయాలి. రవి పెళ్లి చేశావ్ అని రోహిణి అంటాడు. రవి చెప్పాడు కదా. వదిన తప్పు లేదని. ఇదంతా వాడు చేసిందే. అనవసరంగా వాడు వదిన లైఫ్ డిస్టర్బ్ చేశాడు మౌనిక అంటాడు.

క్షమాపణ కోరుకుంటాను

బాలు అన్నయ్య తాగొచ్చినప్పుడు మనోజ్ అన్నయ్య గొడవ పెంచకుండా ఉంటే నాన్నకు ఇలా అయ్యేదే కాదు. అందరూ కలిసి ఒక వదిన మీదే నెట్టిస్తారేంటీ అని మౌనిక అంటుంది. ఏంటీ నువ్వు దాని తరఫున మాట్లాడుతున్నావ్. ఏమాత్రం విశ్వాసం లేకుండా నమ్మకద్రోహం చేసింది. ఇంకా వెనుకేసుకోస్తున్నావా అని ప్రభావతి అంటుంది. మావయ్య కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుంటాను. ఒక్కసారి కలవనీవ్వండి అని మీనా అంటుంది.

హాస్పిటల్‌ అని చూస్తున్నా. లేకుంటే బయటకు గెంటేసేదాన్ని అని ప్రభావతి అంటుంది. అసలు నీకు అంత ధైర్యం ఎక్కడిది. పోలీసులు నాన్నను సెల్‌లో వేసినప్పుడు చెప్పలేదు. బాలు గెంటెసాక వెళ్లి తీసుకొచ్చావ్. బాలు గాడు తాగొచ్చి ఇలా చేశాడు అని మనోజ్ అంటాడు. నువ్ మాట్లాడుతున్నావా అన్నయ్య. నువ్ ఏరోజు నాన్నను బాధపెట్టలేదా. ముగ్గురు కొడుకులు తప్పు చేశారు. అమ్మ నిన్ను వెనుకేసుకురాబట్టి మంచివాడిలా మాట్లాడుతున్నావ్. అందరూ వదినపై పడతారేంటీ. నాన్నను చూడనివ్వండి అని మౌనిక అంటుంది.

నోరు ఎత్తితే చంపేస్తాను. మధ్యలో రాకు అని ప్రభావతి అంటుంది. మేము మా బాధలో ఉన్నాం. వచ్చి చిరాకు పెట్టించకు అని ప్రభావతి అంటుంది. నేను ఎక్కడికి వెళ్లాలి. ఇప్పుడు ఇదంతా వదిలేయండి అని మీనా అంటే.. ఎందుకు వదిలేయాలి. బాలు గాడు చెప్పాడు కదా నీకు సంబంధం లేదని, గెట్ అవుట్ అని మనోజ్ అంటాడు. నువ్వేందుకు నోరు జారుతున్నావ్ అని రోహిణి అంటుంది. ఇలాంటి వాళ్లతో సంస్కారంగా మాట్లాడితే ఎక్కడ వింటారు అని మనోజ్ అంటాడు.

రెండు వాల్స్ డ్యామేజ్ అయ్యాయి

ఇక్కడి నుంచి వెళ్లవే అని మీనాపై చేయి ఎత్తుతుంది ప్రభావతి. రోహిణి ఆపుతుంది. దాంతో అవమానంగా వెళ్లిపోతుంది మీనా. అప్పుడే బాలు వస్తాడు. ఏంటా అంతా అదోలా ఉన్నారని అడుగుతాడు. ఇప్పుడే అని మౌనిక చెప్పబోతుంటే ప్రభావతి ఆపుతుంది. నాన్నకు బాగానే ఉందిగా అని బాలు అంటే.. సీనియర్ డాక్టర్‌తో మాట్లాడుతానన్నావ్ ఏమైంది అని మనోజ్ అడుగుతాడు. ఆయన వస్తారట అని బాలు అంటాడు. ఇంతలో సీనియర్ డాక్టర్ వస్తాడు.

ఈ జూనియర్ డాక్టర్ కాపీ కొట్టి పాస్ అయినట్లు ఉన్నారు. ఏది సరిగ్గా చెప్పట్లేదు అని బాలు అంటే.. ఓసారి చూసి కండిషన్ ఏంటో చెప్పండి అని మనోజ్ అంటాడు. ఓహో ఇలా అడగాలా. ఇది తెలిస్తే ముందు అడగొచ్చు కదా అని బాలు అంటాడు. సత్యంను టెస్ట్ చేయడం బాలు చూస్తాడు. తర్వాత బయటకు వచ్చిన సీనియర్ డాక్టర్ సత్యం హార్ట్ రెండు వాల్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి అని చెబుతాడు. ఎంత ఖర్చు అవుతుందని మనోజ్ అడుగుతాడు.

నాలుగు లక్షలు ప్రొసీజర్‌కే అవుతుంది అని డాక్టర్ చెబుతాడు. ఏదో ఒకటి చేసి తీసుకురండిరా అని ప్రభావతి అంటే.. ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నాయిగా అని రోహిణి అంటుంది. మరోవైపు సత్యం బాగుండాలని మీనా గుడిలో పొర్లు దండాలు పెడుతుంది. ఇంటికెళ్లిన బాలుకు డాక్యుమెంట్స్ దొరక్కపోవడంతో మీనాకు కాల్ చేస్తాడు. కానీ, మీనా లిఫ్ట్ చేయదు. ఇప్పుడు నాన్న పరిస్థితి ఏంటీ అని బాలు అనుకుంటాడు. అక్కడితే నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది. 

 

Whats_app_banner