Thalapathy Vijay: రీ-రిలీజ్ చిత్రానికి ఇంత కలెక్షన్లా! మహేశ్, పవన్ కల్యాణ్ రికార్డును బద్దలుకొట్టిన దళపతి విజయ్ మూవీ-ghilli day 1 re release box office collections thalapathy vijay trisha movie gets grand opening ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay: రీ-రిలీజ్ చిత్రానికి ఇంత కలెక్షన్లా! మహేశ్, పవన్ కల్యాణ్ రికార్డును బద్దలుకొట్టిన దళపతి విజయ్ మూవీ

Thalapathy Vijay: రీ-రిలీజ్ చిత్రానికి ఇంత కలెక్షన్లా! మహేశ్, పవన్ కల్యాణ్ రికార్డును బద్దలుకొట్టిన దళపతి విజయ్ మూవీ

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 21, 2024 05:13 PM IST

Ghilli Re Release Day 1 Collections: దళపతి విజయ్ హీరోగా నటించిన ‘గిల్లీ’ చిత్రం 20 ఏళ్ల తర్వాత థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. అయితే, రీ-రిలీజ్‍లోనూ ఈ సినిమా భారీ ఓపెనింగ్ దక్కించుకుంది. నేషనల్ వైడ్ రికార్డ్ సృష్టించింది.

Thalapathy Vijay: రీ-రిలీజ్ చిత్రానికి ఇంత కలెక్షన్లా! మహేశ్, పవన్ కల్యాణ్ రికార్డును బద్దలుకొట్టిన దళపతి విజయ్ మూవీ
Thalapathy Vijay: రీ-రిలీజ్ చిత్రానికి ఇంత కలెక్షన్లా! మహేశ్, పవన్ కల్యాణ్ రికార్డును బద్దలుకొట్టిన దళపతి విజయ్ మూవీ

Ghilli Re-Release Collections:: ప్రస్తుతం రీ-రిలీజ్‍ల ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ అయిన, క్లాసిక్ చిత్రాలు కొన్ని మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. మంచి కలెక్షన్లను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దళపతి విజయ్ హీరోగా నటించిన ‘గిల్లీ’ చిత్రం ఏప్రిల్ 20న థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. 20 ఏళ్ల తర్వాత మరోసారి ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే, రీ-రిలీజ్‍ సినిమాల తొలి రోజు కలెక్షన్ల విషయంలో నేషనల్ వైడ్ రికార్డు ఈ చిత్రం సృష్టించింది.

తొలి రోజు భారీ కలెక్షన్లు

గిల్లీ చిత్రానికి రీ-రిలీజ్ తొలిరోజున భారీ వసూళ్లు వచ్చాయి. ఏకంగా ఈ సినిమా ఫస్ట్ డే సుమారు రూ.10కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రీ-రిలీజ్ చిత్రం ఈ రేంజ్‍లో వసూళ్లను రాబట్టడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. దళపతి విజయ్‍కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో మరోసారి నిరూపించింది.

ఖుషి, బిజినెస్‍మ్యాన్ రికార్డు బద్దలు

తెలుగు సినిమాలు ఖుషి, బిజినెస్‍మ్యాన్ గతేడాది రీ-రిలీజ్ సమయంలో తొలి రోజు సుమారు రూ.4కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించాయి. దీంతో రీ-రిలీజ్ మూవీ అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ల రికార్డు ఆ సినిమాల పేరుతో ఉండేది. అయితే, ఇప్పుడు దళపతి విజయ్ మూవీ గిల్లీ ఆ రికార్డును బద్దలుకొట్టింది. రీ-రిలీజ్ అయిన తొలి రోజే సుమారు రూ.10కోట్లను దక్కించుకుంది. ఇండియాలోనే రీ-రిలీజ్ విషయంలో అత్యధిక ఓపెనింగ్ డే రికార్డును గిల్లీ చిత్రం దక్కించుకుంది.

ఒక్కడు రీమేకే ఇది!

తమిళ మూవీ ‘గిల్లీ’ 2004 ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో దళపతి విజయ్‍కు జోడీగా త్రిష నటించారు. అయితే, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఒక్కడు (2003) చిత్రానికి రీమేక్‍గా గిల్లీ రూపొందింది. ఈ చిత్రం అప్పట్లో కూడా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ అయినా దుమ్మురేపుతోంది.

గిల్లీ చిత్రంలో దళపతి విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించగా.. ప్రకాశ్ రాజ్, ఆశిష్ విద్యార్థి, తనికెళ్ల భరణి, జానకి శబరీశ్, జెన్నీఫర్ కీలకపాత్రలు పోషించారు. ధరణి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీసూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు. అప్పట్లో సుమారు రూ.8కోట్ల కలెక్షన్లతో రూపొందిన ఈ మూవీ.. సుమారు రూ.30 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో సూపర్ హిట్ అయింది. అయితే, 20 ఏళ్ల నిండిన సందర్భంగా ఇప్పుడు రీ-రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజే ఏకంగా రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

విజయ్ ప్రస్తుత లైనప్ ఇలా..

దళపతి విజయ్ ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్) సినిమా చేస్తున్నారు. మానాడు ఫేమ్ వెంకట్ ప్రభు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. తదుపరి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‍తో మరో మూవీ (దళపతి 69) చేయనున్నారు విజయ్. అదే ఆయనకు చివరి చిత్రం కానుందని తెలుస్తోంది. ఇటీవలే తమిళగ వెట్రి కజగమ్ పార్టీ స్థాపించిన విజయ్.. దళపతి 69 ప్రాజెక్ట్ తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిసారించనున్నారు.

Whats_app_banner