Thalapathy 68: విజయ్ నయా సినిమాకు క్రేజీ టైటిల్.. డ్యుయల్ రోల్‍లో స్టన్నింగ్‍గా దళపతి ఫస్ట్ లుక్-thalapathy 68 thalapathy vijay first look from the greatest of all time movie revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy 68: విజయ్ నయా సినిమాకు క్రేజీ టైటిల్.. డ్యుయల్ రోల్‍లో స్టన్నింగ్‍గా దళపతి ఫస్ట్ లుక్

Thalapathy 68: విజయ్ నయా సినిమాకు క్రేజీ టైటిల్.. డ్యుయల్ రోల్‍లో స్టన్నింగ్‍గా దళపతి ఫస్ట్ లుక్

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 31, 2023 06:45 PM IST

Thalapathy 68 - The Greatest Of All Time (GOAT): దళపతి విజయ్ 68వ సినిమా టైటిల్ ఖరారైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి విజయ్ ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది.

Thalapathy 68: విజయ్ నయా సినిమాకు క్రేజీ టైటిల్.. డ్యుయల్ రోల్‍లో స్టన్నింగ్‍గా దళపతి ఫస్ట్ లుక్
Thalapathy 68: విజయ్ నయా సినిమాకు క్రేజీ టైటిల్.. డ్యుయల్ రోల్‍లో స్టన్నింగ్‍గా దళపతి ఫస్ట్ లుక్

Thalapathy 68 - The Greatest Of All Time: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లియో సినిమా ఈ ఏడాది (2023) సూపర్ హిట్ అయింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్‍బాస్టర్ కొట్టింది. తదుపరి ‘మానాడు’ ఫేమ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ సినిమా చేస్తున్నారు. విజయ్‍కు ఇది 68వ సినిమా కావటంతో ఈ ప్రాజెక్టును ‘దళపతి 68’అని పిలిచారు. అయితే, ఈ చిత్రానికి ఇప్పుడు టైటిల్ ఖరారైంది. అలాగే, ఫస్ట్ లుక్‍ను కూడా నేడు (డిసెంబర్ 31) రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

కొత్త సంవత్సరం(2024)లోకి అడుగుపెట్టబోతున్న సందర్భంలో దళపతి విజయ్ అభిమానులకు కానుకగా మూవీ యూనిట్ ‘దళపతి 68 టైటిల్’ను రివీల్ చేసింది. ఈ చిత్రానికి 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) అనే టైటిల్‍ను ఖరారైంది. ఏదైనా రంగంలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని GOAT అని పిలుస్తారు. ఈ టైటిల్‍ను విజయ్ చిత్రానికి ఫిక్స్ చేయటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డ్యుయల్ రోల్‍..

గోట్ (GOAT) టైటిల్‍తో పాటు ఈ చిత్రంలో దళపతి విజయ్ ఫస్ట్ లుక్‍ను కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో ఈ చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ప్యారచుట్ నుంచి దిగిన ఇద్దరు విజయ్‍లు పరస్పరం పిడికిళ్లను బంప్ చేసుకుంటున్నట్టు ఈ ఫస్ట్ లుక్ స్టన్నింగ్‍గా ఉంది. దీంట్లో విజయ్ ఉన్న ఓ క్యారెక్టర్ కాస్త వయసు మళ్లిన వ్యక్తిగా ఉండగా.. మరో క్యారెక్టర్ యువకుడిగా ఉన్నారు.

ఈ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ప్రభుదేవ, ప్రశాంత్, స్నేహ, లైలా, జయరాం, అజ్మల్, వీటీవీ గణేశ్, వైభవ్, ప్రేమ్‍జీ అమరేన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.