Filmfare Awards South 2024 Nominees: ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2024.. తెలుగు నుంచి పూర్తి నామినీల జాబితా ఇదే-filmfare awards south 2024 nominees salaar hi nanna dasara nani balakrishna chiranjeevi in the list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Filmfare Awards South 2024 Nominees: ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2024.. తెలుగు నుంచి పూర్తి నామినీల జాబితా ఇదే

Filmfare Awards South 2024 Nominees: ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2024.. తెలుగు నుంచి పూర్తి నామినీల జాబితా ఇదే

Hari Prasad S HT Telugu
Jul 17, 2024 07:49 AM IST

Filmfare Awards South 2024 Nominees: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 కోసం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం నామినీల పూర్తి జాబితాను ప్రకటించారు. మరి ఇందులో తెలుగు నుంచి పోటీలో ఉన్న వారి పూర్తి జాబితా ఇక్కడ చూడండి.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2024.. తెలుగు నుంచి పూర్తి నామినీల జాబితా ఇదే
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ 2024.. తెలుగు నుంచి పూర్తి నామినీల జాబితా ఇదే

Filmfare Awards South 2024 Nominees: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 కోసం నామినేషన్లను మంగళవారం (జులై 16) అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా నాలుగు దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినీలు వీళ్లే..

చిరంజీవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, నాని, మృణాల్ ఠాకూర్, ఇతర నటీనటులు నామినేట్ అయిన వారిలో ఉన్నారు. అదే సమయంలో సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్, పొన్నియిన్ సెల్వన్-పార్ట్ 2, కాదల్-ది కోర్, సప్త సాగరదాచే ఎల్లో-సైడ్ ఎ, బి వంటి పాపులర్ సినిమాలు కూడా నామినేషన్లు దక్కించుకున్నాయి.

తెలుగులో ఉత్తమ నటుడి కేటగిరీలో నాని రెండు సినిమాలకు నామినేట్ కావడం విశేషం. అతడు దసరా, హాయ్ నాన్న సినిమాలు రెండింటికీ ఈ ఉత్తమ నటుడి అవార్డు రేసులో ఉన్నాడు. ఈ కేటగిరీలో నానితోపాటు చిరంజీవి, బాలకృష్ణ, ప్రకాశ్ రాజ్, ఆనంద్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టిలాంటి వాళ్లు పోటీ పడుతున్నారు.

రుక్మిణీ వసంత్ తో కలిసి బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ట్రోఫీని ఆవిష్కరించిన మాళవిక మోహనన్.. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్లామర్, మంచి గుర్తింపుతో కూడిన అవార్డుల నైట్ కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి నామినేషన్ల పూర్తి జాబితాను ఇక్కడ చూడండి.

ఉత్తమ చిత్రం

బేబీ

బలగం

దసరా

హాయ్ నాన్న

మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి

సామజవరగమన

సలార్: పార్ట్ 1

బెస్ట్ డైరెక్టర్

అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)

కార్తీక్ దండు (విరూపాక్ష)

ప్రశాంత్ నీల్ (సలార్: పార్ట్ 1)

సాయి రాజేష్ (బేబీ)

శౌర్యువ్ (హాయ్ నాన్న)

శ్రీకాంత్ ఓదెల (దసరా)

వేణు యెల్దండి (బలగం)

ఉత్తమ నటుడు

ఆనంద్ దేవరకొండ (బేబి)

బాలకృష్ణ (భగవంత్ కేసరి)

చిరంజీవి (వాల్తేర్ వీరయ్య)

ధనుష్ (సర్)

నాని (దసరా)

నాని (హాయ్ నాన్న)

నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి)

ప్రకాష్ రాజ్ (రంగ మార్తాండ)

ఉత్తమ నటి

అనుష్క శెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి)

కీర్తి సురేష్ (దసరా)

సమంత (శాకుంతలం)

వైష్ణవి చైతన్య (బేబి)

ఉత్తమ సహాయ నటుడు

బ్రహ్మానందం (రంగ మార్తాండ)

దీక్షిత్ శెట్టి (దసరా)

కోట జయరామ్ (బలగం)

నరేష్ (సామజవరగమన)

రవితేజ (వాల్తేరు వీరయ్య)

విష్ణు ఓయ్ (కీడా కోలా)

ఉత్తమ సహాయ నటి

రమ్యకృష్ణ (రంగ మార్తాండ)

రోహిణి మొల్లెటి (రైటర్ పద్మభూషణ్)

శ్యామల (విరూపాక్ష)

శ్రీలీల (భగవంత్ కేసరి)

శ్రీయారెడ్డి (సలార్: పార్ట్ )

స్వాతి రెడ్డి (మధు మాసం)

బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్

బేబి (విజయ్ బుల్గానిన్)

బలగం (భీమ్స్ సిసిరోలియో)

దసరా (సంతోష్ నారాయణన్)

హాయ్ నాన్న (హేషం అబ్దుల్ వహాబ్)

ఖుషీ (హేషం అబ్దుల్ వహాబ్)

వాల్తేరు వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)

ఉత్తమ సాహిత్యం

అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘలిలా- బేబి)

కాసర్ల శ్యామ్ (చంకీల అంగీలేసి - దసరా)

కాసర్ల శ్యామ్ (ఊరు పల్లెటూరు- బలగం)

పి.రఘు 'రేలారే రేల' (లింగి లింగి లింగిడి- కోటబొమ్మాళి పి.ఎస్)

ఉత్తమ నేపథ్య గాయకుడు

అనురాగ్ కులకర్ణి (సమయమా - హాయ్ నాన్న)

హేషం అబ్దుల్ వహాబ్ (ఖుషీ టైటిల్ సాంగ్- ఖుషి)

పి.వి.ఎన్.ఎస్. శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘలిలా- బేబి)

ఉత్తమ నేపథ్య గాయని

చిన్మయి శ్రీపాద (ఆరాధ్య- ఖుషి)

చిన్మయి శ్రీపాద (ఒడియమ్మ- హాయ్ నాన్న)

ఢీ (చంకీల అంగీలేసి- దసరా)

మంగ్లీ (ఊరు పల్లెటూరు - బలగం)

శక్తిశ్రీ గోపాలన్ (అమ్మాడి- హాయ్ నాన్న)

శ్వేతా మోహన్ (మాస్టారు మాస్టారు - సర్)

Whats_app_banner