Hanuman Sequel: జై హనుమాన్‌లో చిరంజీవి, రామ్‌చరణ్ - హనుమాన్ సీక్వెల్‌పై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Hanuman Sequel: హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌లో చిరంజీవి, రామ్‌చరణ్ నటిస్తే బాగుంటుందని ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి పేర్కొన్నది. హనుమాన్ సీక్వెల్ రిలీజ్ డేట్‌పై చైతన్య రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Hanuman Sequel: తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీ 350 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా టాలీవుడ్ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా నిలిచి హనుమాన్ చరిత్రను సృష్టించింది.
డివోషనల్ బ్యాక్‌డ్రాప్
డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌కు సూపర్ హీరో కథను మిక్స్ చేస్తూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను తెరకెక్కంచాడు. ప్రశాంత్ వర్మ టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను అలరించాయి.కాగా హనుమాన్‌కు సీక్వెల్‌గా జై హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ అనౌన్స్‌చేశాడు. జై హనుమాన్ సినిమాను స్టార్ హీరోతో తెరకెక్కించబోతున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించడంతో ఆ అగ్ర కథానాయకుడు ఎవరన్నది టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి, రామ్‌చరణ్...
తాజాగా ఈ హనుమాన్ సీక్వెల్‌పై ప్రొడ్యూసర్ చైతన్యరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేసింది. డార్లింగ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జై హనుమాన్ గురించి ఆమె మాట్లాడుతూ ఈ సీక్వెల్‌లో హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవి, రామ్‌చరణ్‌లను అనుకుంటున్నట్లు తెలిపింది.
నా పర్సనల్ ప్రిఫరెన్స్ ప్రకారం వారయితేనే బాగుంటుందని అనిపిస్తుందని చెప్పింది. హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఆ పాత్రకు తగ్గ నటుడిని హనుమంతుడే డిసైడ్ చేస్తారు. ఆ నిర్ణయాన్ని హనుమంతుల వారికే వదిలేశాం. మేము సినిమా కంటే దేవుడి కథ చెప్పాలని అనుకుంటున్నాం. ఎలా చెప్పించుకుంటారనేది హనుమంతుడి ఇష్టం అని చైతన్య రెడ్డి అన్నది
జై హనుమాన్ రిలీజ్ డేట్...
జై హనుమాన్ రిలీజ్ డేట్ పై చైతన్య రెడ్డి రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం జై హనుమాన్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయని చైతన్య రెడ్డి తెలిపింది. ఈ సీక్వెల్‌ను సంక్రాంతికి రిలీజ్ చేయడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదని చెప్పింది.
హనుమాన్ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని, పాన్ ఇండియన్ రేంజ్ కు రీచ్ అవుతుందని ఊహించలేదు. హనుమాన్ సక్సెస్‌తోజై హనుమాన్‌పై అంచనాలు పెరిగాయి. ఒక మార్వల్ లాంటి స్టొరీ తీసుకోస్తునప్పుడు ఆ రీచ్ వుండాలి కాబట్టి కొంచెం టైం తీసుకుని సీక్వెల్ చేద్దామన్నది మా ఆలోచన. రిలీజ్ డేట్‌పై తొందరపడటం లేదు అని చైతన్య రెడ్డి అన్నారు.
ప్రభాస్‌ను అనుకున్నాం..కానీ...
అలాగే డార్లింగ్ సినిమా ప్రమోషన్స్‌కు ప్రభాస్‌ను తీసుకురావాలని అనుకున్నామని, కానీ కల్కి సినిమాతో ఆయన బిజీగా ఉండటంతో కుదరలేదని చైతన్య రెడ్డి పేర్కొన్నది. ప్రస్తుతం తమ బ్యానర్‌లో పది సినిమాలో ప్రొడక్షన్‌లో ఉన్నాయని, వచ్చే మూడేళ్లలో ఈ సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపింది. మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌తో ఓ సినిమాను నిర్మిస్తున్నామని చైతన్యరెడ్డి పేర్కొన్నది. చైతన్యరెడ్డి, నిరంజన్‌రెడ్డి ప్రొడ్యూస్ చేస్తోన్న డార్లింగ్ మూవీ జూలై 19న రిలీజ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటిస్తోన్నారు.