Family Star day 4 box office collection: మండే టెస్ట్ ఫెయిలైన ఫ్యామిలీ స్టార్.. మరింత పడిపోయిన కలెక్షన్లు-family star day 4 box office collection vijay deverakonda movie failed monday test drops further ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star Day 4 Box Office Collection: మండే టెస్ట్ ఫెయిలైన ఫ్యామిలీ స్టార్.. మరింత పడిపోయిన కలెక్షన్లు

Family Star day 4 box office collection: మండే టెస్ట్ ఫెయిలైన ఫ్యామిలీ స్టార్.. మరింత పడిపోయిన కలెక్షన్లు

Hari Prasad S HT Telugu
Apr 09, 2024 12:58 PM IST

Family Star day 4 box office collection: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ మండే టెస్ట్ ఫెయిలైంది. ఈ మూవీ నాలుగో రోజు కలెక్షన్లు మరింత పడిపోయాయి.

మండే టెస్ట్ ఫెయిలైన ఫ్యామిలీ స్టార్.. మరింత పడిపోయిన కలెక్షన్లు
మండే టెస్ట్ ఫెయిలైన ఫ్యామిలీ స్టార్.. మరింత పడిపోయిన కలెక్షన్లు

Family Star day 4 box office collection: ప్యామిలీ స్టార్ మూవీపై నెగటివ్ టాక్ ప్రభావం మామూలుగా లేదు. ఫస్ట్ వీకెండ్ లోనే ఫెయిలైన ఈ మూవీ.. మండే టెస్ట్ అసలు పాస్ కాలేకపోయింది. మూడో రోజు కంటే నాలుగో రోజు కలెక్షన్లు సగానికి పడిపోయాయి.

మంగళవారం (ఏప్రిల్ 9) ఉగాది, గురువారం (ఏప్రిల్ 11) రంజాన్ హాలిడేస్ ఉండటంతో సినిమా కాస్త కోలుకుంటుందని మేకర్స్ ఆశతో ఉన్నారు.

ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్

ఫ్యామిలీ స్టార్ మూవీ నాలుగు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.23.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ప్రముఖ వెబ్ సైట్ sacnilk.com వెల్లడించింది. ఈ మూవీ నాలుగో రోజైన సోమవారం కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే రాబట్టింది. నాలుగు రోజులు కలిపి ఇండియాలో మూవీ గ్రాస్ కలెక్షన్లు రూ.14.2 కోట్లుగా ఉండగా.. ఓవర్సీస్ నుంచి మరో రూ.9 కోట్లు వచ్చాయి.

దీంతో సుమారు రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ డిజాస్టర్ దిశగా వెళ్తోంది. తొలి రోజు తెలుగులో రూ.5.55 కోట్ల కలెక్షన్లతో మొదలుపెట్టిన ఫ్యామిలీ స్టార్ నెగటివ్ టాక్ ప్రభావంతో రెండో రోజు రూ.3.1 కోట్లకు, మూడో రోజు రూ.2.75 కోట్లకు, నాలుగో రోజు రూ.1.5 కోట్లకు పడిపోయింది. తమిళంలోనూ సినిమా రిలీజైనా.. అక్కడ నాలుగు రోజులు కలిపి కేవలం రూ.1.07 కోట్లు మాత్రమే రాబట్టింది.

విజయ్ తో కలిసి గతంలో గీతగోవిందంలాంటి హిట్ మూవీ తీసిన పరశురాం ఈసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. సోషల్ మీడియాలో సినిమాపై తొలి షో నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మూవీ చాలా బాగుందని కొందరు ట్వీట్స్ చేయగా.. మరికొందరు మాత్రం మరీ చెత్తగా ఉందని అనడం గమనార్హం. ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై స్పష్టంగా కనిపిస్తోంది.

ఫ్యామిలీ స్టార్ ఎలా ఉందంటే?

ఫ్యామిలీ స్టార్ మూవీ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు కూడా రివ్యూ ఇచ్చింది. అందులో ఏముందంటే.. "కుటుంబ బాధ్య‌త‌ల్ని నెర‌వేర్చే క్ర‌మంలో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు ఎలాంటి క‌ష్టాలు ఎదుర్కొన్నాడు. త‌న ఫ్యామిలీని ఉన్న‌తంగా చూడాల‌నే క‌ల‌లు క‌నే అత‌డి జీవితంలోకి ఓ అమ్మాయి వ‌చ్చి ఎలాంటి అల‌జ‌డి రేపింద‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఈ క‌థ‌ను రాసుకున్నాడు. ఈ పాయింట్ చుట్టూ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, కామెడీ, రొమాన్స్‌ను అల్లుకుంటూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని అనుకున్నారు.

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, రొమాన్స్‌ను రియ‌లిస్టిక్‌గా చూపించ‌డం ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ బ‌లం. ఆ బ‌ల‌మే ఈ సినిమాలో బ‌ల‌హీన‌త‌గా మారింది. మిడిల్ క్లాస్ క‌ష్టాల‌న్నీ చాలా ఆర్టిఫిషియ‌ల్‌గా సాగుతాయి. కుటుంబం కోసం హీరో చేసే త్యాగాలు టీవీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తాయి. క‌థ‌, క‌థ‌నాలు మొత్తం 1990 కాలం నాటి సినిమాల‌ను గుర్తుకుతెస్తాయి" అని ఉంది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా దాదాపు ఇలాంటి రివ్యూలే వచ్చాయి. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం కావాలని నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారని, దీనివల్ల నిర్మాతలు, ఇండస్ట్రీ నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

IPL_Entry_Point