Prasanth Varma on HanuMan OTT: ఎట్టకేలకు హనుమాన్ మూవీ ఓటీటీపై అప్‍డేట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ-director prasanth varma give update about hanuman ott release announcement ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prasanth Varma On Hanuman Ott: ఎట్టకేలకు హనుమాన్ మూవీ ఓటీటీపై అప్‍డేట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ

Prasanth Varma on HanuMan OTT: ఎట్టకేలకు హనుమాన్ మూవీ ఓటీటీపై అప్‍డేట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ

Prasanth Varma on HanuMan OTT Release: హనుమాన్ సినిమా ఓటీటీలోకి రావడం ఆలస్యమవటంతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ అప్‍డేట్ ఇచ్చారు.

ప్రశాంత్ వర్మ - హనుమాన్ పోస్టర్

హనుమాన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు చాలా నిరీక్షిస్తున్నారు. అద్భుతమైన బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయింది. అంచనాలను మించి భారీ హిట్ అయింది. అయితే, 50 రోజులు దాటినా హనుమాన్ సినిమా ఇంకా ఓటీటీలోకి రాలేదు. అయితే, తాజా దర్శకుడు ప్రశాంత్ వర్మ నేడు హనుమాన్ ఓటీటీపై ఓ అప్‍డేట్ ఇచ్చారు.

ట్వీట్ చేసిన ప్రశాంత్ వర్మ

హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతుండటంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ కూడా ఎలాంటి అప్‍డేట్లు ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. దీంతో హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు.

హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ అనౌన్స్‌మెంట్ త్వరలో వస్తుందంటూ ప్రశాంత్ వర్మ నేడు (మార్చి 11) ట్వీట్ చేశారు. “హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటన వస్తోంది” అంటూ ఆయన పోస్ట్ చేశారు. అయితే, స్ట్రీమింగ్ డేట్ పేర్కొనలేదు. జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ అతిత్వరలో హనుమాన్ స్ట్రీమింగ్ తేదీ వెల్లడించే అవకాశం ఉంది.

హనుమాన్ మూవీ మార్చి 8వ తేదీన జీ5 ఓటీటీలోకి వస్తుందని గతంలో సమాచారం వచ్చింది. అయితే, అలా జరగలేదు. స్ట్రీమింగ్‍ను జీ5 ఆలస్యం చేసింది. అయితే, మార్చి 16వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అయితే, ఆ ప్రకటన త్వరలోనే వస్తుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ట్వీట్ చేశారు.

హనుమాన్ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్, టీవీ ప్రీమియర్ తేదీలు ఖరారయ్యాయి. ఈ సినిమా హిందీలో మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్‍లో ప్రసారం కానుంది. మార్చి 16నే జియో సినిమాలో హనుమాన్ హిందీ వెర్షన్ రానుంది. అయితే, జీ5లో హనుమాన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్లు రావాల్సి ఉంది.

రూ.40కోట్ల బడ్జెట్.. రూ.350కోట్ల వసూళ్లు

హనుమాన్ సినిమా సుమారు రూ.40కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ పరిమిత బడ్జెట్‍లోనే అద్భుతమైన వీఎఫ్‍ఎక్స్, టేకింగ్, విజువల్స్‌తో ఈ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసలు వచ్చాయి. హనుమంతుడిని చూపించిన విధానానికి ప్రేక్షకులు మైమరిచిపోయారు. హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.350 కోట్ల కలెక్షన్లను సాధించింది. తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లోనూ హనుమాన్ సత్తాచాటింది. త్వరలో కొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.

హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్‍షో ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ నిర్మించింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా చేయగా.. అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీరోల్స్ చేశారు.