Aay OTT: ఓటీటీలోకి డిలీటెడ్ సీన్లతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది మూవీ ఆయ్- డైరెక్టర్ క్లారిటీ!
Aay OTT Release With Deleted Scenes: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఆయ్. అయితే, ఆయ్ మూవీ డిలీటెడ్ సీన్లతో సహా ఓటీటీలోకి రానుందని వార్తలు వచ్చాయి. దీంతో ఆయ్ ఓటీటీ రిలీజ్‌పై మూవీ డైరెక్టర్ అంజి కే మణిపుత్ర అసలు క్లారిటీ ఇచ్చారు.
Aay OTT Release With Deleted Scenes: మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ మూవీ ఆయ్. నయన్ సారిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలైంది. గోదావరి నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విడుదలకి ముందు నుంచి మంచి బజ్ అందుకున్న ఈ సినిమా విడుదలైన తరువాత బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది.
తాజాగా ఆయ్ సినిమా డైరెక్టర్ అంజి కే మణిపుత్ర సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో డిలీట్ అయిన సీన్లతో పాటు ఓటీటీలోకి ఆయ్ మూవీ రానుందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు అంజి కే మణిపుత్ర.
ఆయ్ చూశాక ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యారు?
సినిమా చూశాక ఎన్టీఆర్ గారు బావుంది.. కామెడీని బాగా డీల్ చేశావు.. క్లైమాక్స్ కూడా చాలా బాగా డీల్ చేశావు అన్నారు. అల్లు అర్జున్ గారి మాటలు మీరు వినే ఉంటారు. అందరూ థియేటర్లకి రావడం లేదు అంటారు. కానీ.. మంచి సినిమా వస్తే కచ్చితంగా థియేటర్లకు వస్తారని నిరూపించావు. సెకండ్ సినిమా ఎప్పుడు తీస్తున్నావ్ అని మాట్లాడారు.
మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రియక్షన్ ఏంటి?
మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ. మా ఊర్లో సినిమా ఇంకా బాగా ఆడుతోంది. మా అమ్మానాన్నలకి సినిమాల గురించి పెద్దగా తెలియదు. కానీ, ఏదో చేస్తున్నాడని అనుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయ్యాక అందరూ వచ్చి మీ అబ్బాయి సినిమా చాలా బాగా తీశాడని చెబుతున్నారు అని ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది.
ఇన్ని డబ్బులు వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నారు?
నేను కూడా చాలా హ్యాపీ. అసలు పెద్ద సినిమాలు కూడా సరిగ్గా ఆడటం లేదనుకున్న సమయంలో చిన్న సినిమా అయినా అందరూ వచ్చి చూశారు. డబ్బులు ఎక్కువ వచ్చినందుకు నిర్మాత హ్యాపీగా ఫీల్ అవుతారు.
సినిమాలో అన్నీ నిజ జీవితంలో జరిగిన సంఘటనలేనా?
సినిమా అందరికీ నచ్చడానికి కారణం సినిమాలో అన్ని రియల్‌గా జరిగేవి. నాగ చైతన్య గారు కూడా అదే అన్నారు. థియేటర్లు అన్నీ బ్లాస్ట్ అవుతున్నాయి. దానికి కారణం అన్ని మనకు తెలిసిన పాత్రలు. ముసలాయన క్యారెక్టర్ కానీ అన్ని మా సైడ్ నేను చూసిన పాత్రలు. కొన్ని సీన్లు కూడా నిజంగా నాకు జరిగినవి నేను చూసినవే. అందుకే సినిమా బాగా కనెక్ట్ అయింది.
ఓటీటీలో డిలీట్ చేసిన సీన్స్ యాడ్ చేస్తారా?
లేదు. ఈ మధ్య ఏదో కొత్త రూల్ వచ్చింది అంట. థియేటర్‌లో సినిమా ఎంత రన్ టైమ్ ఉంటే ఓటీటీలో కూడా అంతే ఉండాలి. కాబట్టి ఓటీటీలో అయితే యాడ్ చేయటం లేదు. కానీ, కొన్ని సన్నివేశాలు మాత్రం వాసు గారు విడిగా రిలీజ్ చేద్దాం అన్నారు.