Koratala Siva: చిరంజీవితో విభేదాల రూమర్లపై స్పందించిన కొరటాల శివ.. అల్లు అర్జున్‍తో అనుకున్నది దేవరేనా?-devara director koratala siva reacts on rumours of rift with chiranjeevi and gave clarity on his canceled movie with all ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Koratala Siva: చిరంజీవితో విభేదాల రూమర్లపై స్పందించిన కొరటాల శివ.. అల్లు అర్జున్‍తో అనుకున్నది దేవరేనా?

Koratala Siva: చిరంజీవితో విభేదాల రూమర్లపై స్పందించిన కొరటాల శివ.. అల్లు అర్జున్‍తో అనుకున్నది దేవరేనా?

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 24, 2024 03:16 PM IST

Koratala Siva on Chiranjeevi: దేవర సినిమా వస్తున్న తరుణంలో మీడియాతో మాట్లాడారు డైరెక్టర్ కొరటాల శివ. కొన్ని అంశాలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో విభేదాల గురించి వస్తున్న రూమర్ల గురించి కూడా రెస్పాండ్ అయ్యారు.

Koratala Siva on Chiranjeevi: చిరంజీవితో విభేదాల రూమర్లపై స్పందించిన కొరటాల శివ.. అల్లు అర్జున్‍తో అనుకున్నది దేవరేనా?
Koratala Siva on Chiranjeevi: చిరంజీవితో విభేదాల రూమర్లపై స్పందించిన కొరటాల శివ.. అల్లు అర్జున్‍తో అనుకున్నది దేవరేనా?

కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా విడుదలకు సిద్ధమైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ మరో మూడు రోజుల్లో (సెప్టెంబర్ 27) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇటీవల ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దవటంతో నేడు (సెప్టెంబర్ 24) మీడియా ముందుకు వచ్చారు డైరెక్టర్ కొరటాల. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

కొరటాల శివ డైరెక్ట్ చేసిన గత చిత్రం ‘ఆచార్య’ డిజాస్టర్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కలిసి నటించిన ఈ యాక్షన్ డ్రామా మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. 2022 ఏప్రిల్‍లో వచ్చిన ఆచార్య బోల్తా కొట్టింది. దీంతో కొరటాల శివపై విమర్శలు వచ్చాయి. చిరంజీవి కూడా ఓ ఇంటర్వ్యూలో ఆ మూవీ ఫలితంపై స్పందిస్తూ కొరటాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొరటాల కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను కూడా ఈ అంశానికి సోషల్ మీడియాలో కొందరు ముడిపెట్టారు. మొత్తంగా చిరంజీవి, కొరటాల శివ మధ్య విభేదాలు వచ్చినట్టు రూమర్లు వచ్చాయి. ఈ విషయంపై నేడు మీడియా సమావేశంలో కొరటాల శివకు ప్రశ్న ఎదురైంది.

అవన్నీ ఊహలే..

చిరంజీవితో బంధం ఎలా ఉందనే ప్రశ్నకు కొరటాల శివ స్పందించారు. అంతా బాగుందని అన్నారు. తనకు, చిరంజీవికి మధ్య విభేదాలు ఏర్పడినట్టు వచ్చిన రూమర్లన్నీ ఊహలే అని కొరటాల శివ స్పష్టం చేశారు.

మళ్లీ మంచి కమ్‍బ్యాక్ ఇస్తావంటూ ఆచార్య రిలీజ్ తర్వాత తనకు చిరంజీవి మెసేజ్ చేశారని కొరటాల వెల్లడించారు. “అనవసరంగా రేకెత్తించిన రూమర్లు అవి. ఆచార్య తర్వాత నాకు మెసేజ్ చేసిన తొలి వ్యక్తి చిరంజీవి. నువ్వు మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతావని, మామూలుగా కొట్టవు అని మెసేజ్ చేశారు. ఆయనకు, నాకు మధ్య ఏదో ఎందుకు ఉంటుంది. అవన్నీ అనవసరమైన ఊహలే” అని కొరటాల శివ వెల్లడించారు. తనకు, చిరంజీవికి మధ్య బంధం బాగుందని క్లారిటీ ఇచ్చారు.

అల్లు అర్జున్‍తో దేవర కాదు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍తో కొరటాల శివ చేయాల్సిన ఓ మూవీ పట్టాలెక్కలేదు. అధికారిక ప్రకటన వచ్చినా ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. అయితే, అల్లు అర్జున్‍తో చేయాలనుకున్నది దేవర చిత్రమేనా అనే ప్రశ్నకు కొరటాల ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. అది దేవర కథ కాదని స్పష్టం చేశారు. అల్లు అర్జున్‍తో అనుకున్న కథ వేరని, దానికి దేవరకు సంబంధం లేదని కొరటాల చెప్పారు. దేవర మూవీని ఎన్టీఆర్ కోసమే సృష్టించానని స్పష్టం చేశారు.

దేవర సినిమాపై పాన్ ఇండియా రేంజ్‍లో బలమైన అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే టికెట్ల బుకింగ్స్ మొదలుకాగా.. భారీగా అమ్ముడవుతున్నాయి. భారీ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది. గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావటంతో మరింత హైప్ ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ హీరోయిన్‍గా చేయగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.