Family Star Fourth Song: ‘సొంత వాళ్ల కోసం ఎంత దూరమైనా’: ఫ్యామిలీ స్టార్ నుంచి మరో సాంగ్ రిలీజ్-dekho re dekho song from vijay deverakonda and mrunal thakur film family star released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star Fourth Song: ‘సొంత వాళ్ల కోసం ఎంత దూరమైనా’: ఫ్యామిలీ స్టార్ నుంచి మరో సాంగ్ రిలీజ్

Family Star Fourth Song: ‘సొంత వాళ్ల కోసం ఎంత దూరమైనా’: ఫ్యామిలీ స్టార్ నుంచి మరో సాంగ్ రిలీజ్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 02, 2024 09:23 PM IST

Family Star Dekho Re Dekho Song: ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి నాలుగో పాట కూడా వచ్చేసింది. దేఖో రే దేఖో అంటూ ఈ పాట ఫుల్ జోష్‍తో ఉంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఈ పాటను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

Family Star Fourth Song: ‘సొంత వాళ్ల కోసం ఎంత దూరమైనా’: ఫ్యామిలీ స్టార్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. యూత్‍కు కనెక్ట్ అయ్యేలా
Family Star Fourth Song: ‘సొంత వాళ్ల కోసం ఎంత దూరమైనా’: ఫ్యామిలీ స్టార్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. యూత్‍కు కనెక్ట్ అయ్యేలా

Family Star New Song: స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాపై భారీ హైప్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. వేసవి సెలవులు కావడం, మధ్య తరగతి కుటుంబం చుట్టూ తిరిగే కథ కావడంతో ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే హైప్ ఉంది. ఈ సినిమాకు మూవీ టీమ్ ప్రమోషన్లను కూడా అదే రేంజ్‍లో చేస్తోంది. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ చిత్రం నుంచి మరో సాంగ్ నేడు (ఏప్రిల్ 2) వచ్చేసింది.

దేఖో రే దేఖో అంటూ..

ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి నాలుగో సాంగ్ నేడు రిలీజ్ అయింది. దేేఖో రే దేఖో అంటూ ఈ సాంగ్ జోష్‍తో మొదలైంది. టీజర్‌లో ఈ ర్యాప్ ఆకట్టుకోవడంతో ఈ పాట ఎప్పుడొస్తుందా అని చాలా మంది ఎదురుచూశారు. మొత్తంగా ఈ సాంగ్‍ను నేడు తీసుకొచ్చింది మూవీ టీమ్. నేడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా ఈ సాంగ్‍ను లాంచ్ చేసింది.

ఈ దేఖో రే దేఖో పాటకు మంచి జోష్ ఉండే ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్. ఈ సాంగ్‍ను హేమచంద్ర ఆలపించారు. ఈ సాంగ్‍కు లిరిక్స్ అందించారు అనంత్ శ్రీరామ్.

మిడిల్‍క్లాస్ మ్యాన్ గురించి..

కుటుంబ బాధ్యతలను మోసే మధ్యతరగతి యువకుడు గోవర్దన్ (విజయ్ దేవరకొండ) తన గురించి చెప్పుకునేలా ఈ పాట ఉంది. దేఖో రే దేఖో అంటూ ర్యాప్ షురూ అయింది. “పుట్టాను అలా నేను.. పనర్వాసు ఘడియల్లో” అంటూ ఈ పాట ప్రారంభమైంది. “సొంత వాళ్ల కోసం ఎంత దూరమైనా దూసుకెళ్లిపోతా లే.. ఇంటి వాళ్ల కోసం ఎంత భారమైనా మెసుకెళ్లిపోతా” అంటూ ఈ పాటలో లిరిక్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ యూత్, ఫ్యామిలీ మ్యాన్‍లకు కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ ఉంది.

స్టేజ్‍పై డ్యాన్స్ చేసిన విజయ్, మృణాల్

ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‍లోని నరసింహా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఈ ఈవెంట్‍ స్టేజీ వద్దకు బైక్‍పై వచ్చారు హీరో విజయ్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత స్టేజీపై వీరిద్దరూ డ్యాన్స్ చేశారు. కల్యాణి వచ్చా.. వచ్చా అనే సాంగ్‍కు స్టెప్‍లు వేశారు.

ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు రాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. నందనందనా అంటూ వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఈ మూవీకి క్రేజ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కల్యాణి వచ్చా.. వచ్చా అంటూ వచ్చిన మ్యారేజ్ సాంగ్ కూడా మోతమోగుతోంది. ఈ పాటలోని స్టెప్‍లను విజయ్, మృణాల్ ప్రమోషనల్ ఈవెంట్లలో చేస్తూనే ఉన్నారు.

ఫ్యామిలీ స్టార్ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. గీతగోవిందం తర్వాత విజయ్ దేవరకొండ - డైరెక్టర్ పరుశురామ్ కాంబోలో వస్తున్న చిత్రం కావటంతోనూ ఈ మూవీపై మంచి ఎక్స్‌పెర్టేషన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.