Dasara Movies: ఈ దసరాకు తెలుగు సినిమాల జాతర.. వీకెండ్ రిలీజ్ కాబోతున్న మూవీస్ ఇవే-dasara 2024 movies viswam maa nanna superhero janaka ayite ganaka vettaiyan to release in theatres ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dasara Movies: ఈ దసరాకు తెలుగు సినిమాల జాతర.. వీకెండ్ రిలీజ్ కాబోతున్న మూవీస్ ఇవే

Dasara Movies: ఈ దసరాకు తెలుగు సినిమాల జాతర.. వీకెండ్ రిలీజ్ కాబోతున్న మూవీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Oct 07, 2024 01:01 PM IST

Dasara Movies: ఈ దసరాకు థియేటర్లలో తెలుగు సినిమాల జాతర ఉండనుంది. వీటిలో కొన్ని నేరుగా తెలుగులో రిలీజ్ కానుండగా.. మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. మొత్తంగా ఏడు మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో థియేటర్లలో కళకళలాడనున్నాయి.

ఈ దసరాకు తెలుగు సినిమాల జాతర.. వీకెండ్ రిలీజ్ కాబోతున్న మూవీస్ ఇవే
ఈ దసరాకు తెలుగు సినిమాల జాతర.. వీకెండ్ రిలీజ్ కాబోతున్న మూవీస్ ఇవే

Dasara Movies: దసరా సినిమాలకు కూడా సంక్రాంతి సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఉంటుంది. అయితే ప్రతి సంక్రాంతికి పెద్ద హీరోలు పోటీ పడగా.. ఈసారి దసరాకు సినిమాల జాతర ఉన్నా.. పెద్ద హీరోలకు సంబంధించినవి మాత్రం ఏమీ లేవు. ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న మూవీస్ లో గోపీచంద్ నటించిన విశ్వం, రజనీకాంత్ వేట్టయన్, సుహాస్ జనక అయితే గనక, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరోలాంటి సినిమాలు ఉన్నాయి.

దసరాకు రిలీజ్ కానున్న మూవీస్ ఇవే

ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ఈ వీకెండ్ మొత్తంగా ఏడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో కొన్ని నేరుగా తెలుగులో వస్తున్నవి కాగా.. మరికొన్ని తమిళం, హిందీ, కన్నడ సినిమాల డబ్బింగ్ వెర్షన్లు కావడం విశేషం. మరి ఆ మూవీస్ ఏంటో చూసేద్దామా?

విశ్వం - అక్టోబర్ 11

మాచో స్టార్ గోపీచంద్ నటించిన మూవీ విశ్వం. చాలా రోజు తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మరోసారి అతని మార్క్ కామెడీ, యాక్షన్ తో ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా.. మూవీ శుక్రవారం (అక్టోబర్ 11) థియేటర్లలో రిలీజ్ కానుంది.

వేట్టయన్ - అక్టోబర్ 10

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ వేట్టయన్: ది హంటర్. జైలర్ బ్లాక్‌బస్టర్, లాల్ సలామ్ డిజాస్టర్ తర్వాత రజనీ నటించిన ఈ సినిమా గురువారమే (అక్టోబర్ 10) థియేటర్లలోకి వస్తోంది. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

జనక అయితే గనక - అక్టోబర్ 12

సుహాస్ నటించిన మూవీ జనక అయితే గనక. ఈ సినిమా దసరా రోజే అంటే శనివారం (అక్టోబర్ 12) రిలీజ్ కానుంది. నిజానికి గత నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఏపీ, తెలంగాణ వరదల కారణంగా వాయిదా పడింది. నెల రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ వస్తోంది.

మా నాన్న సూపర్ హీరో - అక్టోబర్ 11

మా నాన్న సూపర్ హీరో మూవీలో సుధీర్ బాబు నటించాడు. ఈ సినిమా అక్టోబర్ 11న థియేటర్లలోకి రాబోతోంది. గతేడాది హంట్, ఈ ఏడాది హరోమ్ హర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా సక్సెస్ సాధించలేకపోయిన సుధీర్ బాబు.. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

మార్టిన్ - అక్టోబర్ 11

కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా నటించిన మూవీ మార్టిన్ శుక్రవారం (అక్టోబర్ 11) రిలీజ్ కాబోతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. దీంతో తెలుగులోనూ వస్తోంది.

జిగ్రా - అక్టోబర్ 11

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన జిగ్రా కూడా శుక్రవారమే (అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తన తమ్ముడిని కాపాడుకునేందుకు ఓ అక్క చేసే ప్రయత్నమే ఈ జిగ్రా మూవీ.

శ్రీ శ్రీ శ్రీ రాజావారు - అక్టోబర్ 10

నార్నె నితిన్ నటించిన మూవీ శ్రీ శ్రీ శ్రీ రాజావారు గురువారం (అక్టోబర్ 10) రిలీజ్ అవుతోంది. అదే రోజు రజనీకాంత్ నటించిన వేట్టయన్ కూడా తెలుగులో వస్తున్న విషయం తెలిసిందే. సతీష్ వేగేష్న డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దసరా బరిలో పలు పెద్ద సినిమాలతో పోటీ పడుతోంది.

Whats_app_banner