OTT Telugu Releases: ఓటీటీలోకి ఈ వారం తెలుగులో వచ్చిన ఈ సినిమాలు, వెబ్ సిరీస్ మిస్ కావద్దు.. వీకెండ్ వాచ్ లిస్ట్ ఇదీ
OTT Telugu Releases: ఓటీటీల్లోకి ఈ వారం తెలుగులో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. అందులో కొన్ని నేరుగా తెలుగులో వచ్చినవి కాగా.. మరికొన్ని వివిధ భాషల నుంచి డబ్బింగ్ చేసినవి కూడా ఉన్నాయి. ఆహా, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి వాటిలో వీటిని చూడొచ్చు.
OTT Telugu Releases: ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడటానికి చాలా తెలుగు సినిమాలు, వెబ్ సిరీసే ఉన్నాయి. వీకెండ్ తోపాటు పిల్లలకు కూడా దసరా హాలిడేస్ ఉన్న నేపథ్యంలో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న వీటిని ఫ్యామిలీతో కలిసి చూసేయండి. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ ఆహా వీడియో, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్ లాంటి వాటిలో ఉన్నాయి.
వీకెండ్ ఓటీటీ వాచ్
ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏం చూడాలా అన్న ఆలోచన వద్దు. దాదాపు ప్రముఖ ఓటీటీలు అన్నింట్లోనూ తెలుగులో చూడటానికి ఏదో ఒక కొత్త కంటెంట్ అందుబాటులో ఉంది. అవేంటో ఇక్కడ చూసేయండి.
భలే ఉన్నాడే - ఈటీవీ విన్
రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ గురువారం (అక్టోబర్ 3) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కామెడీ డ్రామా థియేటర్లలో ఫర్వాలేదనిపించగా.. ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్సే సంపాదిస్తోంది.
35 చిన్న కథ కాదు - ఆహా వీడియో
టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ లోబడ్జెట్ మూవీస్ లో ఈ 35 చిన్న కథ కాదు కూడా ఒకటి. ఆహా వీడియోలో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియదర్శి, నివేదా థామస్ లాంటి వాళ్లు నటించిన ఈ మూవీ థియేటర్లలోనూ సక్సెస్ అయింది. కామెడీతోపాటు మనసును హత్తుకునే భావోద్వేగాలతో ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
బాలు గాని టాకీస్ - ఆహా వీడియో
ఆహా వీడియో ఓటీటీలోకి నేరుగా వచ్చిన కామెడీ మూవీ బాలు గాని టాకీస్. నిజానికి గత నెలలో రిలీజ్ కావాల్సి ఉన్నా.. శుక్రవారం (అక్టోబర్ 4) నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది.
కళింగ - ఆహా వీడియో, ప్రైమ్ వీడియో
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ కళింగ. ఈ మూవీ ప్రైమ్ వీడియో, ఆహా వీడియోల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ - నెట్‌ఫ్లిక్స్
దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని వీకెండ్ లో చూడొచ్చు.
కంట్రోల్ (CTRL) - నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా అడుగుపెట్టిన హిందీ మూవీ కంట్రోల్. లైగర్ బ్యూటీ అనన్య పాండే నటించిన ఈ హిందీ మూవీని తెలుగులోనూ డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. హర్, ఎక్స్ మెషీనా, ది సోషల్ డైలమాలాంటి హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఈ కంట్రోల్ ను తెరకెక్కించారు.
ఇవే కాకుండా అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో హైవే లవ్ అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా హిందీతోపాటు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇక కొరియన్ వెబ్ సిరీస్ నోర్యాంగ్ డెడ్లీ సీ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.