Naga Shourya: ద‌ర్శ‌న్ మంచివాడు...త్వ‌ర‌లో నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి - క‌న్నడ హీరోకు నాగ‌శౌర్య మ‌ద్ధ‌తు-darshan could not harm ever anyone naga shourya supports to kannada hero darshan on renuka swamy murder issue ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Shourya: ద‌ర్శ‌న్ మంచివాడు...త్వ‌ర‌లో నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి - క‌న్నడ హీరోకు నాగ‌శౌర్య మ‌ద్ధ‌తు

Naga Shourya: ద‌ర్శ‌న్ మంచివాడు...త్వ‌ర‌లో నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి - క‌న్నడ హీరోకు నాగ‌శౌర్య మ‌ద్ధ‌తు

Nelki Naresh Kumar HT Telugu
Jun 28, 2024 09:39 AM IST

Naga Shourya: అభిమాని మ‌ర్డ‌ర్ కేసులో అరెస్ట్ అయిన క‌న్న‌డ స్టార్ హీరో ద‌ర్శ‌న్‌కు టాలీవుడ్ హీరో నాగ‌శౌర్య స‌పోర్ట్‌గా నిలిచాడు. క‌ల‌లో కూడా ఎవ‌రికి హానీ త‌ల‌పెట్టే వ్య‌క్తిత్వం ద‌ర్శ‌న్‌ది కాద‌ని నాగ‌శౌర్య అన్నాడు. ఈ కేసు నుంచి ద‌ర్శ‌న్ నిర్ధోషిగా బ‌య‌ట‌ప‌డ‌తాడ‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపాడు.

నాగశౌర్య, దర్శన్
నాగశౌర్య, దర్శన్

Naga Shourya: అభిమానిని హ‌త్య చేశాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌న్న‌డ స్టార్ హీరో ద‌ర్శ‌న్‌కు మ‌ద్ధుతుగా టాలీవుడ్ హీరో నాగ‌శౌర్య చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రేణుకా స్వామి అనే యువ‌కుడి మ‌ర్డ‌ర్ కేసులో ద‌ర్శ‌న్ ప్ర‌మేయం ఉంద‌ని తేల‌డంతో పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. త‌న స‌న్నిహితుల‌తో క‌లిసి ద‌ర్శ‌న్... రేణుకాస్వామిని దారుణంగా చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి చంపించాడ‌ని పోలీసులు ఇన్వేస్టిగేష‌న్‌లో బ‌య‌ట‌ప‌డింది.

రేణుకాస్వామి మ‌ర్డ‌ర్ కేసుకు సంబంధించి ద‌ర్శ‌న్‌, ప‌విత్రా గౌడ‌తో పాటు వారి అనుచ‌రులు కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మ‌ర్డ‌ర్ కేసులో విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న ద‌ర్శ‌న్ గ‌త ఇర‌వై రోజులుగా జైలులోనే ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలులో ఉన్నారు.

క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్‌...

అభిమానిని దారుణంగా హ‌త్య చేసిన ద‌ర్శ‌న్‌పై అత‌డి అభిమానుల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా ఫైర్ అవుతోన్నారు. ద‌ర్శ‌న్‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తోన్నారు. రేణుకాస్వామి మ‌ర్డ‌ర్ కేసు నేప‌థ్యంలో గ‌తంలో ద‌ర్శ‌న్ చేసిన కొన్ని వివాదాలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తోన్నాయి.

అయితే కొంత‌మంది సాండ‌ల్‌వుడ్ సినీ ప్ర‌ముఖులు మాత్రం ద‌ర్శ‌న్‌కు స‌పోర్ట్‌గా నిలుస్తోన్నారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ హీరో నాగ‌శౌర్య చేశాడు. ఈ కేసు నుంచి ద‌ర్శ‌న్ నిర్ధోషిగా బ‌య‌ట‌ప‌డ‌తాడ‌నే న‌మ్మ‌క‌ముంద‌ని నాగ‌శౌర్య గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.

క‌ల‌లో కూడా హానీ చేయ‌డు...

ద‌ర్శ‌న్ క‌ల‌లో కూడా ఎవ‌రికి హానీ త‌ల‌పెట్ట‌డ‌ని నాగ‌శౌర్య ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు. క‌ష్ట‌స‌మ‌యంలో దర్శన్ ఎంతో మందికి సాయం చేయడమే కాకుండా అండ‌గా నిల‌బ‌డ్డాడ‌ని అన్నాడు. ద‌ర్శ‌న్ వ్య‌క్తిత్వం, సేవాగుణం ఎలాంటిద‌న్న‌ది అత‌డితో ప‌రిచ‌యం ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి తెలుసు అని నాగ‌శౌర్య ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

త్వ‌ర‌లోనే వాస్త‌వాలు బ‌య‌ట‌కొస్తాయి...

న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై త‌న‌కు న‌మ్మ‌క‌ముంద‌ని, త్వ‌ర‌లోనే వాస్త‌వాలు బ‌య‌ట‌వ‌స్తాయ‌ని నాగ‌శౌర్య పేర్కొన్నాడు. ద‌ర్శ‌న్‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల్లో నిజానిజాలు ఏమిట‌న్న‌ది వెల్ల‌డి కాక‌ముందే చాలా మంది ఓ నిర్ణ‌యానికి రావ‌డం స‌రైంది కాద‌ని నాగ‌శౌర్య అన్నాడు. ద‌ర్శ‌న్ నిర్ధోషిగా బ‌య‌ట‌ప‌డ‌తాడ‌నే న‌మ్మ‌క‌ముంద‌ని నాగ‌శౌర్య పేర్కొన్నాడు. నిజ‌మైన దోషులు చ‌ట్టం ముందుకు త‌ప్ప‌కుండా వ‌స్తార‌ని నాగ‌శౌర్య తెలిపాడు .

ప్రైవసీకి భంగం కలిగించొద్దు….

ఈ అస‌త్య ఆరోప‌ణ‌ల వ‌ల్ల ద‌ర్శ‌న్ ఫ్యామిలీ ఎంతో ఆవేద‌న‌కు, బాధ‌కు లోన‌వుతుంద‌ని, ఈ క‌ఠిన ప‌రిస్థితుల్లో వారి ప్రైవ‌సీకి భంగం క‌లిగించవ‌ద్ద‌ని నాగ‌శౌర్య త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు. ద‌ర్శ‌న్‌తో దిగిన ఓ ఫొటోను నాగ‌శౌర్య షేర్ చేశాడు. క‌న్న‌డంలో ప‌లువురు న‌టీన‌టులు ద‌ర్శ‌న్‌కు స‌పోర్ట్‌గా నిలిచారు. తెలుగు నుంచి నాగ‌శౌర్య మాత్ర‌మే ద‌ర్శ‌న్‌కు మ‌ద్ధ‌తుగా ట్వీట్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

WhatsApp channel