బాపట్ల బీచ్‌లో ఆరుగురు మృతి చెందడంతో తాత్కాలికంగా నిషేధం విధించిన పోలీసులు-police imposed temporary ban on bapatla beach after six people died ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  బాపట్ల బీచ్‌లో ఆరుగురు మృతి చెందడంతో తాత్కాలికంగా నిషేధం విధించిన పోలీసులు

బాపట్ల బీచ్‌లో ఆరుగురు మృతి చెందడంతో తాత్కాలికంగా నిషేధం విధించిన పోలీసులు

HT Telugu Desk HT Telugu
Jun 24, 2024 06:55 PM IST

బాపట్లలో నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందడంతో రెండు బీచ్ లను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు.

బాపట్ల బీచ్‌ సందర్శనపై నిషేధం విధించిన పోలీసులు
బాపట్ల బీచ్‌ సందర్శనపై నిషేధం విధించిన పోలీసులు (https://www.flickr.com/photos/rahul_kool/)

బాపట్ల, జూన్ 24: వారం రోజుల్లో ఆరుగురు నీటమునిగి మృతి చెందడంతో బాపట్ల జిల్లాలోని రెండు బీచ్‌లను స్థానిక పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు.

బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గత వారం రోజుల్లో ఆరుగురు నీటిలో మునిగి చనిపోయారని, దీంతో సూర్యలంక, వాడ్రేవు బీచ్ ల వద్ద నీటిలోకి ప్రవేశించకుండా నిషేధం విధించినట్టు తెలిపారు.

‘‘గత వారం రోజుల్లో ఆరుగురు సముద్రంలో మునిగి చనిపోయారు. మరో 14 మందిని కాపాడగలిగాం. సంవత్సరంలో ఈ సమయంలో సముద్రపు అలలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి..’ అని జిందాల్ పిటిఐతో అన్నారు.

కొందరు మోకాలి లోతు వరకు మాత్రమే వెళ్లినా వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండటం ప్రాణాంతకంగా మారుతోందని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ ఏడాది సముద్రం మరింత తీవ్రంగా ఉందని, కొన్ని సందర్భాల్లో బీచ్ లకు వెళ్లేవారిని కాపాడవచ్చని జిందాల్ చెప్పారు. కానీ పోలీసులు అన్నివేళలా ఉండలేరు కాబట్టి అందరినీ కాపాడలేమని అన్నారు.

76 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం ఉన్న బాపట్ల బీచ్ లు రాష్ట్రం లోపల, వెలుపల నుంచి కూడా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. వారాంతాల్లో దాదాపు 15,000 మంది సందర్శకులు వస్తారని జిందాల్ చెప్పారు.

Whats_app_banner