Rangabali OTT Release Date: నాగశౌర్య రంగబలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Rangabali OTT Release Date: నాగశౌర్య రంగబలి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ సినిమా ఏ ఓటీటీలో,ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...
Rangabali OTT Release Date: నాగశౌర్య(Naga Shaurya) రంగబలి మూవీ ఓటీటీలోకి రాబోతోంది. శుక్రవారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు. ఆగస్ట్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జూలై 7న రంగబలి మూవీ థియేటర్లలో రిలీజైంది.
ట్రైలర్స్, టీజర్స్‌తో పాటు డిఫరెంట్ ప్రమోషన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. కామెడీ వర్కవుట్ అయినా కథలో బలం లేకపోవడంతో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. అందువల్లే థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా కాకముందే రంగబలి మూవీ ఓటీటీలోకి రాబోతోంది.
రంగబలి సినిమాతో దర్శకుడిగా పవన్ బాసంశెట్టి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అంశాలతో పవన్ బాసంశెట్టి ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.
రంగబలి కథేమిటంటే...
శౌర్య(నాగశౌర్య) అనే యువకుడికి తన ఊరు రాజవరం అంటే అభిమానం. సొంత ఊళ్లోనే ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. సహజ(యుక్తి తరేజా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు శౌర్య. తన ప్రేమ కోసం ఊరి ఎమ్మెల్యే పరశురామ్‌తో(షైన్ టామ్ చాకో) శౌర్య ఎందుకు పోరాటం చేయాల్సివచ్చింది? అతడి ప్రేమకు ఆ ఊరిలోని మెయిన్ సెంటర్ రంగబలితో ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే ఈ సినిమా కథ. లవర్‌బాయ్ ఇమేజ్‌కు భిన్నంగా మాస్ పాత్రలో నాగశౌర్య నటించిన సినిమా ఇది. దసరా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి రంగబలి మూవీని నిర్మించాడు.