Nabha Natesh: ఆ క్యారెక్టర్ చేసేందుకు హీరోయిన్స్ చాలా భయపడ్డారు.. కానీ, నభా నటేష్ మాత్రం: డైరెక్టర్
Darling Director Ashwin Ram Nabha Natesh: స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ క్యారెక్టర్ చేసేందుకు చాలా మంది హీరోయిన్స్ భయపడినట్లు డార్లింగ్ మూవీ డైరెక్టర్ అశ్విన్ రామ్ తెలిపారు. కమల్ హాసన్, విక్రమ్ లాంటి వాళ్లు మాత్రమే చేయగలరని వాళ్ల భయమని, అందుకే చేయమన్నారని అశ్విన్ చెప్పారు.
Darling Director Ashwin Ram Nabha Natesh: ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్స్‌గా చేస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ డార్లింగ్. ఈ సినిమాతో డైరెక్టర్‌గా అశ్విన్ రామ్ పరిచయం కానున్నారు. ఇందులో స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడే క్యారెక్టర్‌లో హీరోయిన్ నభా నటేష్ యాక్ట్ చేసింది. అయితే, జూలై 19న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా నిర్వహించి ప్రమోషన్స్‌లో డైరెక్టర్ అశ్విన్ రామ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
హీరో ప్రియదర్శి గురించి చెప్పండి?
డార్లింగ్‌కి ఫర్ఫెక్ట్‌గా హీరో ప్రియదర్శి. ఓ సినిమా షూటింగ్‌లో మేము కలిశాం. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఆయన వలనే ఈ ప్రాజెక్ట్ సాధ్యపడింది. ప్రియదర్శి చాలా ఎఫర్ట్ పెట్టారు.
స్ల్పిట్ పర్సనాలిటీ అంటే విక్రమ్ గుర్తుకు వస్తారు. ఇలాంటి క్యారెక్టర్‌ని నభా నటేష్ ఎలా చేశారు ?
డార్లింగ్ స్క్రిప్ట్‌ను కొందరు హీరోయిన్స్‌కు చెప్పినప్పుడు స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ క్యారెక్టర్ చేసేందుకు భయపడ్డారు. కమల్ హాసన్, విక్రమ్ లాంటి వాళ్లు ఇలాంటి పాత్రలతో మెప్పించారనేది వారి భయం. కానీ నభాకు స్టోరీ చెప్పినప్పుడు ఇంతేనా.. చేస్తాను అని చెప్పింది. నటిగా తనకున్న కాన్ఫిడెన్స్‌ను ఈ సందర్భం చూపిస్తుంది.
నభా నటేష్ మా కథను నమ్మి వర్క్ షాప్స్‌లో పాల్గొన్నారు. డార్లింగ్ స్క్రిప్ట్ వెరీ ఛాలెంజింగ్. తన క్యారెక్టర్‌ని ఎలా మ్యాచ్ చేయగలననే దానిపైనే నభా దృష్టి పెట్టారు. ఎక్స్‌ట్రార్డినరీగా పర్ఫార్మ్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు.
అనన్య నాగళ్ల క్యారెక్టర్ గురించి?
అనన్య నాగళ్లది వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆమెకు కథ అంతా చెప్పాను. ఆ పాత్రని చాలా ఇష్టపడి చేశారు. అనన్య పాత్ర గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. ఇందులో విమెన్ పాత్రలన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి.
తెలుగులో దర్శకుడిగా పరిచయం కావడం ఎలా అనిపిస్తోంది?
చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి చాలా ఎంజాయ్ చేశాను. తెలుగు సినిమాలపై నాది వన్ సైడ్ లవ్ ( నవ్వుతూ). ఎప్పటినుంచో తెలుగు సినిమా చేయాలని ఉండేది. ఈ సినిమాతో ఆ కల తీరినందుకు చాలా ఆనందంగా ఉంది.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌లో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ చాలా విజనరీ ప్రొడ్యూసర్స్. వారికి కంటెంట్ పైనే పూర్తి నమ్మకం. నిరంజన్ గారు, చైతన్య మేడంకి కంటెంట్ నచ్చితే మరో ఆలోచన లేకుండా ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. జ
వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి?
వివేక్ సాగర్ మ్యూజిక్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. కానీ, వివేక్ ఎక్కువ సినిమాలు చేయరు. అయితే కంటెంట్ వినమని ఈ సబ్జెక్ట్ చెప్పాను. ఆయనకి సబ్జెక్ట్ నచ్చి ఓకే చెప్పారు. ఈ సినిమాకి పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు.
తదుపరి మూవీస్ గురించి?
చాలా కథలు ఉన్నాయి. మీ అందరి సపోర్ట్‌తో తెలుగు సినిమాల్లోనే ఉండాలని ఉంది (నవ్వుతూ).
కాగా డార్లింగ్ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మిస్తున్నారు ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోన్న డార్లింగ్ జూలై 19న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.