Calendar Song Lyrics: లైఫ్ గురించి చెప్పే క్యాలెండర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. మిస్ యూనివర్స్‌తో కమల్ హాసన్ భారతీయుడు 2 పాట
Kamal Haasan Indian 2 Calendar Song Released And Lyrics In Telugu: కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమా నుంచి తాజాగా క్యాలెండర్ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటలో సౌత్ మోడల్, 2017 మిస్ యూనివర్స్ డెమి లీ టెబో నర్తించడం స్పెషల్‌గా మారింది. మరి ఈ క్యాలెండర్ పాట లిరిక్స్ చూస్తే..
Indian 2 Calendar Song Lyrics In Telugu: 28 ఏళ్ల ముందు భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతుంది. ఈ తరుణంలో మేకర్స్ సోమవారం ఈ సినిమా నుంచి ‘క్యాలెండర్’ సాంగ్‌ను విడుదల చేశారు.
ఆసక్తికరమైన విషయమేమంటే ప్రముఖ దక్షిణాఫ్రికా మోడల్, 2017లో మిస్ యూనివర్స్ విజేత డెమి-లీ టెబో (Demi Leigh Tebow) ఈ పాటలో నర్తించి అందాలను ఆరబోసింది. ఇక శంకర్ మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన స్టైల్లో పాటలోని ప్రతి సన్నివేశాన్ని గ్లామర్‌గానే కాదు.. వావ్ అనిపించేంత గొప్పగా చిత్రీకరించారు. ఈ పాటను సిల్వర్ స్క్రీన్‌పై చూస్తే ఆ ఫీల్ మరోలా ఉంటుందనడంలో సందేహం లేదు.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తోన్న భారతీయుడు 2 చిత్రంలో క్యాలెండర్ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్‌ను చంద్రబోస్ రాయగా శ్రావణ భార్గవి ఆలపించారు. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే ఓసారి పాటలోని లిరిక్స్ చూస్తే..
పాలపుంతల్లో వాలి- జంట మేఘాల్లో తేలి
భూమితో పని లేకుండా- గడిపేద్దామా!
వెన్నెల మాటలు కొన్ని- చుక్కల ముద్దులు కొన్ని
దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా!..
నా చిరు చిరు చెమటలు తాకి.. నీ మగసిరి పొగరిక కరిగే..
నా ఘుమ ఘుమ వాసన సోకి.. నీ నరుముల చెరుకులు పెరిగే..
లోకమే కీటకమంట.. అందమే మతాబు మంట.. దీనితో దాన్ని పూట గడిచేద్దామా..
చెవులలో డేగల రచ్చ.. గుండెలో రాబందు రట్టు..
కాళ్లలో మొసళ్ల పట్టు చవి చూద్దామా..
నీకుండే ఐశ్వర్యం ఈ బ్రతుకును గెలుచునురా..
నువ్ పొందే ఉల్లాసం మరణాన్నే గెలుచునురా.. లేరా..
నా వెలుగుల వేగంతో నువ్ గాని కలిసావో.. ఈ కాలం మారునురా.. రారా..
నా కన్నే సోకు వరల్డ్స్ బెస్ట్ డ్రింకు.. దూరం ఉంటూ ఉంటూ చేయొద్దు ఇంకా థింకు..
స్కై సైజులో లైఫ్ లేనేలేదు.. ఓన్నీ చిన్ని గ్లాసు.. చింది పోకుండ తాగు..
నా చిరు చిరు చెమటలు తాకి.. నీ మగసిరి పొగరిక కరిగే..
నా ఘుమ ఘుమ వాసన సోకి.. నీ నరుముల చెరుకులు పెరిగే..
లోకమే కీటకమంట.. అందమే మతాబు మంట.. దీనితో దాన్ని పూట గడిచేద్దామా..
చెవులలో డేగల రచ్చ.. గుండెలో రాబందు రట్టు..
కాళ్లలో మొసళ్ల పట్టు చవి చూద్దామా..
అంటూ లిరిక్స్ చాలా అర్థవంతంగా, క్యాచీగా ఉన్నాయి. పాటలో లైఫ్, అందం, ఆస్వాదించడం, లివ్ దిస్ మూమెంట్ అన్నట్లుగా లిరిక్స్ ఉన్నాయి. లిరిక్స్ తగినట్లుగా అందమైన గాత్రంతో శ్రావణ భార్గవి అద్భుతంగా ఆలపించింది.
ఇక పాటలో వచ్చే మ్యూజిక్ అదిరిపోయింది. విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. అతి త్వరలోనే అందరి నోట్లో ఈ పాట నానేలా ఉంది. అలాగే సోషల్ మీడియాలో రీల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.