Nabha Natesh: యాక్సిడెంట్ వల్ల అక్కడ గాయమైంది.. అందుకే బ్రేక్ వచ్చింది: హీరోయిన్ నభా నటేష్-nabha natesh comments on her accident shoulder injury in darling movie promotions priyadarshi darling updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nabha Natesh: యాక్సిడెంట్ వల్ల అక్కడ గాయమైంది.. అందుకే బ్రేక్ వచ్చింది: హీరోయిన్ నభా నటేష్

Nabha Natesh: యాక్సిడెంట్ వల్ల అక్కడ గాయమైంది.. అందుకే బ్రేక్ వచ్చింది: హీరోయిన్ నభా నటేష్

Sanjiv Kumar HT Telugu
Jul 14, 2024 08:24 AM IST

Nabha Natesh About Her Accident In Darling Promotions: తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది ఇస్మార్ట్ బ్యూటి నభా నటేష్. తాజాగా ప్రియదర్శితో చేస్తున్న డార్లింగ్ మూవీ ప్రమోషన్స్‌లో సినిమా విశేషాలతోపాటు తనకు వచ్చిన బ్రేక్ గురించి తెలిపింది నభా నటేష్.

యాక్సిడెంట్ వల్ల అక్కడ గాయమైంది.. అందుకే బ్రేక్ వచ్చింది: హీరోయిన్ నభా నటేష్
యాక్సిడెంట్ వల్ల అక్కడ గాయమైంది.. అందుకే బ్రేక్ వచ్చింది: హీరోయిన్ నభా నటేష్

Nabha Natesh Accident Darling Movie: ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ 'డార్లింగ్'. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌‌ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మిస్తున్నారు.

హ్యుజ్ బజ్‌

డార్లింగ్ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ సినిమా జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నభా నటేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. తనకు జరిగిన యాక్సిడెంట్ సైతం చెప్పారు.

మళ్లీ మూవీస్‌లోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు?

దాదాపు రెండేళ్లుగా నా నుంచి సినిమా రిలీజ్ లేదు. థియేటర్స్‌లో ప్రేక్షకులు నన్ను చూడటానికి, నేను నన్ను థియేటర్స్‌లో చూసుకోవడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను.

మీ ఎనర్జీ, యాక్సిడెంట్ గురించి?

ఆడియన్స్‌కి నా ఎనర్జీ ఇష్టం. యాక్సిడెంట్ వలన నా షోల్డర్‌కి గాయమైయింది. మళ్లీ ఫుల్‌గా ఫిట్ అయి మునుపటి ఎనర్జీ వచ్చిన తర్వాతే స్క్రీన్ మీద కనిపించాలని భావించాను. అందుకే బ్రేక్ వచ్చింది. ఇప్పుడు డార్లింగ్‌తో మళ్లీ ప్రేక్షకులు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.

డైరెక్టర్ అశ్విన్ రామ్ ఈ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది ?

స్క్రిప్ట్ చాలా నచ్చింది. నా క్యారెక్టర్ ఇంకా నచ్చింది. ఇది చాలా ఛాలెజింగ్ రోల్. ఇప్పటివరకూ ఇలాంటి రోల్ చేయలేదు. స్ల్పిట్ పర్సనాలిటీ ఉన్న ఈ పాత్రని పర్ఫార్మ్ చేయడం చాలా ఛాలెజింగ్‌గా అనిపించింది.

కామెడీ, లవ్ స్టొరీ ఎంటర్ టైనర్‌లో ఇలాంటి క్యారెక్టర్ పెట్టడం చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. అశ్విన్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఎగ్జయింట్‌గా అనిపించింది. మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో వచ్చిన అద్భుతమైన స్క్రిప్ట్ డార్లింగ్.

ఎనర్జిటిక్ రోల్స్ చేయడానికే ఇష్టపడతారా ?

ఎంటర్‌టైనింగ్‌గా ఉండే రోల్స్‌ని పిక్ చేయడానికి ఇష్టపడతాను. ఎంటర్‌టైనింగ్‌గా ఉండే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ సినిమాలు చూస్తూనే పెరిగాను.

డార్లింగ్‌లో ఫన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి?

డార్లింగ్ ఫన్, లవ్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ ఉన్న కంప్లీట్ ఎంటర్ టైనర్.

స్ల్పిట్ పర్సనాలిటీ యాక్టింగ్ కోసం హోం వర్క్ చేశారా ?

ఒక సినిమాలో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాననే జోన్‌లో అప్రోచ్ అయ్యాను. ఇందుకోసం చాలా హోం వర్క్ చేశాను. స్ల్పిట్ పర్సనాలిటీ ఉన్న చాలా సినిమాలు చూశాను. అలాగే చెన్నై నుంచి ఒక యాక్టింగ్ స్పెషిలిటేటర్ కూడా వచ్చారు.

డార్లింగ్ స్క్రిప్ట్ విన్న తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్ ఏమిటి ?

కథ విన్న వెంటనే సెట్స్‌కి వెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోయా (నవ్వుతూ). అశ్విన్ అద్భుతమైన నేరేటర్. తను చెప్పినప్పుడే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థమైపోయింది.

Whats_app_banner