OTT Crime Thriller: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ వివరాలివే
Yevam OTT Streaming: యేవం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో చాందినీ చౌదరి మెయిన్ రోల్ చేశారు. నేటి మధ్యాహ్నం ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
యంగ్ టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లే చేస్తూ మెప్పిస్తున్నారు. చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో యేవం చిత్రం తెరకెక్కింది. ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా చాందినీ నటించారు. ఈ మూవీ జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, చాందినీ పర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు వచ్చాయి. ఈ యేవం చిత్రం ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
యేవం సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (జూలై 25) స్ట్రీమింగ్‍కు వచ్చింది. నేటి మధ్యాహ్నం ఈ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. సాధారణంగా ఓటీటీల్లోకి చిత్రాలు ఎక్కవగా అర్ధరాత్రి వస్తాయి. కానీ యేవం మూవీని మధ్యాహ్నం 12 గంటలకు స్ట్రీమింగ్‍కు తెచ్చింది ఆహా.
థియేటర్లలో పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయిన యేవం సినిమా ఓటీటీలో మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఎక్కువ వ్యూస్ రావొచ్చు.
యేవం చిత్రానికి ప్రకాశ్ దంతులూరి దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ మూవీలో పోలీస్ సబ్ ఇన్‍స్పెక్టర్ సౌమ్య క్యారెక్టర్ చేశారు చాందినీ చౌదరి. వశిష్ట సింహ, జై భరత్ రాజ్, అషూ రెడ్డి, గోపరాజు రమణ కీలకపాత్రలు పోషించారు.
యేవం మూవీని హీరో నవదీప్‍తో పాటు పవన్ గోపరాజు నిర్మించారు. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. ఈ చిత్రానికి కీర్తన శేష్,నీలేష్ మండలపు సంగీతం అందించగా.. ఎస్‍వీ విశ్వేశ్వర్ సినిమాటోగ్రాఫర్‌గా చేశారు.
యేవం స్టోరీ లైన్
వికారాబాద్ పోలీస్ స్టేషన్‍లో పోలీస్ సబ్ ఇన్‍స్పెక్టర్ సౌమ్య (చాందినీ చౌదరి) విధులు చేపడుంది. ఒక రోజు ఓ అమ్మాయి హత్యకు గురవుతుంది. అయితే, మరో కేస్‍కు ఈ హత్యకు లింక్ ఉందని సౌమ్య కనిపెడుతుంది. సినిమా స్టార్లంటే ఇష్టం ఉండే అమ్మాయిలను వలలో వేసుకొని యుగంధర్ (విశిష్ట సింగ్) దురాగతాలకు పాల్పడుతున్నాడని సౌమ్య కనిపెడుతుంది. అయితే అతడిని పట్టుకునేందుకు చాలా సవాళ్లు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? యుగంధర్‌ను సౌమ్య పట్టుకుందా? ఆమెకు అభిరామ్ (జై భరత్ రాజ్) ఎలా సాయం చేశాడనేదే యేవం కథలో ముఖ్యమైన విషయాలు. కథ బాగానే ఉన్నా సినిమా కథనం సాగదీతగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మిక్స్డ్ టాక్ వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు దగ్గట్టు పర్ఫార్మ్ చేయలేకపోయింది.
యేవంతో పాటు చాందినీ చౌదరి నటించిన మ్యూజిక్‍షాప్ మూర్తి కూడా జూన్ 14వ తేదీనే థియేటర్లలో రిలీజ్ అయింది. దీంతో ఆమె చేసిన రెండు సినిమాలు ఒకే రోజున పోటీ పడే పరిస్థితి వచ్చింది. మ్యూజిక్‍షాప్ మూర్తికి ఎక్కువగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీలో అజయ్ ఘోష్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉన్నాయి. మ్యూజిక్‍షాప్ మూర్తి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
టాపిక్