Telugu Movie OTT: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఎమోషనల్ డ్రామా మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..
Music Shop Murthy OTT: మ్యూజిక్‍షాప్ మూర్తి సినిమా మరో ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈటీవీ విన్‍లో ముందుగా అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది.
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి మెయిన్ రోల్స్ చేసిన మ్యూజిక్‍షాప్ మూర్తి చిత్రంపై మొదటి నుంచి ఆసక్తి నెలకొని ఉంది. ఎక్కువగా నెగెటివ్ క్యారెక్టర్స్ చేసిన అజయ్ ఘోష్ ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ నెలకొంది. అందులోనూ ఎమోషనల్ డ్రామా మూవీగా ఈ చిత్రం రూపొందింది. అయితే, జూన్ 14వ తేదీన విడుదలైన మ్యూజిక్‍షాప్ మూర్తి మూవీకి ప్రశంసలు వచ్చాయి. మంచి కంటెంట్ ఉన్న చిత్రంగా గుర్తింపు దక్కించుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక్క రోజు గ్యాప్‍తో ఇంకో ఓటీటీలోకి..
మ్యూజిక్‍షాప్ మూర్తి సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి మంగళవారం (జూలై 16) స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ ఓటీటీ గతంలోనే డేట్ ప్రకటించి స్ట్రీమింగ్‍కు తెచ్చింది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సినిమా నేడు (జూలై 17) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. సడెన్‍గా మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
మ్యూజిక్‍షాప్ మూర్తి స్ట్రీమింగ్‍పై అమెజాన్ ప్రైమ్ వీడియో మందస్తుగా ప్రకటన చేయలేదు. నేడు హఠాత్తుగా స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేసింది. దీంతో ఈ సినిమాను ప్రస్తుతం ఈటీవీ విన్, ప్రైమ్ వీడియో ఓటీటీల్లో చూసేయవచ్చు.
మ్యూజిక్‍షాప్ మూర్తి గురించి..
50 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి డీజే అవ్వాలని ధ్యేయంగా పెట్టుకొని కృషి చేసే స్టోరీతో మ్యూజిక్‍షాప్ మూర్తి మూవీ వచ్చింది. ఈ చిత్రానికి శివ పాలడుగు దర్శకత్వం వహించారు. ఎమోషనల్ డ్రామాతో పాటు కాస్త కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మోస్తరుగా కలెక్షన్లు రాబట్టింది.
ఈ చిత్రంలో మ్యూజిక్‍షాప్ నడుపుకునే మిడిల్‍క్లాస్ వ్యక్తి మూర్తిగా అజయ్ ఘోష్ నటించారు. మరోసారి తన నటనతో ఆయన ఆకట్టుకున్నారు. ఎమోషన్ సీన్లలోనూ మెప్పించారు. మూర్తి డీజే అయ్యేందుకు దిశానిర్దేశం చేసే అంజన క్యారెక్టర్ చేశారు హీరోయిన్ చాందినీ చౌదరి. ఆమె నటన కూడా ఈ చిత్రంలో ఆకట్టుకుంది. మూర్తి భార్య పాత్రలో సీనియర్ నటి ఆమని నటించారు. భాను చందర్, దయానంద్ రెడ్డి కీరోల్స్ చేశారు.
మ్యూజిక్‍షాప్ మూర్తి చిత్రం తక్కువ బడ్జెట్‍తోనే రూపొందింది. అయితే, కంటెంట్ ఉండటం, నటీనటుల పర్ఫార్మెన్స్ మెప్పించటంతో ప్రశంసలను దక్కించుకుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. లవ్ స్టోరీ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సంగీతం అందించారు. ఈ మూవీకి మ్యూజిక్ కూడా మంచి ప్లస్ అయింది. దర్శకుడు శివ కమర్షియల్ అంశాల జోలికి పోకుండా కథను నిజాయతీగా ఈ మూవీలో చెప్పే ప్రయత్నం చేశారు.
హరోం హర కూడా రెండు ఓటీటీల్లో..
సుధీర్ బాబు హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా హరోం హర కూడా రెండు ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ముందుగా జూలై 15న ఆహాలోకి వచ్చిన ఈ చిత్రం ఒక్క రోజు గ్యాప్‍లో ఈటీవీ విన్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. హరోం హర మూవీ కూడా థియేటర్లలో జూన్ 14నే రిలీజైంది. దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది.
టాపిక్