Ajay Ghosh: మూవీ నచ్చకపోతే ఫోన్ చేసి బూతులు తిట్టండి: పబ్లిక్‍గా నంబర్ చెప్పేసిన అజయ్ ఘోష్
Ajay Ghosh - Music Shop Murthy Movie: మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ రిలీజ్‍కు రెడీ అయింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో నటుడు అజయ్ ఘోష్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సినిమా బాగోలేకపోతే తనను బూతులు తిట్టొచ్చని అన్నారు.
Ajay Ghosh: సీనియర్ నటుడు అజయ్ ఘోష్ విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. చాలా సినిమాల్లో ఆయన యాక్టింగ్‍కు బాగా గుర్తింపు వచ్చింది. అయితే, చిత్రాల్లో నటనతో పాటు ఈవెంట్లలో ఆయన చేసే కొన్ని కామెంట్లతోనూ పాపులర్ అయ్యారు. ఇప్పటి వరకు సపోర్టింగ్ రోల్స్ చేసిన చేసిన అజయ్ ఘోష్ ఇప్పుడు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రంలో ప్రధాన పాత్ర చేశారు. టైటిల్ రోల్‌లో నటించారు. చాందినీ చౌదరి కూడా ఓ మెయిన్ రోల్ చేశారు. ఈ చిత్రం ఈ శుక్రవారం (జూన్ 14) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ ఈవెంట్‍లో అజయ్ ఘోష్ మళ్లీ తన మార్క్ స్పీచ్ ఇచ్చారు.
నచ్చకపోతే తిట్టండి
మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రం అందరికీ నచ్చుతుందని తాను అనుకుంటున్నానని అజయ్ ఘోష్ అన్నారు. తప్పకుండా అందరూ చూడండి అంటూ కోరారు. అయితే, సినిమా చూశాక నచ్చకపోతే ఫోన్ చేసి బూతులు తిట్టండి అంటూ వేదికపైనే అన్నారు. “కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లండి. ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. నచ్చకపోతే ఇది నా నంబర్. ఫోన్ చేసి బూతులు తట్టండి” అని అజయ్ ఘోష్ అన్నారు. ఈ క్రమంలో తన ఫోన్ నంబర్ కూడా పూర్తిగా చెప్పేశారు.
మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో ప్రతీ ఒక్కరి జీవితం ఉంటుందని అజయ్ ఘోష్ అన్నారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని, మ్యూజిక్ షాప్ మూర్తి భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని చెప్పారు.
అజయ్ ఘోష్ ఓపెన్‍గా ఫోన్ నంబర్ చెప్పడం.. మూవీ నచ్చకపోతే తిట్టండి అనే కామెంట్లు చేయడంతో వేదికపై ఉన్న అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొత్తంగా మరోసారి తన స్పీచ్‍తో ఆకట్టుకున్నారు ఘోష్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రంలో అజయ్ ఘోష్, చాందినీ చౌదరితో పాటు సీనియర్ నటి ఆమని, అమిత్ శర్మ, భానుచందర్, దయానంద్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి శివ పాలడుగు దర్శకత్వం వహించారు. ఫ్లై హై సినిమాస్ పతాకంపై హర్ష గారపాటి, రంగ రావు గారపాటి నిర్మించిన ఈ మూవీకి పవన్ మ్యూజిక్ అందించారు.
ఆకట్టుకున్న ట్రైలర్
మ్యూజిక్ షాప్ మూర్తి ట్రైలర్ ఇటీవలే రాగా ఆకట్టుకుంది. చాలా ఏళ్లుగా మ్యూజిక్ షాప్ నడుపుకునే మూర్తి (అజయ్ ఘోష్) ఆదాయం పడిపోతుంది. దీంతో మొబైల్ షాప్ పెట్టాలని భార్య (ఆమని) వాదిస్తే.. తాను మ్యూజిక్‍లోనే ఏదైనా కొత్తగా చేయాలని మూర్తి పట్టుదలగా ఉంటారు. అయితే, డీజే నేర్చుకోవాలని మూర్తికి చాందిని చౌదరి చెబుతారు. దీంతో డీజే నేర్చుకోవాలని మూర్తి డిసైడ్ అవుతారు. ఈ క్రమంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఆ తర్వాత డీజే అవుతారు. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ట్రైలర్ ఎమోషనల్‍గా ఉంటూ ఆకట్టుకుంది. ఎంటర్‌టైనింగ్‍గా కూడా అనిపించింది. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. పాజిటివ్ టాక్ వస్తే ఈ చిత్రానికి కలెక్షన్లు బాగానే వచ్చే అవకాశం ఉంది.