Brahmamudi Promo: త‌ప్పును రాజ్‌పై నెట్టేసిన రుద్రాణి - కొడుకుకు అప‌ర్ణ ప‌నిష్‌మెంట్ - తిరిగి అత్తింటికి కావ్య‌-brahmamudi serial latest promo aparna punishes raj on kavya in star maa disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Promo: త‌ప్పును రాజ్‌పై నెట్టేసిన రుద్రాణి - కొడుకుకు అప‌ర్ణ ప‌నిష్‌మెంట్ - తిరిగి అత్తింటికి కావ్య‌

Brahmamudi Promo: త‌ప్పును రాజ్‌పై నెట్టేసిన రుద్రాణి - కొడుకుకు అప‌ర్ణ ప‌నిష్‌మెంట్ - తిరిగి అత్తింటికి కావ్య‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 15, 2024 05:08 PM IST

Brahmamudi Promo: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ లేటెస్ట్ ప్రోమోలో రుద్రాణి కార‌ణంగానే కావ్య పుట్టింటికి వెళ్లిపోయింద‌ని ఆమెపై అప‌ర్ణ ఫైర్ అవుతుంది. కావ్య పుట్టింటికి వెళ్లిపోవ‌డానికి తాను కార‌ణం కాద‌ని రాజ్ అంటూ రుద్రాణి అంటుంది. త‌ల్లి ముందు రాజ్‌ను ఇరికించిన‌ట్లుగా చూపించారు.

బ్రహ్మముడి సీరియల్ ప్రోమో
బ్రహ్మముడి సీరియల్ ప్రోమో

Brahmamudi Promo: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కావ్య‌ను తిరిగి తీసుకుర‌మ్మ‌ని రాజ్‌ను అడుగుతుంది ఇందిరాదేవి. కానీ రాజ్ మాత్రం అందుకు ఒప్పుకోడు. కావ్య‌ను తిరిగి ఇంటికి ర‌మ్మ‌ని తాను అడ‌గ‌న‌ని నాన‌మ్మ‌కు స‌మాధాన‌మిస్తాడు. కావ్య తిరిగి రావ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని చెబుతాడు. త‌నంత‌ట తానుగా కావ్య వ‌చ్చిన ఊరుకునేది లేద‌ని కోపంగా బ‌దులిస్తాడు. పుట్టింటిలో దిగాలుగా ఉన్న కావ్య‌ను అప్పు ఓదార్చుతుంది.

దుగ్గిరాల ఇంటిని వ‌దిలిపెట్టి త‌ప్పుచేశావ‌ని కావ్య‌తో అంటుంది అప్పు. రాజ్‌కు త‌న‌పై ప్రేమ లేద‌ని చెల్లిలితో అసలు నిజం చెబుతుంది కావ్య‌. రాజ్‌ మ‌న‌సులో నాకు స్థానం లేద‌ని తెలిసి త‌ర్వాత కూడా ఇంక అక్క‌డే ఉండ‌టంలో అర్థం లేదంటూ అప్పుతో త‌న మ‌న‌సులోని బాధ‌ను కావ్య పంచుకుంటుంది. త‌ల్లిదండ్రుల‌పై ఆధార‌ప‌డ‌కుండా త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ‌టానికి ఉద్యోగం చేయాల‌ని కావ్య నిర్ణ‌యించుకుంటుంది.

దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషం...

కోమాల‌కు వెళ్లిపోయి అప‌ర్ణ హ‌ఠాత్తుగా క‌ళ్లు తెరుస్తుంది. అది చూసి దుగ్గిరాల కుటుంబ‌స‌భ్యులంద‌రూ సంతోష‌ప‌డ‌తారు. కోమాలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అప‌ర్ణ కావ్య గురించి అడుగుతుంది. కానీ రాజ్ మాత్రం త‌ల్లి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకుంటాడు. అప‌ర్ణ ఇంకా క్రిటిక‌ల్ కండీష‌న్‌లోనే ఉంద‌ని, ఆమెకు ఎలాంటి షాకింగ్ న్యూస్‌ల విన్నా ఆమె మ‌ళ్లీ కోమాలోకి వెళ్లే ప్ర‌మాద‌ముంద‌ని డాక్ట‌ర్లు అంటారు.

స్వ‌ప్న హార‌తి...

హాస్పిట‌ల్ నుంచి ఇంటికొచ్చిన అప‌ర్ణ‌కు స్వ‌ప్న హార‌తి ఇస్తుంది. కావ్య కాకుండా నువ్వెందుకు హార‌తి ఇస్తున్నావ‌ని స్వ‌ప్న‌ను అడుగుతుంది అప‌ర్ణ‌. కావ్య ఎందుకు క‌నిపించ‌డం లేద‌ని కుటుంబ‌స‌భ్యుల‌ను నిల‌దీస్తుంది అప‌ర్ణ‌.

అప‌ర్ణ ప్ర‌శ్న‌లు...

తాను లేన‌ప్పుడు ఇంట్లో ఏం జ‌రిగింద‌ని రాజ్‌ను నిల‌దీస్తుంది అప‌ర్ణ‌. కానీ త‌ల్లికి ఏమ‌ని స‌మాధానం చెప్పాలో తెలియ‌క రాజ్ మౌనంగా ఉంటాడు. కావ్య హాస్పిట‌ల్‌కు ఎందుకు రాలేద‌ని, ఆమె క‌నిపించ‌క‌పోతే నువ్వేం చేస్తున్నావ‌ని రాజ్‌ను ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు అడుగుతుంది అప‌ర్ణ‌. ఆమె ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌కుండా సెలైంట్‌గా ఉంటారు.

రుద్రాణి ప్లాన్‌...

షాకింగ్ న్యూస్ వింటే అప‌ర్ణ ప్రాణాల‌కు ప్ర‌మాద‌మ‌ని డాక్ట‌ర్లు చెప్పిన మాట‌ల్ని రుద్రాణి గుర్తుచేసుకుంటుంది. కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింద‌నే షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌పెడితే ఆమె మ‌ళ్లీ కోమాల‌కు వెళ్లిపోతుంద‌ని, అదే జ‌రిగితే కావ్య శాశ్వ‌తంగా పుట్టింట్లోనే ఉంటుంద‌ని రుద్రాణి అనుకుంటుంది.

అపర్ణ షాక్…

కావ్య చేయాల్సిన త‌ప్పుల‌న్నీ చేసి...మొహం చూపించ‌లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయింద‌ని అప‌ర్ణ‌తో అంటుంది రుద్రాణి. కావ్య పుట్టింటికి వెళ్లిపోయిందనే నిజం తెలిసి అపర్ణ షాకవుతుంది. రుద్రాణి కారణంగానే కావ్య ఇంటికిదూర‌మైంద‌ని అనుకుంటుంది. ఆమెపై ఫైర్ అవుతుంది. కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి రాజ్ కార‌ణ‌మంటూ అప‌ర్ణ‌కు రుద్రాణి బ‌దులిస్తుంది. రాజ్‌ను ఇరికించి తాను త‌ప్పించుకుంటుంది.

రాజ్ కార‌ణంగానే కావ్య పుట్టింటికి వెళ్లింద‌ని రుద్రాణి చెప్పిన మాట‌లు న‌మ్మిన అప‌ర్ణ కొడుకుకు ప‌నిష్‌మెంట్ ఇవ్వ‌నున్న‌ట్లు బ్ర‌హ్మ‌ముడి లేటెస్ట్ ప్రోమోలో చూపించారు. తిరిగి అత్తింటికి కావ్య‌రానుందా? రుద్రాణి ప్లాన్ ఫెయిలైందా, స‌క్సెస్ అయ్యింది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపించ‌బోతున్నారు.