Brahmamudi September 4th Episode: జైలు నుంచి బయటపడ్డ రాహుల్ - కావ్యపై రివేంజ్ - అపర్ణ ప్రాణాలకు ప్రమాదం
Brahmamudi September 4th Episode: బ్రహ్మముడి సెప్టెంబర్ 4 ఎపిసోడ్‌లో రాహుల్‌ను నిర్దోషిగా పోలీసులు విడుదలచేస్తారు. తన కొడుకు జైలు నుంచి బయటకు రావడంతో రుద్రాణి తెగ సంబరపడుతుంది. తనను జైలు పాలు చేసిన కావ్యపై రివేంజ్ తీర్చుకునేందుకు రాహుల్ కన్నింగ్ ప్లాన్ వేస్తాడు.
Brahmamudi September 4th Episode: రాజ్‌జైలుకు పంపించాలని రాహుల్ వేసిన ప్లాన్ కావ్య కారణంగా బెడిసికొడుతుంది. ఆధారాలతో సహా రాహుల్ నేరాన్ని బయటపెడుతుంది కావ్య. దాంతో రాజ్‌కు క్లీన్ చీట్ ఇచ్చిన పోలీసులు తప్పు చేసిన రాహుల్‌ను అరెస్ట్‌చేస్తారు. తన కొడుకు జైలు పాలవ్వడంతో రుద్రాణి షాకవుతుంది.
రాహుల్ అనాథలా జైలులో ఉండటం తట్టుకోలేకపోతున్నానని, రాహుల్‌ను కావాలనే ఈ కేసులో ఎవరో ఇరికించారంటూ తల్లిదండ్రుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా నాటకం ఆడుతుంది రుద్రాణి. కానీ ఆమె యాక్టింగ్‌ను సీతారామయ్య, ఇందిరాదేవి ఇద్దరు నమ్మరు.
బాధ్యత అప్పగిస్తే స్వార్థంతో...
రాహుల్‌కు ఎంతో పెద్ద బాధ్యత అప్పగిస్తే స్వార్థంతో ఈ ఇంటికే మచ్చ తీసుకురాబోయాడని సీతారామయ్య ఆవేశానికి లోనవుతాడు. రాహుల్‌ను జైలు నుంచి విడిపించనని అంటాడు. నా ముఖం చూసైనా రాహుల్‌ను విడిపించమని రుద్రాణి...ఇందిరాదేవిని రిక్వెస్ట్ చేస్తుంది. నీ ముఖం చూస్తే అసలు రాహుల్‌ను క్షమించాలనే అనిపించదని ఇందిరాదేవిఅంటుంది.
ఈ ఇంటి పరువును గంగలో కలిపిన వాడిని క్షమించేది లేదని చెబుతుంది. రాహుల్‌ను మేము విడిపించమని, ఈ ఇంటివాళ్లు ఎవరైనా విడిపించాలని అనుకుంటే మొదట అడ్డుకునేది తామేనని రుద్రాణితో షాకిస్తుంది ఇందిరాదేవి.
రాజ్ దిక్కు...
రాహుల్‌ను జైలు నుంచి విడిపించడానికి రాజ్ తప్ప మరొకరు దిక్కులేరని రుద్రాణి అనుకుంటుంది. రాజ్ ముందుకొచ్చి రాహుల్ ఈ తప్పు చేసి ఉండడని కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా డ్రామా కంటిన్యూ చేస్తుంది. రాహుల్ నిర్ధోషి అని నువ్వు నమ్మితే... కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పు వాళ్లే విడుదలచేస్తారని రుద్రాణి పంచ్ ఇస్తాడు రాజ్. కోర్టు నిర్దోషులకు శిక్ష వేయదని సెటైర్‌వేస్తాడు.
సెంటిమెంట్ డైలాగ్స్...
రాజ్‌ను సెంటిమెంట్‌తో బోల్తా కొట్టించాలని ఫిక్సవుతుంది రుద్రాణి. నాది తల్లి ప్రాణం...కడుపుతీపి కుదురుగా ఉండనివ్వడం లేదని, రాహుల్‌ను విడిపించే మార్గం ఏదైనా ఉంటే చూడమనిరాజ్‌ను బతిమిలాడుతుంది. నువ్వు రాహుల్ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు కదా...ఆ బంధాన్నైనా దృష్టిలో పెట్టుకొని తన కొడుకును విడిపించమని రాజ్‌ను రుద్రాణి వేడుకుంటుంది.
రుద్రాణి ఎమోషనల్ డ్రామాకు రాజ్ కరిగిపోడు. మొదటిసారి రాహుల్ తప్పు చేసినప్పుడు నువ్వు దండించి ఉంటే ఇన్ని తప్పు చేసుండేవాడు కాదు...ఈ రోజు ఇలా అన్నం పెట్టిన ఇంటికి అన్యాయం తలపెట్టుండేవాడు కాదని రుద్రాణిని కడిగిపడేస్తాడు రాజ్. కనీసం స్వప్న ముఖం చూసైనా రాజ్‌ను విడిపించమని చివరి అస్త్రం ప్రయోగిస్తుంది రుద్రాణి. అది వర్కవుట్ అయ్యే టైమ్‌లో అపర్ణ వచ్చి రుద్రాణి ప్లాన్‌ను చెడగొట్టేస్తుంది.
నా కొడుకుపై నిందలు వేశావు...
ఇన్నాళ్లకు నా కొడుకు మంచి మనసు నీకు గుర్తొచ్చిందా అంటూ రుద్రాణి సెటైర్లు వేస్తుంది అపర్ణ. రాజ్ తప్పు చేశాడని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వాడిపై నిందలు వేశాడు, కనీసం మేనల్లుడు అనే జాలి చూపించలేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రాజ్ దగ్గరకు వచ్చి నీ కొడుకును విడిపించమని బతిమిలాడుతున్నావని క్లాస్ ఇస్తుంది. సాయం అడగటానికి సిగ్గులేదా అని రుద్రాణిని దులిపేస్తుంది అపర్ణ.
రాజ్ తప్పు చేయడు...
నీ కొడుకు తప్పు చేస్తే ఇలాగే మాట్లాడుతావా అని అపర్ణతో అంటుంది రుద్రాణి. నా కొడుకు రాజ్ అసలు తప్పు చేయడని అపర్ణ బదులిస్తుది. మాయ విషయంలో రాజ్ తప్పు చేశాడని ఆరోపణలు రావడంతో వాడిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని నేనే తీర్పు ఇచ్చానని అపర్ణ అంటుంది.
తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలా తిరిగి ఇంట్లోకి వచ్చాడు. తప్పు చేస్తే రాజ్‌ను క్షమించని నేను రాహుల్‌ను ఎలా క్షమిస్తాను. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే దొంగలను జైలు శిక్ష పడితేనే బుద్దొస్తుందని రుద్రాణిని అవమానిస్తుంది అపర్ణ. వదిన మాటలను రుద్రాణి సహించలేకపోతుంది. ఈ ఇళ్లును ముక్కులు చేస్తానని శపథం చేస్తుంది.
స్వప్న బిర్యానీ పార్టీ...
రాహుల్‌ను ఎలా విడిపించాలా అని ఆలోచిస్తున్న రుద్రాణికి స్వప్న బిర్యానీ తింటూ కనిపిస్తుంది. ఆ సీన్ చూసి ఆమె కోపం, చిరాకు మరింత పెరుగుతుంది. నీ మొగుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే బాధ లేదా అని అడుగుతుంది. కుట్రలు, కుతంత్రాలు చేసిన వారు జైలుకే పోతారు. చేసిన తప్పుకు రెండు, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు. రాహుల్ గురించి ఆలోచించడం మానేసి బిర్యానీ తినమని రుద్రాణికి సలహా ఇస్తుంది స్వప్న.
రాహుల్ నిర్దోషి...
రాహుల్‌ను తీసుకొని పోలీసులు దుగ్గిరాల ఇంటికొస్తారు. ఆ సీన్ చూసి అందరూ షాకవుతారు. తాను నిర్ధోషినని తెలిసి పోలీసులు రిలీజ్ చేశారని రాహుల్ అంటాడు. మీ కంపెనీ పేరుతో పాటు రాహుల్ పేరును వాడుకొని ఎవరో ఈ తప్పు చేశారని, వారిని పట్టుకునే పనిలో ఉన్నామని చెప్పి పోలీసులు వెళ్లిపోతారు. తన కొడుకు జైలు నుంచి రిలీజ్ కావడంతో రుద్రాణి ఆనందపడుతుంది.
నిన్న నా కొడుకు తప్పు చేశాడని తీర్మాణించిన వాళ్లు ఇప్పుడు ఏమంటారు రుద్రాణి రెచ్చిపోతుంది. నా కొడుకును కటకటాల రుద్రాయ్యలా చూడాలని మీ ఆశ అడుగంటిపోయినందుకు అవాక్కైయ్యారా అంటూ అందరిని దెప్పిపొడుస్తుంది. సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణ, రాజ్‌తో పాటు అందరిని దులిపేస్తుంది. ఇప్పుడు చెప్పండి నీతి సూత్రాలు, సుభాషితాలు అంటూ తనలోని కోపం మొత్తం బయటపెడుతుంది. కావ్యకు క్లాస్ ఇవ్వబోతుంది.
కానీ ఆమె ప్లాన్ రివర్స్ అవుతుంది. నీ కొడుకు ఇంటికి వచ్చినంత మాత్రానా నిర్ధోషి అని రుజువు అయినట్లు కాదని రుద్రాణితో అంటుంది కావ్య. సత్యాన్వేషణ మొదలుపెడితే నీ కొడుకు బాగోతాలు మొత్తం బయటపడతాయని అంటుంది.
బండారం బయటపెడతా...
ఇంటి పెద్దరికాన్ని, నా భర్తను, నా అత్తను ఏకవచనంతో సంబోదిస్తే ఊరుకునేది లేదని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. నిన్న ప్రవేశపెట్టిన సాక్ష్యాలు ఈ రోజు ఎలా చెల్లకుండాపోయాయో, మా ఆయన్ని దొంగ బంగారం కేసులో ఇరికించాలని ఎవరు అనుకున్నారో మొత్తం బయటపెడతాడనని కావ్య అంటుంది.
ముందుంది ముసళ్ల పండుగ అంటూ వార్నింగ్ ఇస్తుంది. నీ కొడుకును తీసుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోమని వార్నింగ్ ఇస్తుంది. అర్థంకానీ భాషలో మాట్లాడితే ఇక్కడ ఎవరూ తలదించుకోరని క్లాస్ ఇస్తుంది.
రాహుల్ కన్నింగ్ ప్లాన్..
కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుడిలో అభిషేకం చేసి అన్నదానం చేయాలని అనుకుంటారు. తన ఆరోగ్యం బాగాలేదని రాలేనని అపర్ణ అంటుంది. అపర్ణ యోగక్షేమాలు చూడటానికి కావ్య కూడా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంటుంది. అపర్ణను చంపేసి ఆ నేరాన్ని కావ్యపై నెట్టాలని రుద్రాణితో కలిసి రాహుల్ ప్లాన్ చేస్తాడు.