Brahmamudi Serial: 500 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న బ్ర‌హ్మ‌ముడి - తెలుగులో రేర్ రికార్డ్ ఈ సీరియ‌ల్‌దే!-brahmamudi serial completes 500 episodes star maa serials telugu serials trp ratings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Serial: 500 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న బ్ర‌హ్మ‌ముడి - తెలుగులో రేర్ రికార్డ్ ఈ సీరియ‌ల్‌దే!

Brahmamudi Serial: 500 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న బ్ర‌హ్మ‌ముడి - తెలుగులో రేర్ రికార్డ్ ఈ సీరియ‌ల్‌దే!

Nelki Naresh Kumar HT Telugu
Aug 29, 2024 09:39 AM IST

Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ 500 ఎపిసోడ్స్‌ను పూర్తిచేసుకున్న‌ది. ఈ విష‌యాన్ని స్టార్ మా ఆఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. తెలుగులో టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా అత్య‌ధిక వారాలు నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచిన సీరియ‌ల్‌గా బ్ర‌హ్మ‌ముడి అరుదైన రికార్డ్‌ను నెల‌కొల్పింది.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్

Brahmamudi Serial:ప్ర‌స్తుతం స్టార్ మా ఛానెల్‌లోనే కాకుండా తెలుగు సీరియ‌ల్స్‌లో టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది బ్ర‌హ్మ‌ముడి. ఈ సీరియ‌ల్‌కు బుల్లితెర‌పై ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. తాజాగా ఈ సీరియ‌ల్ 500 ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేసుకున్న‌ది. ఈ విష‌యాన్ని స్టార్‌గా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. అభిమానుల ప్రేమ‌, స‌పోర్ట్ వ‌ల్లే ఈ మైలురాయిని చేరుకోగ‌లిగామ‌ని స్టార్ మా పేర్కొన్న‌ది. ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

రేర్ రికార్డ్‌...

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ తెలుగులో ఓ రేర్ రికార్డ్‌ను నెల‌కొల్పింది. 2023 జ‌న‌వ‌రిలో బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ప్రారంభ‌మైంది. రెండు మూడు వారాలు మిన‌హాయిస్తే సీరియ‌ల్ ప్రారంభ‌మైన నాటి నుంచి 500 ఎపిసోడ్స్ పూర్త‌య్యే వ‌ర‌కు టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో బ్ర‌హ్మ‌ముడి కొన‌సాగుతూ వ‌స్తోంది. తెలుగు లో అత్య‌ధిక వారాలు టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా టాప్ ప్లేస్‌లో నిలిచిన సీరియ‌ల్‌గా బ్ర‌హ్మ‌ముడి అరుదైన రికార్డ్‌ను సృష్టించింది.

రాజ్‌, కావ్య జోడి...

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో రాజ్‌, కావ్య జోడి అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. కావ్య పాత్ర‌లో దీపికా రంగ‌రాజు, రాజ్‌గా మాన‌స్ నాగుల‌ప‌ల్లి న‌టిస్తున్నారు. హ‌మీదా ఖాతూన్‌, నైనీషా, కిర‌ణ్ కాంత్‌, ష‌ర్మితా గౌడ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బెంగాళీలో సూప‌ర్ హిట్ అయిన గాత్‌చోరా సీరియ‌ల్ ఆధారంగా బ్ర‌హ్మ‌ముడిని రూపొందించారు. క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ, మ‌ల‌యాళం, మ‌రాఠీ భాష‌ల్లో ఈ సీరియ‌ల్ రీమేక్ అయ్యింది. ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామాగా టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియ‌ల్‌కు గిరిధ‌ర్ పంతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ముగ్గురు అక్కాచెల్లెళ్ల క‌థ‌...

ఒకే కుటుంబానికి చెందిన గొప్పింటి అబ్బాయిల‌ను పెళ్లిచేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్ల క‌థ‌తో బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ రూపొందింది. కావ్య నీతి, నిజాయితీలు క‌ల‌బోసిన ధైర్య‌వంతురాలైన ఇల్లాలు. అక్క చివ‌రి నిమిషంలో పెళ్లిపీట‌ల‌పై నుంచి పారిపోవ‌డంతో రాజ్‌ను పెళ్లిచేసుకుంటుంది. ఇష్టంలేని కోడ‌లిగా దుగ్గిరాల ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన కావ్య‌...అత్తింటి వారి మ‌న‌సుల్ని ఎలా గెలుచుకుంది?

అక్క స్వ‌ప్న‌తో పాటు చెల్లెలు అప్పు జీవితాల‌ను ఎలా స‌రిదిద్దేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది? కావ్య‌ను రుద్రాణి ద్వేషించ‌డానికి కార‌ణం ఏమిటినే అంశాల‌తో ఈ సీరియ‌ల్ సాగుతోంది. బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ను స్టార్ మాతో పాటు డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో చూడొచ్చు.

కార్తీక దీపం సెకండ్‌...

టీఆర్‌పీ రేటింగ్‌లో స్టార్ మా సీరియ‌ల్స్‌లో బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ త‌ర్వాత కార్తీక దీపం 2, గుండెనిండా గుడి గంట‌లు సీరియ‌ల్స్ ఉన్నాయి.