Brahmamudi August 24th Episode: అప్పును అవ‌మానించిన ధాన్య‌ల‌క్ష్మి - కావ్య క‌న్నీళ్లు - ఒక్క‌టైన అక్కాచెల్లెళ్లు-brahmamudi august 24th episode dhanyalaxmi insults appu brahmamudi serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 24th Episode: అప్పును అవ‌మానించిన ధాన్య‌ల‌క్ష్మి - కావ్య క‌న్నీళ్లు - ఒక్క‌టైన అక్కాచెల్లెళ్లు

Brahmamudi August 24th Episode: అప్పును అవ‌మానించిన ధాన్య‌ల‌క్ష్మి - కావ్య క‌న్నీళ్లు - ఒక్క‌టైన అక్కాచెల్లెళ్లు

Nelki Naresh Kumar HT Telugu
Aug 24, 2024 07:46 AM IST

Brahmamudi August 24th Episode: బ్ర‌హ్మ‌ముడి ఆగ‌స్ట్ 24 ఎపిసోడ్‌లో అప్పును అడివి మ‌నిషి అంటూ ధాన్య‌ల‌క్ష్మి అవ‌మానిస్తుంది. ఆమెను ఇంట్లో నుంచి వెళ్ల‌గొట్టాల‌ని చూస్తుంది. కానీ ఇందిరాదేవి కార‌ణంగా ధాన్య‌ల‌క్ష్మి ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది.

బ్ర‌హ్మ‌ముడి ఆగ‌స్ట్ 24 ఎపిసోడ్‌
బ్ర‌హ్మ‌ముడి ఆగ‌స్ట్ 24 ఎపిసోడ్‌

Brahmamudi August 24th Episode: అప్పు త‌న‌ను అర్థం చేసుకోవ‌డం చూసి కావ్య ఎమోష‌న‌ల్ అవుతుంది. అప్పు త‌న‌పై చూపించిన ప్రేమ‌ను చూసి ఎమోష‌న‌ల్ అవుతుంది కావ్య‌. క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. క‌ళ్యాణ్, అప్పుల‌కు ప‌ద్ద‌తిగా పెళ్లి జ‌రిగితే సంతోషంగా ఈ ఇంటిలో త‌న చెల్లెలు కాపురం చేసేద‌ని అనుకుంటుంది. కోడ‌లు క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం చూసి అప‌ర్ణ కంగారు ప‌డుతుంది. నువ్వు ఎవ‌రిని వ‌దిలిపెట్టి ఉండ‌లేవు క‌దా...ఎప్ప‌టికైనా క‌ళ్యాణ్, అప్పుల‌ను ఇంట్లో అడుగుపెట్టేలా చేసేది నువ్వే అని కావ్య‌కు స‌ర్ధిచెబుతుంది.

క‌ళ్యాణ్ బాధ‌...

త‌న కోసం మాత్ర‌మే త‌ల్లి ధాన్య‌ల‌క్ష్మి షాపింగ్ చేసింద‌ని తెలిసి క‌ళ్యాణ్ బాధ‌ప‌డ‌తాడు. అమ్మ నా కోసం మాత్ర‌మే షాపింగ్‌ చేసి అప్పును మ‌రిచిపోయింద‌ని, త‌న‌కు కోడ‌లు ఉంద‌ని కూడా గుర్తించ‌డం లేద‌ని బాధ‌ప‌డ‌తాడు. ధాన్య‌ల‌క్ష్మి మారిపోయింద‌ని క‌ళ్యాణ్‌కు స‌ర్ధిచెప్ప‌బోతుంది ఇందిరాదేవి. నిజంగా మారిపోయింది అయితే చిన్న చీర విష‌యానికే అప్పును అంత‌గా అవ‌మానించేది కాద‌ని క‌ళ్యాణ్‌ బాధ‌ప‌డ‌తాడు.

క‌లిసిపోయిన అక్కాచెల్లెళ్లు...

అప్పు చీర క‌ట్టుకొని కిందికొస్తుంది. అస‌లు అప్పు ఆడ‌దానిలా క‌నిపించ‌డం లేద‌ని ధాన్య‌ల‌క్ష్మి లోలోన అనుకుంటుంది ఎలాగైనా అప్పును అవ‌మానించి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసే అవ‌కాశం కోసం ఎదురుచూస్తుంది. ధాన్య‌ల‌క్ష్మిని చూసి అప్పు కంగారు ప‌డుతుంటంతో ఆ దుష్ట‌శ‌క్తుల‌ను చూసి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని స్వ‌ప్న‌, కావ్య అంటారు.

అప్పు, కావ్య‌, స్వ‌ప్న సంబ‌రంగా మాట్లాడుకోవ‌డం చూసి రాజ్ ఆనంద‌ప‌డ‌తాడు. ఎప్పుడు ఇలాగే ఉంటే ప్ర‌తిరోజు పండుగ‌లానే ఉంటుంద‌ని అప‌ర్ణ‌, ఇందిరాదేవి అనుకుంటారు. అంద‌రం ఒకే చోట ఉంటే ఈ సంతోషం ఇలాగే ఉంటుంద‌ని క‌ళ్యాణ్‌ను క‌న్వీన్స్ చేయ‌బోతాడు రాజ్‌.

అప్పుకు అవ‌మానం...

పూజ‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రి తీసుకురావ‌డానికి కిచెన్‌లోకి వ‌స్తుంది అప్పు. అక్క‌డే ధాన్య‌ల‌క్ష్మి ఉండ‌టంతో ఆమెను అత్త‌య్య అని పిలుస్తుంది. ఆ పిలుపు విని ధాన్య‌ల‌క్ష్మి ఫైర్ అవుతుంది. అప్పు చేత ముత్తైదువ‌ల‌కు జ్యూస్ ఇప్పిస్తారు. ఆ జ్యూస్ ఓ ముత్తైదువ‌పై ప‌డేలా ధాన్య‌ల‌క్ష్మి, రుద్రాణి ప్లాన్ చేస్తారు. కావాల‌నే అప్పు ఇదంతా చేసింద‌ని ధాన్య‌ల‌క్ష్మి ఫైర్ అవుతుంది. ఇంటికి వ‌చ్చిన ముత్తైదువ‌ల‌ను ఎలా చూసుకోవాలో తెలియ‌దా...బొత్తిగా అడివి మ‌నిషిలా ఉన్నావ‌ని అవ‌మానిస్తుంది.

మీ అమ్మ నిన్ను ఊరి మీదికి వ‌దిలేస్తే ఇలాంటి బుద్దులేవ‌స్తాయ‌ని ముత్తైదువ‌లు కూడా అప్పును అవ‌మానిస్తారు.మీ ఇంటికి ఉన్న పేరు ను నీ కోడలు వీధిన ప‌డేసేలా క‌నిపిస్తుంద‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటారు. మా క‌ళ్యాణ్ కూడా తొంద‌ర‌ప‌డి అప్పును పెళ్లిచేసుకొని మా కొంప ముంచాడ‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. కావాల‌నే అప్పును రెచ్చ‌గొట్టి గొడ‌వ పెద్ద‌ది చేయాల‌ని ముత్తైదువ‌లుచూస్తారు. కానీ క‌ళ్యాణ్‌కు ఇచ్చిన మాట కోసం అప్పు మౌనంగా ఉంటుంది. భార్య‌కు త‌న క‌ళ్ల ముందే అవ‌మానం జ‌ర‌గ‌డం క‌ళ్యాణ్ స‌హించ‌లేక‌పోతాడు.

ఇందిరాదేవి స‌పోర్ట్‌...

అప్పుకు ఇందిరాదేవి స‌పోర్ట్ చేస్తుంది. ఇంటి గుట్టును ప‌దిమందికి ప్ర‌సాదంలా పంచుతున్నావ‌నిధాన్య‌ల‌క్ష్మి కి క్లాస్ ఇస్తుంది. ఆవిడ గ్లాస్ స‌రిగ్గా ప‌ట్టుకోలేద‌ని, ఇందులో నీ త‌ప్పేం లేద‌ని అప్పుతో అంటుంది ఇందిరాదేవి. మీ అత్త క‌ళ్ల‌కు పొర‌లు క‌ప్పి ఉండ‌టంతో అది గుర్తించ‌లేద‌ని చెబుతుంది. ఆ త‌ర్వాత వ్ర‌తంలో ఎవ‌రి కొడుకు, కోడ‌లు వెనుకు వాళ్ల అత్త‌గారు కూర్చోవాల‌ని చెబుతుంది. అప్పు, క‌ళ్యాణ్ వెనుక కూర్చోవ‌డానికి అంగీక‌రించ‌దు.

ప్ర‌కాశం వార్నింగ్ ఇవ్వ‌డంతో కూర్చుంటుంది. వ్ర‌తం ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా పూర్త‌వ్వ‌డం చూసి ఇంట్లో వాళ్లు అంద‌రూఆనంద‌ప‌డ‌తారు. ముత్తైదువ‌ల‌కు భోజ‌నం వ‌డ్డించే స‌మ‌యంలో అప్పులోని త‌ప్పుల‌ను ధాన్య‌ల‌క్ష్మి ఎత్తిచూపుతుంది. వారికి వ్ర‌తం భోజ‌నం పెడుతున్నావా...పిండం భోజ‌నం పెడుతున్నావా.. ఇంత చిన్న విష‌యం కూడా తెలియ‌దా అంటూ ఎగిరిప‌డుతుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.