Brahmamudi August 23rd Episode: బ్రహ్మముడి- ధాన్యలక్ష్మికి షాక్ ఇచ్చిన కావ్య- అప్పుకు అడుగడుగునా అవమానం- అడవి మనిషి అంటూ-brahmamudi serial august 23rd episode dhanyalakshmi evil scheme insult to appu kavya gave twist brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 23rd Episode: బ్రహ్మముడి- ధాన్యలక్ష్మికి షాక్ ఇచ్చిన కావ్య- అప్పుకు అడుగడుగునా అవమానం- అడవి మనిషి అంటూ

Brahmamudi August 23rd Episode: బ్రహ్మముడి- ధాన్యలక్ష్మికి షాక్ ఇచ్చిన కావ్య- అప్పుకు అడుగడుగునా అవమానం- అడవి మనిషి అంటూ

Sanjiv Kumar HT Telugu
Aug 23, 2024 07:41 AM IST

Brahmamudi Serial August 23rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌లో గుమ్మం ముందే కల్యాణ్, అప్పులను ఆపేసి అవమానిస్తారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి. కానీ, వాళ్లకు షాక్ ఇచ్చి లోపలికి వచ్చేలా చేస్తుంది కావ్య. తర్వాత కూడా ఇంట్లో అప్పుకు అడుగడుగునా అవమానించేలా చేస్తుంది ధాన్యలక్ష్మీ.

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో వ్రతానికి ఇంటికి వెళ్లడానికి ఆలోచిస్తుంటే అప్పు వచ్చి ఏమైందని అడుగుతుంది. నానమ్మ, తాతయ్య వాళ్లు ఎంత కంట్రోల్ చేసుకున్న మా అమ్మ, రుద్రాణి అత్తయ్య అనే మాటలను ఆపలేం. నిన్ను అవమానిస్తారు అని కల్యాణ్ అంటాడు.

వాళ్లు ఏం అన్న నేను ఒక్క మాట ఎదురు చెప్పను అని అప్పు అంటుంది. నీ గురించి నాకు తెలియదా.. నువ్ ఎక్కడ ఊరుకుంటావ్. నువ్ మా అమ్మను అన్న నాకే బాధ. అమ్మ నిన్ను అన్న నాకే బాధ అని కల్యాణ్ అంటాడు. తాతయ్య వాళ్లు వచ్చి పిలిచాక కూడా వెళ్లకుంటే మర్యాదగా ఉండదు. వాళ్లు ఎన్ని మాట్లాడిన సరే నేను నోరు ఎత్తను అని కల్యాణ్ చేతిలో అప్పు చేయి ప్రామిస్ చేస్తుంది. మరుసటి రోజు కావ్య పూజకు అంతా రెడీ చేస్తుంటుంది.

జరిగేది తెలియక

ఇందిరాదేవి, అపర్ణ తన గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. నేను కూడా చేశాను కదత్తయ్య అని అపర్ణ అంటుంది. నీకు నీ కోడలితోనే పోటీనా అని ఇందిరాదేవి అంటుంది. అమ్మో దానికున్న ఓర్పు సహనం నాకు ఎక్కడిది అని అపర్ణ అంటుంది. అదంతా విన్న ధాన్యలక్ష్మీ రగిలిపోతుంది. అక్కడికి వచ్చిన రుద్రాణి కావ్యను పొగుడుతున్నారు అని చెబుతుంది. నేను వ్రతంలో ఏం జరుగుతుందో తెలియకా వాళ్లు సంతోషంగా ఉన్నారు. చెల్లెలికి జరగబోయే అవమానం తెలియక కావ్య హడావిడి చేస్తుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది.

కల్యాణ్, అప్పులను శాశ్వతంగా ఎక్కడ ఉంచుతారో అని కంగారుగా ఉందని రుద్రాణి అంటుంది. ఆ అప్పు కోడలిగా పనికి రాదని నిరూపిస్తా. ఇవాళ నేను చేసేదే జరుగుతుంది. ముత్తైదువులను పిలిచావా. అప్పు రాకముందే వాళ్లు ఇక్కడ ఉండాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలోనే ముత్తయిదువులు వస్తుంటారు. వాళ్లను చూసి వీళ్లను ఎవరు పిలిచారు. కేవలం ఇంట్లోనే వ్రతం అనుకున్నాం కదా అని అపర్ణ అంటుంది. ధాన్యలక్ష్మీ పిలిచి ఉంటుంది. వాయినాలు ఇచ్చి పంపిస్తాం. కంగారు పడకు అని ఇందిరాదేవి అంటుంది.

రాజ్ వచ్చి ఇందిరాదేవిని పక్కకు తీసుకెళ్లి నిజంగా కల్యాణ్ వాళ్లు వస్తున్నారా అని అడుగుతాడు. మేము వెళ్లి పిలిచిన తర్వాత రాకుండా ఉంటారా. ఇప్పటికీ పదిసార్లు అడిగావ్ అని ఇందిరాదేవి అంటుంది. అవునా.. వాళ్లు రావాలి. ఆ కళావతి మొహం మాడిపోవాలి. వాళ్లు వెళ్తుంటే ఆపమని చెబితే ఆపలేదు. పిలవడానికి వెళ్దామంటే రాలేదు అని రాజ్ అంటాడు. నీ మొహం నీ పెళ్లాం ఏం చేసిందిరా. ఇంతేనా నువ్ కావ్యను అర్థం చేసుకుంది అని ఇందిరాదేవి అంటుంది.

పద్ధతిగా రాకుండా

ఇంతలో ఆటోలో కల్యాణ్, అప్పు వస్తారు. అది చూసి ఇంట్లో వాళ్లు సంతోషిస్తారు. రండి రండి అభిమానంతో వచ్చి అవమానంతో వెళ్తారు అని రుద్రాణి అనుకుంటుంది. గుమ్మం ముందే వాళ్లను ఇందిరాదేవి ఆపుతుంది. వాళ్లకు హారతి ఇవ్వమని ధాన్యలక్ష్మీకి చెబుతుంది ఇందిరాదేవి. నా కొడుకుకు హారతి ఇస్తాను. కానీ మీరు కోడలు అని చెప్పుకునే ఆవిడ చీర కట్టుకుని పద్ధతిగా రాకుండా ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చింది. ఏ కొసానా అయిన ఆడ లక్షణం కనిపిస్తుందా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

వ్రతం అని తెలుసు కదా. పబ్బుకో పార్టీకో వెళ్లినట్లు ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చావ్. హారతి ఇచ్చి బొట్టు పెడితే బొట్టు పెట్టుకుంటుందా అని రుద్రాణి అంటుంది. ఈమెనా నీ కోడలు. సాంప్రాదయం ప్రకారం చీర కట్టుకుని రాకుండా ఇలా వచ్చిందేంటి. ఇలాంటిది నీ కొడుకు ఎలా నచ్చింది ధాన్యలక్ష్మీ. నీ కోడలు ఎలా ఉంటుందా అని చూద్దామని వచ్చాం. ఇలా రావడం ఏంటీ. నీ కోడుకు ఎలా మెచ్చాడు అని ముత్తయిదువులు తలో మాట అంటారు.

ఏంటిది ఆదిలోనే హంసపాదం అన్నట్లు రాగానే ఇలా అవమానిస్తున్నారు అని రాజ్ అనుకుంటాడు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అమ్మా. వెళ్లి సాంప్రదాయబద్ధంగా వ్రతం చేసుకుని సంబురాలు చేసుకో. ఇలా జరుగుతుందనే నేను రాను అని చెప్పాను. ఇప్పుడు నీకు అర్థమైందా అన్నయ్య నేను ఇంటికి ఎందుకు రాను అన్నానో అని కల్యాణ్ అంటాడు. రేయ్ ఆగురా. గుమ్మం వరకు వచ్చి వెళ్తానంటావ్. ఇది నీ ఇల్లురా అని రాజ్ అంటాడు.

అగ్నికి ఆజ్యం తోడు

తాతయ్య వాళ్లు పిలిచారని వచ్చాం అంతే. మనస్ఫూర్తిగా రాలేదు. మా అమ్మ ఎప్పటికీ మారదు ఇంకోసారు మీ అందరికి రుజువు చేయాలనే వచ్చాను. నాకు రావాలని అయితే లేదు. మీరు మా పేద గదికి వచ్చి పిలిచినందుకు మీ పెద్దరికి నిలపాలని వచ్చాం తాతయ్య. కానీ మీ పెద్దరికి ముందు అహంకారం నిలబడి ఉంది. అమ్మకు తోడు అత్త చేరింది. అగ్నికి ఆజ్యం తోడు అయింది అని కల్యాణ్ అంటాడు. ఈ ఇంట్లో వాళ్లిద్దరే కాదు. మీ పెద్దమ్మ, నాన్న, పెద్దనాన్న, తాతయ్య వాళ్లు ఉన్నారు. మాకోసం ఇంట్లోకి రారా అని అపర్ణ అంటుంది.

అవునురా, ఆ అమ్మవారే నిన్ను రప్పిస్తుంది అనుకున్నానురా. అన్ని మర్చిపోయే నేను ఈ బాధను మర్చిపోలేనురా అని ప్రకాశం అంటాడు. నేను రానని చెప్పాను. కానీ నిన్ను ఇంటికి రావడం వద్దనలేదు. నువ్ ఎప్పుడైనా రావొచ్చు అని కల్యాణ్ అంటాడు. దీన్ని ఇంకా ఇంకా అవమానించి జీవితంలో ఇంటికి రాకుండా చేద్దామని అనుకుంటే నా కొడుకు వెళ్లిపోతా అంటున్నాడే అని ధాన్యలక్ష్మీ అనుకుంటుంది. పద అప్పు అని కల్యాణ్ వెళ్లిపోతుంటారు.

ఆగండి అని కావ్య ఆపుతుంది. కొత్త కోడలు గౌరీ దేవితో సమానం, నట్టింట్లోకి అడుగు పెడితే మహాలక్ష్మీతో సమానం అంటారు. గుమ్మం నుంచి బయటకు పంపించడం ఇంటికే అరిష్టం కవిగారు. కోపాలు, తాపాలు, పట్టింపులు, వీటికంటే బంధాలే ముఖ్యం అని కావ్య అంటుంది. కానీ, నీ చెల్లెలు పూజకు వచ్చినట్లు ఉందా అని రుద్రాణి అంటుంది. జబ్బ లేని జాకెట్ వేసుకుని అందరిముందు తిరిగే నువ్వు అంటున్నావా అత్త అని స్వప్న అంటుంది.

చాదస్తపు రేఖను దాటు

కట్టుబట్టలతో బయటకెళ్లిన జంట పట్టుబట్టలతో రావాలని ఎలా అనుకుంటున్నారు. దానికున్నవి ఏవో అవి వేసుకుని వచ్చింది. ఇంట్లో చీరలకు కొదవ. కొత్త కోడలికి అమ్మమ్మ గారు చీరలు కొన్నారు. అవి కట్టుకుంటుంది. కవిగారు అసలు ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అందులో మీ అమ్మ, అత్తయ్య లాంటి వాళ్లు ఉంటారు. అడుగు ముందుకే వేయండి. ఈ ముత్తయిదువుల్లోనే అలాంటి వాళ్లు ఉన్నారు. చాదస్తపు రేఖను దాటుతున్నానని ముందుకు రండి అని చెప్పిన కావ్య అక్క స్వప్నను పిలిచి వాళ్లకు హారతి తెమ్మని చెబుతుంది.

కల్యాణ్, అప్పులకు కావ్య హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది. రాజ్ చాలా సంతోషిస్తాడు. ధాన్యలక్ష్మీ రగిలిపోతుంది. తర్వాత తండ్రిని హగ్ చేసుకుంటాడు కల్యాణ్. అప్పు నీతో ఎప్పుడు మాట్లాడలేదు. అది ఎప్పుడు మనసులో పెట్టుకోకు. మీ అత్తను పట్టించుకోకు. నేను మీ పెద్దత్తను. నాకు మీకు అక్క ఎలాగే నువ్ అలాగే. ఇది నీ ఇల్లు అని అపర్ణ అంటుంది. నా తమ్ముడు వచ్చాడని తను క్రెడిట్ తీసుకుందామని రాజ్ అనుకుంటాడు. తాతయ్య వాళ్లు పిలిస్తే వచ్చారు. నేను రమ్మంటే లోపలికి వచ్చారు. ఉత్త పుణ్యానికే మీకు క్రెడిట్ కావాలా అని కావ్య అంటుంది.

అన్నయ్య నేను వదినా పిలిస్తేనే వచ్చాను అని కల్యాణ్ అంటాడు. మీ ఇద్దరు ఒక్కటేరా అని రాజ్ అంటాడు. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇక్కడిదాకా తీసుకొచ్చాం. ఇంట్లోనే ఉండేలా ఆ దేవి వరం ఇవ్వదా అని ఇందిరాదేవి సంతోషిస్తుంది. కొత్త బట్టలు కట్టుకోమ్మని కల్యాణ్, అప్పుని పైకి పంపిస్తారు. గుమ్మం ముందే అవమానిద్దాం అనుకున్నా. కావ్య చాలా తెలివిగా తీసుకొచ్చింది అని ధాన్యం అంటే.. ఇంట్లో అందరి సపోర్ట్ ఉండగా ఏం చేస్తావ్ అని రుద్రాణి అంటుంది.

నేను గుర్రాన్ని

అడుగడుగునా అవమానించి జీవితంలో ఇంట్లోకి రాకుండా చేస్తాను అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. నువ్ ఎంతకైనా తెగించావ్. జీవితంలో కల్యాణ్ అప్పులు రాకపోతే చాలు అని రుద్రాణి అనుకుంటుంది. చీర కట్టుకోవాల్సిందే అని అప్పుకు నచ్చజెబుతుంది స్వప్న. ఎలా ఉన్నావే అప్పు అని కావ్య అడుగుతుంది. ఇన్నిరోజులు పట్టిందా ఈ మాట అడగటానికి అని అప్పు అని హగ్ చేసుకుంటుంది. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటారు.

అంతేనా నన్ను పట్టించుకోవట్లేదు కానీ, కావ్య రాగానే కౌగిలింతలు ప్రేమలు. ఎంతైనా మీరిద్దరు ఒక్కటేనే. పెద్దదాన్ని అయినందుకు అన్ని పక్కన పెట్టి మళ్లీ కలిసే ఉండాలి కదా అని స్వప్న అంటుంది. నువ్ చాలా మారిపోయావ్ అక్క అని అప్పు అంటుంది. ఆరు నెలలు సావాసం చేస్తే గుర్రం గాడిద అయినట్లు కావ్యను ఇంటి కోడలిగా చూసి నేను కూడా మారిపోయా అని స్వప్న అంటుంది. అంటే నేను గాడిదనా అని కావ్య అంటే.. నేను గుర్రం అని చెబుతున్నా అని స్వప్న అంటుంది. తర్వాత బయటకు వచ్చిన కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

అడవి మనిషిలా

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ముత్తయిదువలకు అప్పు జ్యూస్ ఇస్తుంది. కావాలనే తనే తనపై మీద పోసుకుని కనీసం నీకు జ్యూస్ ఇవ్వడం కూడా తెలియదా అని అంటుంది. ఇంటికి వచ్చినవాళ్లను ఎలా చూసుకోవాలో నీకు తెలియదా. బొత్తిగా అడవి మనిషిలా ఉన్నావే అని ధాన్యలక్ష్మీ అంటుంది. మీ అమ్మ నిన్ను ఊరిమీదకు వదిలేస్తే ఇలాంటి బుద్ధులే వస్తాయి అని ముత్తయిదువు అంటుంది. నేనేం కావాలని చేయలేదు ఆంటీ అని అప్పు అంటుంది. చాల్లే ఆపు. ఇంటికి పూజకని పిలిస్తే ఇలాగేనా అవమానించేది అని ధాన్యలక్ష్మీ అంటుంది.