Brahmamudi July 16th Episode: బ్రహ్మముడి- తమ్ముడి కోసం వెళ్లిన రాజ్ అరెస్ట్- ఎస్సైని కొట్టడంతో క్రిమినల్ కేసు
Brahmamudi Serial July 16th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 16వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్‌ను అరెస్ట్ చేయడంతో రాజ్ కోపంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. అక్కడ ఎస్సైని లాగి పెట్టి కొడతాడు. దాంతో రాజ్‌ను కూడా ఎస్సై అరెస్ట్ చేస్తాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో అప్పును అరెస్ట్ చేస్తారు. లాకప్‌లో ఉంచుతారు. ఏంటమ్మా.. ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మగరాయుడిలా ఫీల్ అవుతున్నావా. అంత ఘోరంగా కొడతావా. అది తలకాయ అనుకున్నావా లేదా కొబ్బరికాయ అనుకున్నావా.. తలకాయ అమ్మా.. తల లేకుంటే మొండెం ఉన్న లేనట్లే అని ఎస్సై అంటాడు. మీరు కొంచెం ఆపుతారా. నేను చెబుతాను అని అప్పు అంటుంది.
వాళ్లు వెధవలే
వాళ్లు నన్ను ఎంత చీప్‌గా కామెంట్స్ చేశారో తెలుసా. ఈ వెధవలు ఏం వాగారో తెలుసా అని అప్పు అంటుంది. వాళ్లు వెధవేలే అమ్మా.. కానీ కొట్టే రైట్ నీకు లేదు. ఏదైనా ఉంటే మాకు కాల్ చేయాల్సింది కదా. అరగంటలో వచ్చేవాళ్లం. నువ్వున్న ప్లేసులో వాళ్లు ఉండేవాళ్లు కదా. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు అని ఎస్సై అంటాడు. ఇంతలో కల్యాణ్, బంటి వస్తారు. కల్యాణ్‌ను చూసి అప్పు షాక్ అవుతుంది. రేయ్ బంటి వీడికెందుకు చెప్పావురా అని అప్పు అంటుంది.
బెంచ్‌పై కూర్చున్న ముగ్గురుని ఇదిగో అన్న వీళ్లే.. అప్పును కామెంట్ చేసింది అని బంటి చెబుతాడు. దాంతో కానిస్టేబుల్ దగ్గర ఉన్న కర్ర తీసుకుని.. వాళ్లను చితకబాదుతాడు. నా అప్పునే కామెంట్ చేస్తారా అని వాళ్లను కొడుతుంటాడు కల్యాణ్. ఇంతలో కానిస్టేబుల్.. ఎస్సై కల్యాణ్‌ను ఆపుతారు. ఏయ్ స్టాప్ ఇట్.. నీకు ఎంత ధైర్యం చెట్టంతా ఎస్సై ముందే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్లను కుక్కలను కొట్టినట్లు కొడతావా. అప్పు కుక్కనట్లు కొట్టి నువ్ కొట్టి నువ్ కొడతావా.. వీడిని లోపల వేయండిరా అని ఎస్సై అంటాడు.
మర్డర్ చేస్తావేమో
ఆగండి.. వాళ్ల అంత చూస్తాను అంటూ కల్యాణ్ అరుస్తాడు. కల్యాణ్‌ను కూడా అరెస్ట్ చేస్తారు. అబ్బా.. ఇప్పుడు ఈ దుగ్గిరాల ఫ్యామిలీ నన్ను దుమ్మెత్తిపోస్తారు అని అప్పు అనుకుంటుంది. ఇలా జరిగిందేంటీ.. వీళ్లను ఎవరు విడిపిస్తారు అని బంటి అనుకుంటాడు. వాళ్ల సంగతి చూస్తాను అని అంటున్న కల్యాణ్‌తో ఏంటయ్యా ఆ ఆవేశం. నా ముందే ఇలా కొడుతున్నావంటే.. బయట అయితే మర్డర్ చేస్తావా అని ఎస్సై అంటాడు. నేను ఎవరో తెలుసా అని కల్యాణ్ అంటాడు.
నీకు తెలియదా.. ఆవేశంలో మర్చిపోయావా. నీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వు. నిన్ను ఇలా పెంచినందుకు కడిగేస్తాను అని ఎస్సై అంటాడు. దాంతో రాజ్ నెంబర్ ఇస్తాడు కల్యాణ్. మరోవైపు కావ్య కాఫీ తీసుకొస్తే ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావ్. రెస్ట్ తీసుకొవచ్చు కదా అని రాజ్ అంటాడు. పెళ్లయి సంవత్సరం గడిచింది. పీరియడ్స్‌లో ఉన్ననాని, రెస్ట్ తీసుకోమ్మని ఇప్పుడే గుర్తుకు వచ్చిందా. చుట్టపు చూపులా కేరింగ్ చేయకండి అని కావ్య సెటైర్ వేస్తుంది.
కొడుకును ఇలాగేనా పెంచేది
ఇదే నీతో ప్రాబ్లమ్.. ఏం మాట్లాడిన ఏదో ఒకటి తప్పు పడుతుంటావ్ అని రాజ్ అంటాడు. ఇంతలో రాజ్‌కు కాల్ చేస్తాడు ఎస్సై. నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్సైని మాట్లాడుతున్నాను అని ఎస్సై అంటే.. ఏమైందని రాజ్ అంటాడు. ఏమయ్యా పెద్ద మనిషి.. కొడుకును ఇలాగేనా పెంచేది అని ఎస్సై అంటే.. మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదని రాజ్ అంటాడు. అర్థమైతే కొడుకును ఇలా ఎందుకు పెంచుతావ్ అని అప్పు, కల్యాణ్ పేర్లు చెప్పకుండా జరిగింది చెబుతాడు ఎస్సై.
పోలీస్ స్టేషన్‌కు వచ్చి మా కానిస్టేబుల్స్‌నే కొడతాడా అని ఎస్సై అంటాడు. మీరు చెప్పేది అంతా బాగానే ఉంది. కానీ, నాకు కొడుకు ఉండుంటే ఇంకా బాగుండేది అని రాజ్ అంటాడు. ఏమయ్యా కొడుకు అరెస్ట్ అయ్యాడని చెప్పేసరికి నాకు కొడుకే పుట్టలేదంటావా. హీరో అనుకుంటున్నావా నీ కొడుకు. నువ్ హీరో తండ్రి అనుకుంటున్నావా అని ఎస్సై అంటాడు. హే షటప్.. నాకు కొడుకే లేడంటుండే అని రాజ్ అంటే.. కొడుకా.. మళ్లీ ఈ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడని కావ్య అంటుంది.
మాట మారుస్తున్నారా
నోరు మూసుకో అని కావ్యను రాజ్ అంటే.. నన్నే నోరు మూసుకోమంటావా. తండ్రీకొడుకులకు ఇద్దరికీ పోలీసులంటే గౌరవం లేదు అని ఎస్సై అంటాడు. అయ్యా పోలీస్ గారు.. మీరు చెబుతుంది ఏంటో నిజంగా నాకు అర్థం కావడం లేదు. ఎక్కడో తప్పు చేశారు. కరెక్ట్ నెంబర్‌కే కాల్ చేశారా అని రాజ్ అంటాడు. నేనున్నానని మీరు మాట మారుస్తున్నారు. ఫోన్ స్పీకర్‌లో ఉంచమని కావ్య గొడవ చేస్తుంది. మర్యాదగా పోలీస్ స్టేషన్‌కు రండి. డ్యూటిలో ఉన్న కానిస్టేబుల్‌ను కొట్టాడు. కచ్చితంగా జైలు శిక్ష పడుతుందని ఎస్సై అంటాడు.
నా కొడుకు గానీ కొడుకు పేరు ఏంటో చెబుతారా అని రాజ్ అంటే.. ఇన్నేళ్లైనా నీ కొడుకుకు పేరు పెట్టలేదా. నన్ను అడుగుతావా. నీకు అసలు బుద్ధుందా అని ఎస్సై అంటాడు. తనను కవిగారు అంటారు. పేరు కల్యాణ్ అని బంటి చెబుతాడు. తన పేరు కల్యాణ్ అట అని ఎస్సై రాజ్‌కు చెబుతాడు. కల్యాణ్‌ను అరెస్ట్ చేశారా.. మీకెంత ధైర్యం. వాడు ఏం తప్పు చేశాడని రాజ్ అడుగుతాడు. ఇందాకే కదా చెప్పాను. మళ్లీ మళ్లీ చెప్పను. స్టేషన్‌కు రండని కాల్ కట్ చేస్తాడు ఎస్సై.
దబాయించి మాట్లాడాలి
దాంతో వెళ్లేందుకు రాజ్ రెడీ అవుతుంటే.. కల్యాణ్‌ను అరెస్ట్ చేయడమేంటీ.. సరే మరి కొడుకు సంగతి ఏంటని కావ్య అంటుంది. పళ్లు రాలతాయి.. కల్యాణ్‌ను నా కొడుకు అని పొరపాటు పడుతున్నాడు అని ఎస్సై అంటాడు. నేను కూడా వస్తాను అని కావ్య అంటే.. వచ్చి ఏం చేస్తావ్. నీకు పలుకుబడి ఉందా. అసలు మీ ఆడవాళ్లు ఏమనుకుంటున్నారు. ఇలాంటప్పడు దబాయించి మాట్లాడాలి. నేను ఎలాంటిదైనా డీల్ చేస్తాను. వెళ్లి కల్యాణ్‌ను విడిపించుకుని తీసుకొస్తాను అని రాజ్ ఫాస్ట్‌గా వెళ్తాడు.
కింద ప్రకాశం ఎదురై ఇంతా వేగంగా ఎక్కడికి అంటాడు. ఏం లేదని వెళ్లిపోతాడు రాజ్. ఏంటమ్మా వాడు అలా వెళ్తున్నాడని అడుగుతాడు. తమ్ముడు అరెస్ట్ అయ్యేసరికి ఇలా వెళ్తున్నారు అని కావ్య అంటుంది. ఏంటమ్మా తమ్ముడు ఏంటీ. అంటే కల్యాణ్ అరెస్ట్ అయ్యాడా అని ప్రకాశం షాక్ అవుతాడు. కాదు తమ్ముడి లాంటి వాడు. బయటి వాళ్లు అని కవర్ చేస్తుంది కావ్య. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాజ్ నా తమ్ముడిని అరెస్ట్ చేస్తావా. నీకు ఎంత ధైర్యం అని రాజ్ అంటాడు.
అరెస్ట్ అయిన రాజ్
నీ తమ్ముడు ఏమైనా దిగి వచ్చాడా. అరెస్ట్ కాదు నాలుగు తగిలించాను అని ఎస్సై అంటాడు. నా తమ్ముడుని కొట్టావా.. అని ఎస్సైని లాగి పెట్టి కొడతాడు రాజ్. దాంతో ఎస్సై డ్యూటీలో ఉన్న ఎస్సైని కొట్టడం ఎంత క్రిమినల్ కేసో తెలుసా అని ఎస్సై అంటాడు. కేసు గురించి నాకెందుకు. నువ్ నా తమ్ముడిని కొట్టావ్. నేను నిన్ను వదిలిపెట్టను అని రాజ్ అంటాడు. ఏంటీ మీరు అందరికీ అందరూ కొట్టి చంపడానికి వచ్చారా. ఆడ మగ తేడా లేకుండా కొడుతున్నారు. యూ ఆర్ అండర్ అరెస్ట్ అని ఎస్సై అంటాడు.
దాంతో అంతా షాక్ అవుతారు. రాజ్‌ను కూడా అరెస్ట్ చేసి కల్యాణ్ పక్కనే లాకప్‌లో పెడతాడు ఎస్సై. నన్నే సెల్‌లో పెడతావా. నీ సంగతి చూస్తాను అని సెల్‌ఫోన్ చూస్తాడు. ఆ మొబైల్ లాక్కోవయ్యా.. నీలాంటి వాళ్లు బలిసినట్లు చేస్తే ఊరుకుంటామా అని ఎస్సై అంటాడు. సర్ కొట్టింది నేను కదా. నన్ను ఉంచి.. మా వాళ్లను వదిలిపెట్టమని అప్పు అడుగుతుంది. మీ వాళ్లు నన్ను కొట్టారు. నేను వదిలిపెట్టను. మీ ముగ్గురికి శిక్ష పడేవరకు ఊరుకోను అని ఎస్సై అంటాడు.
కోర్టుకు వెళ్లాల్సిందే
తర్వాత మా అక్కకు కాల్ చేయమని బంటితో మెల్లిగా చెబుతుంది అప్పు. దాంతో జరిగింది కావ్యకు చెబుతాడు బంటి. నువ్ వచ్చి ఇక్కడ ఎవరినీ కొట్టకు. నిన్ను కూడా లోపల వేస్తారు అని బంటి అంటాడు. నాకు కమిషనర్ తెలుసు. నేనే ఆయనతో మాట్లాడుతాను. ఫోన్ ఇవ్వమని రాజ్ అంటాడు. నీలాంటి వాళ్లను చాలా చూశాను. అరెస్ట్ కాగానే వాళ్లు వీళ్లు తెలుసని అంటారు. మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లేవరకు ఏ శక్తి ఆపలేదని ఎస్సై అంటాడు.
ఇంతలో కావ్య వస్తుంది. ఇప్పటికే ముగ్గురుని లోపల వేశారు. నువ్ గొడవ చేస్తే నిన్ను కూడా లోపల వేస్తారు. అప్పుడు నేను ఎవరికీ కాల్ చేయాలో చెప్పు అని బంటి అంటాడు. ఆ అవసరం రాదులే అని కావ్య లోపలికి వెళ్తుంది. వాళ్లు తనవాళ్లే అని కావ్య చెబుతుంది. దాంతో నువ్ ఎవరినీ కొడతావ్. వాళ్లు ఒకొక్కరిని కొట్టారు. వాళ్లపై క్రిమినల్ కేసు పెట్టబోతున్నాను అని ఎస్సై అంటాడు. మాది చాలా పేరున్న ఫ్యామిలీ. అయినా నేను ఎలాంటి ఇన్‌ఫ్ల్యూయెన్స్ ఉపయోగించట్లేదు. మీరు మా చెల్లిని అనవసరంగా అరెస్ట్ చేశారు అని కావ్య అంటుంది.
దీనంతటికి కారణం మీరే
నేను అన్ని తెలిసే అరెస్ట్ చేశానని ఎస్సై అంటాడు. మీరు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా. మీరు మా వాళ్ల దగ్గర లక్ష రూపాయలు లంచం తీసుకున్నారు. లంచం తీసుకుని కూడా మా వాళ్లను అరెస్ట్ చేశారు అని కావ్య అంటుంది. నేను నా సర్వీసులు ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదని ఎస్సై అంటాడు. తీసుకున్నట్లు కావ్య వాదిస్తుంది. ఇద్దరూ వాదించుకుంటారు. దాంతో ఎస్సై కోప్పడతాడు. చూశారా మీరు చేయని తప్పు చేశారంటే ఎంతటి ఆవేశం తన్నుకువచ్చిందో.. అలాగే ఆ ముగ్గురు మా చెల్లిని చేయని తప్పుకు అంటే అంతలా కొట్టి ఉంటుందో తెలుసా అని కావ్య అంటుంది.
వాళ్లను వదిలేసి అప్పును అరెస్ట్ చేస్తే.. వాళ్లపై కోపం వచ్చి మా మరిది గారు కొట్టారు. మా మరిది గారంటే మా ఆయనకు ప్రాణం. తప్పు చేసిన వాళ్లను వదిలేసి మా మరిదిని లోలప వేశారను మా ఆయనకు కోపం వచ్చింది. ఇప్పుడు ఆయనను లోపల వేశారు. దీనంతటికి కారణం ఎవరు.. మీరే అని కావ్య అంటుంది. మీరు ముందుగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఆడపిల్లను అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురి దగ్గర లంచం తీసుకుని ఆడపిల్లను అరెస్ట్ చేశారని, స్త్రీ హక్కుల సంఘం దగ్గర ఫిర్యాదు చేసే వస్తున్నాను అని కావ్య అంటుంది.
కావ్య కాళ్లపై పడి
చూడండి.. ఈ ముగ్గురు ఎంత వెధవలో ఇప్పుడే నిరూపిస్తాను అని కావ్య అంటుంది. ఏంట్రా ఇది.. మీరు మా బస్తీలో ఉంటారు కదా. అప్పు ఎలాంటిదో మీకు తెలియదా.. మీరు ఏమన్నారో చెప్పండని వాళ్లను అడుగుతుంది కావ్య. అప్పునే వచ్చి కొట్టింది మేం ఏం అనలేదని వాళ్లు అంటారు. అవునా.. రేయ్ బంటి జరిగింది అంతా రికార్డ్ చేశావ్ కదా. అది చూపించు అని కావ్య అంటుంది. వామ్మో అక్కేంటీ ఇలా ఇరికించింది. నేను ఎలాంటి రికార్డ్ చేయలేదు కదా అని బంటి కంగారుపడతాడు.
కావ్య కన్ను కొట్టి కావాలనే చెప్పు అని సైగ చేస్తుంది. హా చేశాను. ఫుల్ హెచ్‌డీలో తీశాను అని బంటి అంటాడు. ఆ వీడియో గనుక ఎస్సై గారు చూస్తే మిమ్మల్ని పిచ్చకొట్టుడు కొడతారు అని కావ్య అంటుంది. దాంతో ఆ ముగ్గురు కావ్య కాళ్లపై పడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కావ్యకు రాజ్ గోరింటాకు పెడతాడు. రాజ్‌ను ప్రేమగా చూస్తుంది కావ్య.