Brahmamudi August 31st Episode: బ్రహ్మముడి- కిడ్నాపర్‌గా కనపడిన కల్యాణ్- జైలుకు రాజ్- పోలీసులు అరెస్ట్- ఏడ్చేసిన కావ్య-brahmamudi serial august 31st episode kavya motivates kalyan police arrest raj going to jail brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 31st Episode: బ్రహ్మముడి- కిడ్నాపర్‌గా కనపడిన కల్యాణ్- జైలుకు రాజ్- పోలీసులు అరెస్ట్- ఏడ్చేసిన కావ్య

Brahmamudi August 31st Episode: బ్రహ్మముడి- కిడ్నాపర్‌గా కనపడిన కల్యాణ్- జైలుకు రాజ్- పోలీసులు అరెస్ట్- ఏడ్చేసిన కావ్య

Sanjiv Kumar HT Telugu
Aug 31, 2024 09:12 AM IST

Brahmamudi Serial August 31st Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 31వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ దొంగబంగారం కొంటాడు. దాంతో రాజ్ జైలుకు వెళ్తాడని రాహుల్ అంటాడు. మరోవైపు కల్యాణ్ ఆటో ఎక్కిన స్వప్న అతను కిడ్నాపర్‌లా ఉన్నాడంటుంది. తనే ఎదుటే కల్యాణ్‌పై కోపడుతుంది. రాజ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తారు.

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 31వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 31వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాహుల్‌ను తప్పుబట్టినట్లు కావ్యపై ఫైర్ అవుతాడు రాజ్. నీకోసం నా కుటుంబ సభ్యులను వదులుకోలేను అని రాజ్ అంటాడు. అంటే, నన్నైనా వదులుకుంటారా. నన్ను వేరుగా, మీ కుటుంబాన్ని వేరుగా ఎలా చూస్తారండి. నేను కూడా ఈ కుటుంబంలో సభ్యురాలినే అని కావ్య అంటుంది.

ఇంటి సభ్యురాలివే అయితే కొన్ని చూసి చూడనట్లు వదిలేయాలి. అలా చేయలేకపోతే సాక్ష్యంతో సహా నా దగ్గరికి వచ్చి చెప్పాలి అని రాజ్ అంటాడు. ఇప్పుడు నేను చేసింది అదే. సాక్ష్యాన్ని తారుమారు చేశారు. మమ్మల్ని ఫూల్స్‌ను చేశారు. నన్నెందుకు మీరు నమ్మట్లేదు. వాళ్లు ఎలాంటి వాళ్లో మీకు అర్థం కావట్లేదు అని కావ్య అంటుంది. నువ్ రాకముందు కూడా వాళ్లు ఉన్నారు. ఏం జరిగింది అని రాజ్ అడుగుతాడు.

ఆరోగ్యానికి ప్రమాదం

ఏం జరిగిందో మర్చిపోయారా. మీరు చేసుకోవాల్సిన స్వప్న అక్కను రాహుల్ లేపుకెళ్లిపోయాడు. అసలు నా మొహాన్నే జీవితంలో చూడొద్దనుకున్నా నాకు ముసుగు వేసి మీతో పెళ్లి జరిపించారు. వీళ్ల కుట్రల వల్ల కవిగారి కాపురం ముక్కలైపోయింది అని కావ్య అంటుంది. అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి వేరు. అందరి విసిగిపోయారు. అనారోగ్యాలతో ఉన్నారు. ఇంట్లో ఏం జరిగినా తాతయ్య ఆరోగ్యానికి ప్రమాదం. అన్నింటిని సరిద్దిదుకునే మా అమ్మ ఈ చీలికను భరించలేదు అని రాజ్ అంటాడు.

నానమ్మ పెద్దరికం మంటగలిసిపోతుంది. నాన్న, బాబాయ్ నిస్సాహాయంగా మిగిలిపోతారు. వాటన్నింటికి కారణం నువ్వే అవుతావ్ అని రాజ్ అంటాడు. ఇదేం ఆరోపణ అండి. ఇవి జరగడానికి తప్పులు చేసేవారు కారణమవుతారు. నన్నని ఎలా అంటున్నారు. మీకు రాహుల్ క్యారెక్టర్, మీ అత్త క్యారెక్టర్ ఏంటో తెలియదా. రాహుల్ ఎప్పుడెప్పుడు ఈ ఇంటిని దోచుకుతిందామా అని చూస్తాడు. మీ అత్త ఇంట్లోవాళ్లను విడగొడదామని చూస్తారు. వాళ్లకోసం నన్ను అంటున్నారు అని కావ్య అంటుంది.

ఆల్ రైట్. అదంతా వదిలిసేయ్. ఇంకోసారి ఇలాంటి రిపీట్ కావొద్దు అని రాజ్ అంటే.. అది వెళ్లి వాళ్లకు చెప్పండి అని కావ్య అంటుంది. వాళ్ల సంగతి వదిలేయ్. నేను నీకు చెబుతాను. ఇంట్లోవాళ్లు ఒకటిగా కలిసి ఉండాలని తాతయ్య ఆశయం. ఎన్ని పొరపాట్లు జరిగినా ఆయ విడిపోకూడదని అనుకుంటారు. ఇప్పటికే కల్యాణ్ వెళ్లిపోయాడు. ఇక ఎవరైనా వెళ్లిపోతే తాతయ్య తట్టుకోలేరు. తాతయ్య బాధపడే విధంగా ఏం జరిగినా నేను నిన్ను క్షమించను. గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు రాజ్.

నేను తొందరపడ్డాను

దాంతో కావ్య కన్నీళ్లు పెట్టుకుంది. బెడ్ రూమ్‌కు వెళ్లి ఆలోచిస్తుంది. అక్కడికి స్వప్న వచ్చి సారీ చెబుతుంది. నా వల్ల మాటలు పడ్డావ్. రాజ్ ఏమైనా అన్నాడా అని స్వప్న అంటుంది. అనకుండా ఎలా ఉంటారు. ఎవరు తప్పు చేసిన ఏం చేయరు కానీ, భార్య తప్పు చేస్తే మాత్రం పొదల చాటున పెద్దపులిలా విరుచుకుపడతారు. ఛ.. రాహుల్ గురించి తెలిసి నేను తొందరపడ్డాను. కొంచెం ఆలోచించాల్సింది అని కావ్య అంటుంది. రాహుల్, రుద్రాణి ఇద్దరూ కలిసి నన్ను ఇరికించారు అని కావ్య అంటుంది.

కావాలనే నన్ను ఇంట్లోవాళ్ల ముందు తప్పు చేసినదానివల్ల క్రియేట్ చేయాలనుకున్నారు అని కావ్య అంటుంది. మరి రాహుల్ తప్పు చేయట్లేదా. ముందు ముందు చేస్తే అని స్వప్న అంటుంది. అది తెలియదు. అప్పుడు చూద్దాం. ముందు నువ్ హాస్పిటల్‌కు చెకప్‌కు వెళ్లాలి కదా పదా అని కావ్య అంటుంది. స్వప్న వెళ్లిపోతుంది. తర్వాత రాజ్ సెక్రటరికీ శ్రుతికి కాల్ చేస్తుంది కావ్య. ఆదివారం కూడా సెలవు ఇవ్వకుండా ఎప్పుడు నాకు ట్రై చేస్తున్నాడు అని రాహుల్ గురించి చెబుతుంది శ్రుతి.

నువ్ నాకు ఒక సహాయం చేయాలి. రాహుల్ మీద ఒక కన్ను వేసి ఉంచు అని ఏదో చెబుతుంది కావ్య. అలాగే మేడమ్ అని శ్రుతి అంటుంది. స్వప్న వచ్చి వెళ్దామా అని అంటుంది. ఇద్దరూ హాస్పిటల్‌కు వెళ్తారు. మరోవైపు కంగ్రాట్స్ రాహుల్. మొత్తానికి అనుకున్న పనిని ఇద్దరం చేస్తున్నాం అని రాహుల్‌తో ఒకతను అంటాడు. ఇంతలో వచ్చిన శ్రుతి మీరు చెప్పిన అగ్రిమెంట్స్ రెడీ చేశాను చెబుతుంది. రాహుల్ వెళ్లమంటాడు. కావ్య చెప్పింది గుర్తు చేసుకుని శ్రుతి అలాగే ఉంటుంది.

ఇన్వెస్ట్ చేస్తున్నట్లు

వెళ్లమన్నా కదా. ఏంటీ నన్ను విడిచి వెళ్లాలని లేదా అని రాహుల్ అంటే.. భయంతో వెళ్లిపోతుంది శ్రుతి. కొంటుంది దుబాయ్ నుంచి వస్తున్న దొంగ బంగారం. దానికి అగ్రిమెంట్ ఏంటీ అని అతను అంటే.. కంపెనీ నుంచి క్యాష్ డ్రా చేస్తే డౌట్ వస్తుంది. అందుకే నా బినామీగా నీ పేరు మీద ఒక ఫేక్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. అందులోకి ఈ కంపెనీ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చూపిస్తాను. వచ్చిందాంట్లో 60 శాతం నాకు.. 40 శాతం నీకు అని రాహుల్ అంటాడు.

మరి దొంగ బంగారంకు లెక్కలు ఎలా చూపిస్తావ్. రేపు ఆడిట్‌లో ఎక్స్‌ట్రా బంగారం ఉన్నట్లు తేలితే మన పేర్లు బయటకొస్తాయి కదా అని అతను అంటాడు. మన పేర్లు కాదు రాజ్ పేరు బయటకొస్తుంది. ఎందుకంటే నేను ఈ కంపెనీకి టెంపరరీ ఎండీని. నిజమైన వారసుడు, పర్మనెంట్ ఛైర్మన్ రాజ్ కదా. రేపు ఎప్పుడైన నిజం బయటపడితే ఫేస్ చేయాల్సింది వాడే. జైలుకు వెళ్లాల్సింది కూడా వాడే. ఈ కంపెనీ ఎన్నిరోజులు నా చేతుల్లో ఉంటుందో తెలియదు. అందుకే ఉన్నన్ని రోజులు కోట్లు సంపాదించాలి అని రాహుల్ అంటాడు.

లాభాలు మనకు అని అతను అగ్రిమెంట్‌పై సైన్ చేస్తాడు. మరోవైపు కారులో వస్తుంటారు కావ్య, స్వప్న. నీకు బీపీ ఎక్కువ ఉంటుందని, పుట్టబోయే బిడ్డ ప్రసవానికి కూడా కష్టంగా ఉంటుందని డాక్టర్ చెప్పేసరికి నాకు బాధగా ఉంది. నువ్ నీ అత్త, భర్తపై కోపంతో ఉండకు అని కావ్య అంటుంది. ఏం చేయమంటావే వాళ్లు చేసే పనులు చేస్తున్నారు. ఈ మాత్రం నోరు తెరవకపోతే అనామికలాగా అనామకులుగా మిగిలిపోతాం. నేను అత్తకు మొగుడు ముగుడికి యముడు టైపు అని స్వప్న అంటుంది.

మంచి చేతితో బోణి

నీ భాష సరిగా లేదని కావ్య అంటే.. మా అత్త బ్రెయిన్ డంపీ యార్డ్‌లా ఉంటుంది. దానికి ఆ భాషే కరెక్ట్ అని స్వప్న అంటుంది. ఇంతలో కారు ఆగిపోతుంది. డ్రైవర్ దిగి కారు చెక్ చేస్తాడు. సమస్య అర్థం కావట్లేదు. మెకానిక్‌ను పిలవాల్సిందే. మీరు క్యాబ్‌ బుక్ చేసుకుని వెళ్తారా అని డ్రైవర్ అంటే.. ఆటోకు వెళ్దామని స్వప్న అంటుంది. జీవితంలో సంపాదించడంకొసం మొదటిసారి ఓ ప్రయత్నం మొదలుపెట్టాను. మొదటి బేరం మంచి చేతితో బోణి తగిలేలా చేయమని దేవుడుని కోరుకుంటాడు కల్యాణ్.

ఆ ఆటో వెనుక రాసి ఉన్నది చదువుతారు కావ్య, స్వప్న. రేపటి కోసం అని రాసి ఉంటుంది. ఇవాళ సంపాదించేది రేపటికోసమే కదా అని కావ్య అంటుంది. వీడెవడో మన కవిలాగే ఉన్నాడే పదా అని స్వప్న అంటుంది. ఆటో అద్దంలో కావ్య, స్వప్న రావడం చూసి కంగారుపడతాడు కల్యాణ్. మొహానికి కర్చీఫ్ కట్టుకుని, క్యాప్ పెట్టుకుంటాడు. రేపటి కోసం మాకు ఇవాళ్టి కోసం ఆటో కావాలి వస్తావా అని స్వప్న అడుగుతుంది. ఎక్కండని కల్యాణ్ అంటే ఇద్దరూ ఎక్కుతారు.

నాకు బాగా మంటగా ఉంది. దానికి కారణం కల్యాణ్. పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. ఇంటికి వస్తే కంపెనీ అప్పజెప్పుతారని వెళ్లిపోయాడు. ఇప్పుడు నా మొగుడుకి అప్పజెప్పారు. ఆ దరిద్రుడు ఫ్రాడ్ చేస్తున్నాడు. నన్ను కూడా ఫూల్‌ని చేశాడు అని స్వప్న అంటుంది. అది కవిగారి డెసిసిషీయన్. ఆయన ఎందుకు రావట్లేదే తెలుసు కదా అని కావ్య అంటుంది. నా అత్త, నీ చిన్నత్త అనే మాటలకు వెళ్లాడు అని స్వప్న అంటుంది. కవిగారిని ఎవరు ఏం అనరు. అప్పును అనే మాటలు వినలేక వెళ్లిపోయాడు అని కావ్య అంటుంది.

కవి పిరికివాడే

కల్యాణ్ వెళ్లిపోవడంతో అసమర్థులు అందలం ఎక్కారు అని స్వప్న అంటుంది. ఆటో స్పీడ్ బ్రేకర్‌కు జెర్క్ అవుతుంది. ఏ రేపటి కోసం ఒళ్లు దగ్గరపెట్టుకుని నడుపు. నేను అసలు కడుపుతో ఉన్నాను అని స్వప్న అంటుంది. వదిలేయవే. ఇక బాగానే నడుపుతాడు అని కావ్య అంటే.. బాగా నడిపేవాడిలా లేడు. మొహానికి కర్చీఫ్ కట్టుకుని కిడ్నాపర్‌లా ఉన్నాడు అని స్వప్న అంటుంది. తర్వాత మీ కవి పిరికివాడే. మాటలు అంటే తిరిగి అనలేడా. ఇక్కడ ఉంటే బయట కష్టాలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని స్వప్న అంటుంది.

నిజం చెప్పవే. వాళ్ల అమ్మ కంటే నీకే ఎక్కువ విలువ ఇచ్చేవాడు కదా. నువ్వెందుకు ఆపలేదు అని స్వప్న అడుగుతుంది. ఎవరో విలువ ఇవ్వడం వేరు. విలువ ఇచ్చేలా బతకడం వేరు. బతికి చూపిస్తానని ఛాలెంజ్ చేసి వెళ్లినవాడు నేను పిలిస్తే వస్తాడా. మా ఆయన పిలిస్తే వస్తాడా అని కావ్య అంటుంది. అవును పాపం ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో అని స్వప్న అంటుంది. ఇంతలో ఇంటి ముందు ఆటో ఆపుతాడు కల్యాణ్. నా మొదటి సంపాదన నీ చేతుల మీదుగా రావాలని ఆ దేవుడే నిర్ణయించాడు వదినా అని కల్యాణ్ అనుకుటంాడు.

ఇంతలో కావ్య డబ్బులిస్తుంటే కర్చీఫ్ కింద పడేస్తూ కావ్య కాళ్లకు నమస్కరిస్తాడు. సేమ్ సూర్యవంశంలో మీన చేసినట్లుగా కల్యాణ్ చేస్తాడు. ఎంత అని మేము అడగలేదు. నువ్ చెప్పలేదు. ఇక్కడికి అని కూడా చెప్పలేదు. నన్ను నేనే ఉలితో చెక్కుకుంటా అని కవిత్వం చెబుతుంది కావ్య. దాంతో కల్యాణ్ కర్చీఫ్ తీసేస్తాడు. ఇది మీ కవితే కవిగారు. మీకు మీరు అన్వయించుకోవాలి. ఇలా ప్రయత్నం మొదలుపెట్టారు. రేపటి కోసం. బతకడం ఒక్కటే ముఖ్యం కాదు. నచ్చినట్లు బతకడం కూడా ముఖ్యం అని కావ్య అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

రాజ్ అరెస్ట్

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి పోలీసులు వస్తారు. మా వాళ్లు ఓ ట్రాలీ ఆటో పట్టుకున్నారు. దాంట్లో దొంగ బంగారం సప్లై అవుతుంది. అది స్వరాజ్ గ్రూప్‌ కంపెనీకే సప్లై అవుతుందని తేలింది. దీనికి పూర్తి బాధ్యత కంపెనీ ఛైర్మన్ స్వరాజ్‌దే కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్సై అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అదంతా కావ్య వింటుంది.