Brahmamudi August 21st Episode: బ్రహ్మముడి- తండ్రి కాబోతున్న కల్యాణ్, లాటరీలో 5 లక్షలు- తమ్ముడికి దొరికిపోయిన రాజ్-brahmamudi serial august 21st episode indradevi raj make an attempt kalyan gets 5 lakh lottery brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 21st Episode: బ్రహ్మముడి- తండ్రి కాబోతున్న కల్యాణ్, లాటరీలో 5 లక్షలు- తమ్ముడికి దొరికిపోయిన రాజ్

Brahmamudi August 21st Episode: బ్రహ్మముడి- తండ్రి కాబోతున్న కల్యాణ్, లాటరీలో 5 లక్షలు- తమ్ముడికి దొరికిపోయిన రాజ్

Sanjiv Kumar HT Telugu
Published Aug 21, 2024 07:18 AM IST

Brahmamudi Serial August 21st Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 21వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్ తండ్రి కాబోతున్నట్లు కంగ్రాట్స్ అంటూ ఓ వ్యక్తి వస్తాడు. అలాగే కల్యాణ్‌కు లాటరీలో ఐదు లక్షలు వచ్చినట్లు అతను చెబుతాడు. కల్యాణ్‌ను ఇంటికి తీసుకొచ్చేందుకు ఇందిరాదేవి ప్లాన్ చేస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 21వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 21వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో నాకు డబ్బు పిచ్చి పట్టిందా, ఆస్తులు కావాలని అనుకుంటున్నానా అని రాజ్‌తో కావ్య గొడవ పడుతుంది. ఉదయం 5 గంటలకు లేచినప్పటి నుంచి ఇంటి ముందు ముగ్గులు, వివిధ రకాలైన టిఫిన్స్, వాటి వేరే వేరే చట్నీ, మధ్యాహ్నాం ఒక్కొక్కరికి కావాల్సిన వంట అని తను చేసే పనుల లిస్ట్ చెబుతుంది కావ్య.

నీకు ఇగోనే

ఇక ఆపవే అని రాజ్ అంటాడు. చెప్పింది వినడానికే మీకు ఇలా ఉంటే రోజూ చేస్తున్న నాకు ఎలా ఉంటుంది. ఇంట్లో కోడలు ఉంటే ఇటున్న కప్పు అటు పెట్టరు. అది కూడా నేనే కడుక్కోవాలి. పదండి ఇప్పుడు ఈ విషయాలన్ని మీ వాళ్ల ముందు కడిగేస్తాను. అత్తయ్యగారు నాకు ఫుల్ పవర్ ఇచ్చారు. నన్ను అంటే దులిపేయమన్నారు లెట్స్ గో అని కావ్య అంటుంది. గో కాదే నీకు ఇగో ఎక్కువ. సరే నువ్ చెప్పినదానికి ఒప్పుకుంటున్నాను అని కావ్య పనులను, గొప్పతనాన్ని గుర్తించినట్లు పొగుడుతాడు రాజ్.

ఇప్పుడు చల్లారిందా నీ కోపం అని రాజ్ అంటే.. తగ్గింది. కానీ, ఒక్కటి ఉంది. కవిగారు రావడం నాకు ఇష్టం లేదా అని కావ్య అడుగుతుంది. అవును, అందులో డౌటే లేదు. అందుకే వాడు వెళ్లేటప్పుడు నువ్ ఆపలేదు. అయినా పర్వాలేదు. నేను వాడిని తీసుకొస్తాను. ఇప్పుడు ఈ ఆయాసం తగ్గడానికి అలా వెళ్లి వస్తాను అని రాజ్ వెళ్లిపోతాడు. ఇంకోసారి నిద్రలో కూడా నోరు జారరు. అలా ఇచ్చాను అని కావ్య అనుకుంటుంది.

తండ్రి కాబోతున్నారు

మరోవైపు ఉన్నపలంగా డబ్బులు ఎలా తీసుకురావాలి అని కల్యాణ్, అప్పు అటు ఇటు నడుచుకుంటూ ఆలోచిస్తుంటారు. ఇంతలో భుజంగం అనే వ్యక్తి వస్తాడు. నేను మీకో గుడ్ న్యూస్ తీసుకొచ్చాను అని భుజంగం అంటాడు. ఏంటీ అని కల్యాణ్ అడిగితే.. కంగ్రాచ్యులేషన్స్ సార్ మీరు తండ్రి కాబోతున్నారు అని భుజంగం అంటాడు. కల్యాణ్, అప్పు ఇద్దరూ షాక్ అవుతారు. కల్యాణ్ అయోమయంగా చూస్తే.. ఛ ఛ కాదు సార్.. యూ ఆర్ అండర్ అరెస్ట్ అని భుజంగం అంటాడు.

ఏంటయ్య నువ్వు. ఏం మాట్లాడుతున్నావ్ అని కల్యాణ్ అడుగుతాడు. సారీ సార్ సారీ సార్. మీకు లక్కీ డ్రాలో ఐదు లక్షలు తగిలాయ్. ఇదిగేండి సార్ అని సూట్‌కేస్ చూపిస్తాడు భుజంగం. నేనేం లాటరీ వేయలేదే. ఐదు లక్షలు తగలడం ఏంటీ అని కల్యాణ్ అంటాడు. మీరు బట్టలు కొన్నారు కదా సార్ దానికి వచ్చిన లాటరీ అని భుజంగం అంటాడు. నేను బట్టలు కొని గంట కాలేదు అప్పుడే లాటరీ తగిలి డబ్బు తీసుకొచ్చారా అని కల్యాణ్ అంటాడు.

జూనియర్ ఆర్టిస్ట్ దొరికిపోయాడు

ఇవి ఇవాళ్టి షాపింగ్‌కు కాదు. నెల రోజుల కిందటి షాపింగ్ లాటరీ అని భుజంగం అంటే.. నేను ఎక్కడ షాపింగ్ చేశానో చెప్పు అని కల్యాణ్ అడుగుతాడు. పంజాగుట్ట షాపింగ్ మాల్ అని భుజంగం అంటే.. నేను అక్కడ ఎప్పుడు షాపింగ్ చేయలేదు అని భుజంగం చెవిలో ఉన్న బ్లూటూత్ తీసుకుని అన్నయ్య.. మీ జూనియర్ ఆర్టిస్ట్ దొరికిపోయాడు. నువ్ ఇక పైకి రా అని కల్యాణ్ అంటాడు. నేను జూనియర్ ఆర్టిస్ట్ అని ఎలా కనిపెట్టారు సార్ అని భుజంగం అంటాడు.

నువ్ చెప్పిన డైలాగ్స్ వల్ల అని కల్యాణ్ అంటాడు. రాజ్ పైకి వస్తాడు. సారీ సార్ నేనేం చెప్పలేదు అని జూనియర్ ఆర్టిస్ట్ అంటే.. కంగ్రాచ్యులేషన్స్, యూ ఆర్ అండర్ అరెస్ట్ అంటే దొరికిపోవా అని రాజ్ అంటాడు. తర్వాత నేను ఎలా డబ్బు ఇచ్చిన తీసుకోవు. అందుకే ఇలా చేశాను అని రాజ్ అంటాడు. నేను అంత అసమర్థుడిలా కనిపిస్తానా. నా భార్యను నేను పోషించుకోలేనా. నువ్ నా వ్యక్తిత్వాన్ని, నన్ను అనుమానిస్తున్నావ్ అని కల్యాణ్ అంటాడు.

గట్టిగా తలుచుకుంటున్నట్లున్నారు

ఛీ ఊరుకో నువ్ ఆ కళావతిలో మాట్లాడకు. ఆ రాక్షసి ఇలా మాట్లాడే వాళ్ల పుట్టింటికి హెల్ప్ చేస్తానన్న ఒప్పుకోలేదు. దాన్ని అనాలి అని వాళ్ల ముందే కావ్యను తిడతాడు రాజ్. అది తట్టుకోలేకపోతారు కల్యాణ్, అప్పు. రాజ్ తిట్టడంతో మరోవైపు కావ్యకు పొలమారుతుంది. అపర్ణ వచ్చి నీళ్లు ఇస్తుంది. మీ అబ్బాయి గారు నా గురించి చాలా గొప్పగా పొగుడుతున్నట్లున్నారు. చాలా గట్టిగా తలుచుకుంటున్నట్లు ఉన్నారు అని కావ్య అంటుంది.

నా కొడుకు అంటే నాకు ఎప్పుడు వెటకారమే. వాడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు అని అపర్ణ అంటుంది. బూత్ బంగ్లాలో శోభనం ఏర్పాటు చేశారు. దాన్ని రాక్షస ప్రేమ అంటారు. కోపం చూపిస్తూ ప్రేమించే మీకు, మీ కొడుకుకు శతకోటి వందనాలు అని కావ్య అంటుంది. ఇంతలో వచ్చిన స్వప్న మీరు ఒక్కటైపోయి నన్ను పట్టించుకోవడమే మానేశారు అని అంటుంది. అంత ధైర్యం ఎవడికీ ఉంటుందే బాబు. మీ అత్త గారిని ముక్కు పిండి పనిచేయించుకున్నట్లు అని అపర్ణ అంటుంది.

హాస్పిటల్‌కి వెళ్లాలి

ఊరుకోండి. అదేమైనా విద్య అని స్వప్న అంటుంది. ఇన్నేళ్లలో రుద్రాణి పని చేసిందే లేదు. నువ్ మాత్రమే దాన్ని టిష్యూ పేపర్‌లా అన్నింటికి వాడేస్తున్నావ్ అని అపర్ణ అంటుంది. మీరు నన్ను తిడుతున్నారని స్వప్న అంటే.. అత్త ప్రేమ ఇలాగే ఉంటుందని. ఇంతకీ నీది ఏ విషయం మర్చిపోయాను అని కావ్య అడుగుతుంది. హాస్పిటల్‌కు వెళ్లాలి అని స్వప్న అంటుంది. అవును కదా అని భోజనం ప్లేట్ అలాగే పెట్టేసి వెళ్తుంది కావ్య.

మీ కొడుకు వస్తే భోజనం వడ్డించండి. లేకుంటే ఆకలి వేస్తుంది. దాంతో కోపం వస్తుంది. అప్పుడు నాకే తంటా వస్తుంది అని కావ్య వెళ్లిపోతుంది. పిచ్చిపిల్లా.. కష్టాన్ని కూడా కామెడీ చేసుకుని సంతోషంగా ఉంటుంది అని అపర్ణ అనుకుంటుంది. రాత్రి రాజ్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటాడు. ఇందిరాదేవి వచ్చి పలకరిస్తుంది. కల్యాణ్ గురించి ఆలోచిస్తున్నట్లు, వాడికి సరైన సంపాదన లేదు. తింటానికి కూడా ఆలోచించే పరిస్థితులో ఉన్నాడు అని జరిగింది చెబుతాడు రాజ్.

కొత్త కోడలితో వ్రతం

పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తోంది. నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. వాడు మాత్రం కష్టపడుతున్నాడు. దీనంతటికి కారణం ఆ కళావతి. తను సపోర్ట్ చేసి ఉంటే వాళ్లిద్దరూ వచ్చేవాళ్లు కదా అని రాజ్ అంటాడు. నీ భార్యను నిందిస్తే సమస్య తీరదు కదా. వాడు ఇంటికి వచ్చే సంగతి చూడు. మొత్తానికి కాకుండా ఒక్కరోజు అంటే వస్తాడు కదా. ఎల్లుండి శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈసారి కొత్త కోడలితో వ్రతం చేయించాలని నేను కండిషన్ పెడ్తా. అలా అయితే ఇంటికి రావాలి అని ఇందిరాదేవి అంటుంది.

ఇంటి సాంప్రదాయం కాబట్టి రామని చెప్పలేరు. దాంతో అప్పు కల్యాణ్ వస్తారని రాజ్ సంతోషిస్తాడు. వచ్చేది ఒక్కరోజే. కానీ, వాళ్లు వచ్చాకా వాళ్లు అనుకుంటుంది తప్పు. వాళ్లు ఉంటామనే నమ్మకం నువ్వే కలిగించాలి అని ఇందిరాదేవి అంటుంది. అదంతా నేను చూసుకుంటాను అని రాజ్ అంటే.. అదంతా సులువు కాదు. మీ పిన్ని చాలా గొడవ చేస్తుంది. ఏమైనా జరగొచ్చు అని ఇందిరాదేవి అంటుంది. అలా జరగకుండా నేను చూసుకుంటాను. వాళ్లు ఒక్కసారి గడప తొక్కితే శాశ్వతంగా ఇక్కడే ఉండేలా చూసుకుంటాను అని రాజ్ అంటాడు.

కావ్య వెటకారం

ఆ పని చేసి పుణ్యం కట్టుకోరా. ఇంట్లో ఏ గొడవలు లేకుండా అందరం ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇందిరాదేవి అంటుంది. నాకు చాలా ప్రశాంతంగా ఉందని, హాయిగా నిద్ర పడుతుందని నానమ్మకు ముద్దు పెట్టి వెళ్లిపోతాడు రాజ్. సంతోషంగా రాజ్ బెడ్ రూమ్‌లోకి వెళ్తాడు. అది చూసిన కావ్య మీకు ఏదో అయింది. డాక్టర్‌కు కాల్ చేయాలి అని కావ్య అడుగుతుంది. లేదు నిజంగానే సంతోషంగానే ఉన్నాను అని రాజ్ అంటాడు. కావ్య వెటకారంగా మాట్లాడుతుంది.

నా తమ్ముడు ఇంటికి రాడు అని చెప్పావ్ కదా. వాళ్లను శాశ్వతంగా ఇంటికి తీసుకొచ్చే ప్లాన్ దొరికింది. ఎల్లుండి అని చెప్పబోయిన రాజ్ దీనికి తెలిస్తే వాళ్లు రాకుండా ప్లాన్ చేస్తుంది. అసలే దీనికి వాళ్లు రావడం ఇష్టం లేదు అని రాజ్ అనుకుంటాడు. అలా స్ట్రక్ అయిపోయారేంటీ అని కావ్య అడిగితే చెప్పను. చెబితే చెడగొడతావ్ అని రాజ్ అంటాడు. నేనేం మీ రుద్రాణి అత్తను కాదు చెడగొట్టడానికి అని కావ్య అంటుంది. ఇప్పుడు నువ్ కూడా ఇప్పుడు అలాగే తయారయ్యావే. ఒకప్పుడు మంచి కళావతివి, ఇప్పుడు కంచు కళావతివి అని రాజ్ అంటాడు.

వ్రతం జరిపించాల్సిందే

ఈయన ఏదో చేస్తున్నాడు. అదేంటో తెలుసుకోవాలి అని కావ్య అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం అందరిని పిలిచిన ఇందిరాదేవి ఓ విషయం చెప్పాలని వరలక్ష్మీ వ్రతం గురించి చెబుతుంది. కల్యాణ్‌కు పెళ్లి అయింది. ముగ్గురితో కలిపి వ్రతం చేయించాలని అనుకుంటున్నాను అని ఇందిరాదేవి అంటుంది. మంచి ఆలోచన అని రాజ్ అంటాడు. ముగ్గురుని కూర్చోబెట్టి వ్రతం జరిపించాల్సిందే అని సీతారామయ్య అంటాడు.

ఇక్కడ మొహం ఎవరికో మారిపోయినట్లు ఉందని రుద్రాణిని అంటుంది స్వప్న. వీళ్లందరు కలిసి ధాన్యలక్ష్మీని బాగా ఇరికించేశారు. వాళ్లను తీసుకొచ్చి శాశ్వతంగా ఉండేలా చేస్తున్నారు అని రుద్రాణి అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో అప్పు కల్యాణ్‌ను ఇందిరాదేవి, సీతారామయ్య వెళ్లి వ్రతం గురించి చెప్పి పిలుస్తారు. మరోవైపు అప్పు కోడలిగా పనికిరాదని రుజువు చేసి తీరుతాను అని రుద్రాణితో ధాన్యలక్ష్మీ అంటుంది.

Whats_app_banner