Brahmamudi September 30th Episode: కావ్యను కాపురానికి తీసుకురానన్న రాజ్ - అప్పు కోసం ఆటోడ్రైవర్‌గా మారిన కళ్యాణ్
Brahmamudi September 30th Episode: బ్రహ్మముడి సెప్టెంబర్ 30 ఎపిసోడ్‌లో కావ్యను కాపురానికి తీసుకురమ్మని రాజ్‌ను అడుగుతుంది అపర్ణ. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వాళ్ల గురించి ఆలోచించడం అనవసరమని, కావ్యను తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చేది లేదని రాజ్ అంటాడు.
Brahmamudi September 30th Episode: రాజ్ రూమ్ నిండా నలిపివేసిన పేపర్స్ కిందపడేసి ఉంటాయి. అవన్నీ ఏమిటని రాజ్‌ను ఇందిరాదేవి అడుగుతుంది. కళాకృతి ఇండస్ట్రీస్ అనే సంస్థకు మెయిల్ పెట్టాలని, టైప్ చేస్తుంటే తప్పుగా వస్తుండటంతో పేపర్‌పై రాసుకుంటున్నానని రాజ్ అంటాడు. పేపర్‌పై కళాకృతి బదులు కళావతి ఇండస్ట్రీస్ అని రాజ్ రాస్తాడు.
ఆ తర్వాత ఇంటి సరుకుల లిస్ట్ రాజ్‌కు ఇస్తుంది ఇందిరాదేవి. ప్రతి నెల కళావతి సరుకులు తెస్తుందిగా తనకే ఇవ్వమని రాజ్ అంటాడు. కనకం ఇంట్లో ఉన్న కావ్యకు వెళ్లి లిస్ట్ ఇవ్వాలా అని రాజ్‌పై సెటైర్ వేస్తుంది ఇందిరాదేవి.
కావ్యకు రాజ్‌పై ప్రేమ...
ఈగోలకు పోవద్దని రాజ్‌కు సలహా ఇస్తుంది ఇందిరాదేవి. కావ్యపై నీకు ప్రేమ ఉంది కాబట్టి తను ఇంట్లో నుంచి వెళ్లిపోయినా ఇక్కడే ఉందని భ్రమపడుతున్నావని ఇందిరాదేవి అంటుంది. కావ్యను నేను మర్చిపోయానని ఇందిరాదేవితో వాదిస్తాడు రాజ్. మరి కావ్యను మర్చిపోతే కళాకృతి బదులు కళావతి అని ఎందుకు రాశావని పంచ్ ఇచ్చి ఇందిరాదేవి వెళ్లిపోతుంది.
కావ్యకు కనకం సలహా...
మరోవైపు కావ్య కూడా రాజ్ జ్ఞాపకాలతోనే తల్లడిల్లుతుంది. నగల డిజైన్ బదులుగా రాజ్ బొమ్మ వేస్తుంది. రాజ్ అన్న మాటలు నీ మనసును వికలం చేశాయని, రాజ్‌పై నీకు ఉన్న ప్రేమ శాశ్వతమని కూతురికి సర్ధి చెబుతుంది కనకం. నువ్వు నిలబెట్టుకున్న కాపురాన్ని నువ్వే కూల్చుకోవడం సరికాదని, సర్ధుకుపోమ్మని కూతురికి సలహా ఇస్తుంది కనకం. తల్లి మాటలతో కావ్య ఆలోచనలో పడుతుంది.
కళ్యాణ్ ఎమోషనల్...
కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వమని తాను చెప్పిన మాటను అప్పు వినకపోవడంతో కళ్యాణ్ కోపంగా కనిపిస్తాడు. అప్పు భోజనం వడ్డించి తీసుకొస్తే తిననని అంటాడు. ఇంట్లోవాళ్లతో పాటు ఆఖరిని నువ్వు కూడా నా మాట వినడం లేదని అప్పుతో కోపంగా మాట్లాడుతాడు కళ్యాణ్. .
కట్టుకున్న భార్యను పోలీస్ చేయాలని అనుకోవడం తప్పేనా అని కళ్యాణ్ అంటాడు. ప్రస్తుతం ఇళ్లు గడవడానికే నువ్వు చాలా కష్టపడుతున్నావని, ఇలాంటి పరిస్తితుల్లో అంత డబ్బు ఎలా ఎక్కడి నుంచి తెస్తావని కళ్యాణ్‌తో అంటుంది అప్పు. నువ్వు కష్టపడుతుంటే చూడలేనని చెబుతుంది.
భార్యను పోషించడం చేతకానివాడిలా...
మన పెళ్లి నీ కలలకు అడ్డుగా మారిందని గుర్తొచ్చిన ప్రతిసారి నా మనసు బాధతో విలవిలలాడుతుందని కళ్యాణ్ చెబుతాడు. నేను ఏదైనా సాధిస్తానంటే ఇంట్లోవాళ్లు, అనామిక నమ్మలేదని, కనీసం కట్టుకున్న భార్యను కూడా పోషించడం చేతకాదని అవమానించారని, అవన్నీ నిజం చేయమంటావా అని అప్పును నిలదీస్తాడు కళ్యాణ్.
జీవితాంతం ఓడిపోయిన భర్తగా బతకడం తన వల్ల కాదని అంటాడు. జీవితంలో మొదటిసారి నాకు గెలిచే అవకాశం దొరికిందని చెబుతాడు. కళ్యాణ్ మాటలతో అప్పు కన్నీళ్లు పెట్టుకుంటుంది. కళ్యాణ్ మాటలతో అప్పు కన్వీన్స్ అవుతుంది. కోచింగ్ సెంటర్‌లో జాయిన్ కావడానికి అంగీకరిస్తుంది.
అపర్ణ పూజ...
అపర్ణ పూజ చేస్తూ నీరసంతో కిందపడబోతుంది. రాజ్ ఆమెను పట్టుకుంటాడు. ఈ పూజ, దీపాలు ఎవరైనా వేరేవాళ్లు వెలిగిస్తారు. నువ్వు ఈ పనులు చేయడం ఎందుకని తల్లితో అంటాడు రాజ్. దీపం వెలిగించడానికి వచ్చిన ఇంటి కోడలిని వెళ్లగొట్టిన నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా అంటూ కొడుకుపై ఫైర్ అవుతుంది ఇందిరాదేవి.
నీ వల్లే కావ్య మనసు విరిగిపోయిందని, వెళ్లి తీసుకురమ్మంటే పొగరుగా మాట్లాడి వచ్చావు..ఇప్పుడు కావ్యను ఎవరు తీసుకొస్తారు, ఎలా వస్తుంది అపర్ణ కోపంగా రాజ్‌ను అంటుంది. అన్ని అయ్య బుద్దులే అంటూ సుభాష్‌ను కడిగేస్తుంది. ఏం చేసినా చెల్లిపోతుందనే పురుష అహంకారం అంటూ రాజ్‌కు క్లాస్ ఇస్తుంది.
అపర్ణకు క్షమాపణలు చెప్పిన రాజ్...
తాను వెళ్లి పిలిచినా కావ్య రాలేదని, నువ్వు రమ్మని చెప్పిన వినలేదని, ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వాళ్ల గురించి ఆలోచించడం అవనసరం అంటూ రాజ్ అంటాడు. నేను ఏం చేయలో నువ్వు నాకు చెప్పకు...నువ్వుం ఏం చేయాలో అదే చేయమని రాజ్‌పై ఫైర్ అవుతుంది. కావ్య దగ్గరకు వెళ్లి అవమానాల పాలు కావడం తనకు ఇష్టం లేదని, కావ్యను తీసుకొచ్చేది లేదని రాజ్ అంటాడు.
అపర్ణకు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు రాజ్. కొడుకు కాపురం ఎలా నిలబెట్టాలో అర్థంకాక అయోమయంలో పడుతుంది అపర్ణ. ఆవేశంగా నిలదీస్తే తన ప్రాణాలకే ప్రమాదం ఉందని, అప్పుడు తల్లి, భార్య దూరమై రాజ్ ఒంటరివాడవుతాడని అపర్ణ బాధపడుతుంది.
టేబుల్ కింద దాక్కున్న అనామిక.
కావ్య డిజైన్స్ వేయడం ఆలస్యం కావడంతో సామంత్ టెన్షన్ పడుతుంటాడు. మేనేజర్ సురేష్‌పై ఫైర్ అవుతాడు. అప్పుడే కావ్య క్యాబిన్‌లోకి అడుగుపెడుతుంది. ఆమెను చూసి సామంత్, అనామిక టేబుల్ కింద దాక్కుంటారు. కావ్య క్యాబిన్ నుంచి వెళ్లిపోగానే ఆఫీస్‌కు తాను ఎండీ అయ్యుండి టేబుల్ కింద దాక్కోవడంపై ఖర్మ పట్టిందని సామంత్ అంటాడు. అతడికి అనామిక కూల్ చేస్తుంది.
రంగంలోకి దిగిన రాజ్...
తన ఆఫీస్ ఎంప్లాయ్స్ వేసిన అన్ని డిజైన్స్‌ను రిజెక్ట్ చేస్తాడు రాజ్. ఎక్స్‌పోలో పోటీ ఇచ్చేలా ఒక్క డిజైన్ లేదని క్లాస్ ఇస్తాడు. స్పెషల్ డిజైన్స్ వేయడానికి కావ్యను పిలిపిస్తే మంచిదని రాజ్‌తో అంటుంది శృతి. కావ్య వల్లే వందేళ్ల నుంచి నుంచి కంపెనీ నడవడం లేదని శృతితో కోపంగా అంటాడు రాజ్.
మిమ్మల్ని నమ్ముకుంటే లాభం లేదని తానే రంగంలోకి దిగుతానని కోపంగా మీటింగ్ రూమ్ నుంచి వెళతాడు. కావ్య పక్కన లేకపోవడంతో ఆ ప్రస్టేషన్‌తోనే రాజ్ ఇలా మాట్లాడుతున్నాడని శృతితో పాటు మిగిలిన ఎంప్లాయ్స్ అనుకుంటారు.
సామంత్ హ్యాపీ...
కావ్య వేసిన డిజైన్స్ చూసి సామంత్ ఇంప్రెస్ అవుతాడు. కావ్య చాలా టాలెంటెడ్ అని, డిజైన్స్ అద్భుతంగా వేసిందని అంటాడు. రాజ్ పిచ్చోడని, కావ్యను వదులుకొని తప్పుచేశాడని అంటాడు. ఈ డిజైన్స్‌వాడుకొని రాజ్‌ను దెబ్బకొడతానని సామంత్ అంటాడు. సిటీలో మనదే నంబర్ వన్ కంపెనీ కావాలని అనామిక చెబుతుంది.
ఆటోడ్రైవర్‌గా మారిన కళ్యాణ్...
ఇంటిని పోషించడం కోసం ఆటోడ్రైవర్‌గా మారుతాడు కళ్యాణ్. అతడి ఆటోలో ఓ రౌడీ ఎక్కుతాడు. ఓ బస్తీలో దిగిన రౌడీ ఆటో కిరాయి డబ్బులు ఇవ్వనని అంటాడు. తనను డబ్బులు అడిగిన కళ్యాణ్‌ను కాలర్ పట్టుకొని కొట్టబోతాడు. అప్పు అతడిని సేవ్ చేస్తుంది. రౌడీని చితక్కొడుతుంది.
తన కోసం కళ్యాణ్ ఆటోడ్రైవర్‌గా మారడం చూసి అప్పు ఎమోషనల్ అవుతుంది. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తోన్న విషయం తన దగ్గర ఎందుకు దాచావని, అబద్దాలతో తనను మోసం చేస్తావని అనుకోలేదని కళ్యాణ్‌తో అంటుంది అప్పు. కళ్యాణ్ ఆమెకు సర్ధిచెప్పబోతాడు. నువ్వు చెప్పేది ఏం లేదు. నేను వినేది ఏం లేదని అంటుంది. ఈ రోజు ఇంటికి వస్తే నా చేతిలో చచ్చిపోతావని కళ్యాణ్‌కు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అప్పు.
రుద్రాణికి పంచ్...
ఎక్స్‌పో వేడుకలో రాజ్‌కు కావ్య ఎదురుపడుతుంది. మాటిమాటికి రాజ్‌కు ఎదురుపడి భర్త మనసు మార్చాలని చూస్తూన్నావేమో అది ఎప్పటికీ జరగదని రుద్రాణి అంటుంది. రాజ్ ఎప్పటికీ నిన్ను క్షమించడని రుద్రాణి ఎగతాళిగా మాట్లాడుతుంది.
కాపురాలు కూల్చే మీరు పక్కన ఉండగా రాజ్ నన్ను కాపురానికి ఎలా తీసుకెళతాడని రుద్రాణికి పంచ్ ఇస్తుంది కావ్య. ఎక్స్‌పోలో తాను వేసిన డిజైన్స్ అనామిక, సామంత్ కంపెనీ వారి దగ్గర ఉండటం చూసి కావ్య షాకవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.