Brahmamudi July 8th Episode: అనామిక‌కు జైలు శిక్ష - క‌ళ్యాణ్‌ను నిర్దోషిగా నిరూపించిన కావ్య - క‌ళావ‌తి ప్రేమ‌లో రాజ్‌-brahmamudi july 8th episode raj tries to express his love towards kavya brahmamudi today serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 8th Episode: అనామిక‌కు జైలు శిక్ష - క‌ళ్యాణ్‌ను నిర్దోషిగా నిరూపించిన కావ్య - క‌ళావ‌తి ప్రేమ‌లో రాజ్‌

Brahmamudi July 8th Episode: అనామిక‌కు జైలు శిక్ష - క‌ళ్యాణ్‌ను నిర్దోషిగా నిరూపించిన కావ్య - క‌ళావ‌తి ప్రేమ‌లో రాజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jul 08, 2024 07:21 AM IST

Brahmamudi July 8th Episode: బ్ర‌హ్మ‌ముడి సీరియల్ జూలై 8 ఎపిసోడ్‌లో క‌ళ్యాణ్‌పై అనామిక పెట్టిన కేసుల‌న్నీ అబ‌ద్దాల‌ని సాక్ష్యాల‌తో కావ్య కోర్టులో నిరూపిస్తుంది. క‌ళ్యాణ్‌తో పాటు అత‌డి కుటుంబాన్ని బాధ‌పెట్టిన అనామిక‌ను జ‌డ్జ్ జైలు శిక్ష విధిస్తాడు.

బ్ర‌హ్మ‌ముడి సీరియల్ జూలై 8 ఎపిసోడ్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియల్ జూలై 8 ఎపిసోడ్‌

Brahmamudi July 8th Episode: క‌ళ్యాణ్‌ను కేసులో ఇరికించి త‌న దారిలోకి తెచ్చుకోవాల‌ని అనుకున్న అనామిక ప్లాన్ కావ్య కార‌ణంగా బెడిసికొడుతుంది. అనామిక చేసిన కుట్ర‌ల‌ను సాక్ష్యాల‌తో స‌హా కోర్టు ముందు కావ్య‌ నిరూపిస్తుంది. అనామిక చేసిన‌వ‌న్నీ త‌ప్పుడు ఆరోప‌ణల వెనుక ఉన్న నిజాల‌ను కావ్య బ‌య‌ట‌పెడుతుంది. అనామిక‌తో తాను మాట్లాడిన మాట‌ల్ని చాటు నుంచి డ్రైవ‌ర్ ద్వారా రికార్డ్ చేయిస్తుంది కావ్య‌.

నాకు న‌చ్చిన‌ట్లుగా ఉండాల్సిందే...

ఆ వీడియోలో నిన్ను, స్వ‌ప్న‌ను అంద‌రూ ఆస్తి కోస‌మే ఆ ఇంటి కోడ‌ళ్లు అయ్యార‌ని అంటారు. నిజానికి మీకు ఆస్తిపై మోజు లేదు. కానీ మీలా నేను ఉండ‌లేను. ల‌గ్జ‌రియ‌స్‌గా బ‌త‌క‌డం కోస‌మే తెలివిగా క‌ళ్యాణ్‌ను ఈ కేసులో ఇరికించాను. క‌ళ్యాణ్ జైలుకు వెళ్ల‌కుండా ఉండాలంటే నాకు న‌చ్చిన‌ట్లుగా అత‌డు ఉండాల్సిందేన‌ని ఈ వీడియోలో కావ్య‌తో అనామిక అంటుంది. ఆ వీడియోను కోర్టులో అంద‌రికి చూపిస్తాడు జ‌డ్జి. ఆ వీడియో చూసి అనామిక షాక‌వుతుంది.

త‌ప్పుడు కేసులు పెట్టి...

అనామిక కావాల‌నే క‌ళ్యాణ్‌ను అల్ల‌రి పాలు చేసింద‌ని, త‌ప్పుడు కేసులు పెట్టి అత‌డిని ఇబ్బందికి గురి చేసింద‌ని క‌ళ్యాణ్ లాయ‌ర్ వాదిస్తాడు క‌ళ్యాణ్, అప్పు మ‌ధ్య ఉన్న స్నేహ‌బంధాన్ని అక్ర‌మ సంబంధంగా అనామిక కావాల‌నే సృష్టించింద‌ని, దుగ్గిరాల ఫ్యామిలీ ప‌రువుప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగేలా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా మ‌హిళా సంఘాల‌ను పోగేసి క‌ళ్యాణ్‌పై దాడిచేయించి అవ‌మానించింద‌ని క‌ళ్యాణ్ య‌ర్ అనామిక చేసిన త‌ప్పుల‌న్నీ సాక్ష్యాల‌తో కోర్టు ముందు ప్ర‌వేశ‌పెడ‌తాడు. అనామిక‌ను క‌ఠినంగా శిక్షించ‌డ‌మే కాకుండా ఆమె నుంచి క‌ళ్యాణ్‌కు విడాకులు ఇప్పించాల‌ని జ‌డ్డిని లాయ‌ర్ కోరుతాడు.

అనామిక‌కు జైలు శిక్ష‌...

సాక్ష్యాల‌తో అనామిక ప‌ట్టుబ‌డ‌టంతో ఆమెకు వ్య‌తిరేకంగా జ‌డ్జి తీర్పు ఇస్తాడు. క‌ళ్యాణ్‌పై అనామిక ఉద్దేశ‌పూర్వ‌కంగానే పెట్టిన కేసు ఇద‌ని తేల్చిచెబుతాడు. అప్పు శీలంపై నింద వేసినందుకు ప‌రువున‌ష్టం క్రింద ఆమె కుటుంబానికి ల‌క్ష రూపాయ‌లు చెల్లించాల‌ని తీర్పు ఇస్తాడు. అనామిక కేసు వ‌ల్ల క‌ళ్యాణ్ కుటుంబానికి, అత‌డి వ్య‌క్తిగ‌త జీవితానికి జ‌రిగిన న‌ష్టానికి గాను రెండు ల‌క్ష‌లు న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని అంటాడు.

చ‌ట్టాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మే కాకుండా కోర్టు, పోలీసుల స‌మ‌యాన్ని వృథా చేసినందుకు అనామిక‌కు ప‌దిహేను రోజులు క‌ఠిన జైలు శిక్ష విధించాల‌ని జ‌డ్జి తీర్పు ఇస్తాడు. త‌క్ష‌ణ‌మే శిక్ష‌ను అమ‌లు చేయాల‌ని పోలీసును జ‌డ్జి ఆదేశిస్తాడు. అనామిక‌తో క‌లిసి ఉండ‌లేన‌ని క‌ళ్యాణ్ చెప్పిన మాట‌ల‌ను స‌మ‌ర్థిస్తూ వారి విడాకుల కేసును ఫ్యామిలీ కోర్టు బ‌దిలీచేస్తున్న‌ట్లు జ‌డ్జి చెబుతాడు. జ‌డ్జి ఇచ్చిన తీర్పు విని అనామిక‌తో పాటు ఆమె త‌ల్లిదండ్రులు షాక‌వుతారు.

క‌ళ్యాణ్ ఆనందం...

జ‌డ్జి ఇచ్చిన తీర్పుతో క‌ళ్యాణ్, ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మి ఆనంద‌ప‌డ‌తాడు. కావ్య‌కు థాంక్స్ చెబుతాడు క‌ళ్యాణ్‌. అనామిక‌ను పోలీసులు స్టేష‌న్‌కు తీసుకెళుతుండ‌గా కావ్య ఆమెను ఆపుతుంది. త‌ప్పు చేస్తున్నావు...స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని ఎన్నిసార్లు చెప్పిన విన‌కుండా అడ్డ‌దారిలో వెళ్లావు. అహంకారంతో నీ కాపురాన్ని నువ్వే స‌ర్వ నాశ‌నం చేసుకున్నావు. ఇక‌నైనా మంచిగా ఉండ‌టానికి ప్ర‌యత్నించు అని అనామిక‌తో అంటుంది కావ్య‌.

మ‌హిళా సంఘాలు అనామిక‌పై ఫైర్ అవుతారు. నీ మాట‌లు న‌మ్మి మంచి కుటుంబాన్ని అవ‌మానించాం. నీలాంటి వాళ్ల వ‌ల్ల మాకు చెడ్డ‌పేరు వ‌చ్చింద‌ని అనామిక‌పై కోప్ప‌డుతారు. క‌ళ్యాణ్‌తో పాటు రాజ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతుంది మ‌హిళా సంఘం నాయ‌కురాలు.

అప్పుకు క‌ళ్యాణ్ సారీ...

మా ఫ్యామిలీ గొడ‌వ‌ల్లోకి నిన్ను లాగి ఇబ్బంది పెట్టాన‌ని అప్పుతో అంటాడు క‌ళ్యాణ్‌. అప్పుకు సారీ చెబుతాడు. ఇక‌నైనా మ‌మ్మ‌ల్ని వ‌దిలేయ్‌...ద‌య‌చేసి మ‌మ్మ‌ల్ని క‌ల‌వ‌డానికి ఇంకెప్పుడూ రాకు అని క‌ళ్యాణ్‌తో చెప్పి కోర్టు నుంచి వెళ్లిపోతుంది క‌న‌కం.

వ‌దిన అంటే త‌ల్లితో స‌మానం...

బ‌లం, బ‌లగం, డ‌బ్బు అన్ని ఉన్నా క‌ళ్యాణ్‌ను తాము కాపాడుకోలేక‌పోయామ‌ని, కానీ నువ్వు మాత్రం క‌ళ్యాణ్‌ నువ్వు కాపాడి...వ‌దిన అంటే త‌ల్లికి ఏం త‌క్కువ కాద‌ని నిరూపించావు అని కావ్య‌తో ప్ర‌కాశం అంటాడు. నువ్వు ఇచ్చిన ట్విస్ట్‌కు నా మైండ్‌బ్లాక్ అయిపోయింద‌ని రుద్రాణి అంటుంది. స‌డెన్‌గా ఇంత మంచి జ‌రిగే స‌రికి ఏం చేయాలో అర్థం కాక మీ మైండ్ బ్లాక్ అయిన‌ట్లుంద‌ని కావ్య సెటైర్ వేస్తుంది.

క‌న‌కం ఆవేశం...

క‌న‌కం, అప్పు కోర్టు నుంచి రాగానే చుట్టుప‌క్క‌ల వాళ్లు అవ‌మానిస్తూ మాట్లాడుతారు. క‌ళ్యాణ్, అప్పు మ‌ధ్య ఉన్న అక్ర‌మం సంబంధం బ‌య‌ట‌ప‌డిందా? ఇక అప్పుకు పెళ్లి కావ‌డం క‌ష్ట‌మేన‌ని అంటారు. అనామిక ఆస్తి కోస‌మే దొంగ కేసు పెట్టింద‌ని జ‌డ్జి తీర్పు ఇచ్చాడు...నా కూతురు నిప్పు అని చెప్పాడ‌ని క‌న‌కం వారికి బ‌దులిస్తుంది.

చుట్టుప‌క్క‌ల వారంద‌రిని దులిపేస్తుంది. మీ కంటే శ‌త్రువులే న‌యం..చెప్పి అన్యాయం చేస్తారు. మీరు మాత్రం మా మంచి కోరుతున్న‌ట్లు న‌టిస్తూనే దెబ్బ‌తీయాల‌ని చూస్తున్నారంటూ క్లాస్ పీకుతుంది. రేపు ఈ స‌మ‌స్య మీకు వ‌స్తే నేను మీలాగే మాట్లాడితే త‌ట్టుకోల‌గ‌రా...మీవి ఒక బ‌తుకులేనా అంటూ బుద్దిచెప్పి పంపిచేస్తుంది క‌న‌కం.

కావ్య‌కు ఐ ల‌వ్ యూ చెప్పిన రాజ్‌...

కావ్య బెడ్ రూమ్‌లో చీర‌లు స‌ర్ధుతుంటుంది. ఆమె ఒంట‌రిగా ఉండ‌టం చూసి త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ను ఆమెకు వ్య‌క్తం చేయాల‌ని రాజ్ అనుకుంటాడు. కావ్య ముందుకొచ్చి ఆమెను ఎత్తుకొని ఐ ల‌వ్ యూ చెబుతాడు రాజ్‌. ఇందిరాదేవి వ‌చ్చి భుజంపై త‌ట్ట‌డంతో అదంతా క‌ల అని రాజ్‌ అర్థం చేసుకుంటాడు. కావ్య‌ను చూసి రాజ్ సిగ్గుప‌డుతుండ‌టంతో ఏంటి క‌థ అని ఇందిరాదేవి అడుగుతుంది.

ముద్దుపెట్టుకున్నావా...

కావ్య‌ను క‌ల‌లో ముద్దుపెట్టుకున్నావా...బుగ్గ గిల్లావా అని రాజ్‌ను ను అడుగుతుంది ఇందిరాదేవి. అదేం లేద‌ని త‌డ‌బ‌డుతూ స‌మాధానం ఇస్తాడు రాజ్‌. ఇలా ఊహ‌ల్లోనే ఇంకా ఎంత కాలం ఉంటావు. నీ ప్రేమ‌ను ఎన్నాళ్లు దాచిపెట్టుకుంటావ‌ని రాజ్‌కు ఇందిరాదేవి క్లాస్ ఇస్తుంది. కావ్య త‌మ ద‌గ్గ‌ర‌కి వ‌స్తుండ‌టంతో రాజ్ కంగారుప‌డ‌తాడు.

మీరిద్ద‌రు ఇక్క‌డేం చేస్తున్నార‌ని రాజ్‌, ఇందిరాదేవిని కావ్య అడుగుతుంది. రాజ్ అబ‌ద్ధం ఆడుతాడు. ఇందిరాదేవిని మాట్లాడ‌కుండా చేసి అక్క‌డి నుంచి పంపించేస్తాడు రాజ్‌. అమ్మ‌మ్మ నోరు మూయించిన‌ట్లుగా మీ మ‌న‌సు త‌లుపుల‌ను మూయ‌లేర‌ని రాజ్‌తో అంటుంది కావ్య‌. రాజ్ చెంప‌పై త‌ట్టి వెళ్లిపోతుంది. ఆ స్ప‌ర్ప‌కే రాజ్ ఆనంద‌ప‌డిపోతాడు.

క‌ళ్యాణ్ క‌న్నీళ్లు...

ప్రేమ పేరుతో అనామిక చేసిన మోసాన్ని క‌ళ్యాణ్ త‌ట్టుకోలేక‌పోతాడు. క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. పెళ్లి ఆల్బ‌మ్‌లోని ఫొటోల‌ను కుప్ప‌గా వేసి పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తాడు. ఆ సీన్ చూసి కావ్య షాక‌వుతుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

WhatsApp channel