Brahmamudi March 12th Episode:రాజ్‌కు విడాకులు ఇవ్వ‌నున్న కావ్య‌ - క‌ళ్యాణ్‌కు అప్పు ప్రామిస్ - అనామిక జెల‌సీ-brahmamudi march 12th episode kavya decides to divorce raj brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 12th Episode:రాజ్‌కు విడాకులు ఇవ్వ‌నున్న కావ్య‌ - క‌ళ్యాణ్‌కు అప్పు ప్రామిస్ - అనామిక జెల‌సీ

Brahmamudi March 12th Episode:రాజ్‌కు విడాకులు ఇవ్వ‌నున్న కావ్య‌ - క‌ళ్యాణ్‌కు అప్పు ప్రామిస్ - అనామిక జెల‌సీ

Nelki Naresh Kumar HT Telugu
Mar 12, 2024 08:34 AM IST

Brahmamudi March 12th Episode: అప్పును క‌లిసి తాను ప‌డుతోన్న బాధ మొత్తం చెప్పేస్తాడు క‌ళ్యాణ్. క‌ష్టాల్లో క‌ళ్యాణ్‌కు అండ‌గా ఉంటాన‌ని అప్పు ప్రామిస్ చేస్తుంది. క‌ళ్యాణ్ చేతిలో అప్పు చేయివేయ‌డం అనామిక‌, ధాన్య‌ల‌క్ష్మి చూస్తారు.ఆ త‌ర్వాత నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

Brahmamudi March 12th Episode: మీటింగ్ అంటూ అబ‌ద్ధం ఆడి రాజ్ కారును తీసుకొని భాస్క‌ర్‌, కావ్య బ‌య‌ట‌కు వెళ్లాల‌ని అనుకుంటారు. రాజ్‌ను ఏడిపించ‌డానికి వారు వేసిన ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. రాజ్ వారిని ఆపేస్తాడు. త‌న‌కు లిఫ్ట్ కావాల‌ని అంటాడు. న‌న్ను కారులో ఆఫీస్ ద‌గ్గ‌ర డ్రాప్ చేయ‌మ‌ని చెబుతాడు.

కారు నాదైనా నిర్ణ‌యం మీదేన‌ని భాస్క‌ర్‌, కావ్య‌ల‌తో అంటాడు రాజ్‌. నువ్వు మీ బావ ప‌క్క‌న కూర్చోవాల్సిందేన‌ని రాజ్ ప‌ట్టుప‌డ‌తాడు. బ‌ల‌వంతంగా భాస్క‌ర్ ప‌క్క‌న కావ్య‌ను కూర్చొబెట్టి తాను వెన‌క సీట్‌లో కూర్చుంటాడు రాజ్‌.

రాజ్ రివ‌ర్స్ డ్రామా...

త‌మ మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది రాజ్‌తో అంటాడు భాస్క‌ర్‌. మాతో పాటు మీరు వ‌స్తారా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య‌. మీ మ‌ధ్య నేను ఎందుకు, నేను వ‌స్తే త‌మ్ముడ‌న్న‌య్యా ఫ్రీగా ఉండ‌లేడ‌ని రాజ్ అంటాడు. చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి పెరిగిన‌వాళ్లు మీ మ‌ధ్య‌ మాట్లాడుకోవ‌డానికి ఎన్నో సంగ‌తులుంటాయ‌ని భాస్క‌ర్‌, కావ్య‌ల‌పై సెటైర్స్ వేస్తాడు రాజ్‌. రెస్టారెంట్‌, షాపింగ్‌, మూవీ ఎక్క‌డికి వెళ్లిన నాకు ప‌ర్వాలేదు. నేనేం అనుకోన‌ని భాస్క‌ర్‌తో అంటాడు రాజ్‌.

ఎంజాయ్ అని చెప్పి కారు దిగుతాడు. కావ్య‌కు ఐస్‌క్రీజ్‌, చాక్లెట్స్ అంటే చాలా ఇష్ట‌మ‌ని చెబుతాడు. న‌న్నే జెల‌సీగా ఫీల‌య్యేలా చేస్తారా...మీకు ఛాన్స్ ఇవ్వ‌నుగా అంటూ రాజ్ లోలోన ఆనంద‌ప‌డ‌తాడు. రాజ్ రివ‌ర్స్ గేమ్ ఆడుతుండ‌టంతో కావ్య త‌ట్టుకోలేక‌పోతుంది. వెంట‌నే ఇందిరాదేవికి ఫోన్ చేసి అన్ని విష‌యాలు చెప్పేస్తుంది చెబుతుంది. రాజ్‌ను దారిలోని తీసుకురావ‌డానికి మ‌రో కొత్త ప్లాన్ వేస్తుంది ఇందిరాదేవి. రాజ్‌కు ఫోన్ చేసి తాత‌య్య‌కు ట్యాబ్లెట్స్ ఇప్పుడే తీసుకుర‌మ్మ‌ని అంటుంది.

అప్పును క‌లిసిన క‌ళ్యాణ్‌...

అప్పును క‌లుస్తాడు క‌ళ్యాణ్‌. త‌న మ‌న‌సులోని బాధ మొత్తం ఆమెకు చెప్పేస్తాడు. పుట్టిపెరిగింది అదే ఇంటికి అయినా అనామిక కార‌ణంగా ఇంటికి వెళ్లాలంటే భ‌య‌మేస్తుంద‌ని బాధ‌ప‌డ‌తాడు. సంపాదిస్తేనే విలువ ఇస్తారా...ఓ బంధానికి అంత‌కుమించి విలువ ఉండ‌దా అని క‌ళ్యాణ్ ఆవేద‌న‌కు లోన‌వుతాడు. న‌న్ను, నా క‌విత‌ల్ని ఇష్ట‌ప‌డి అనామిక త‌న‌ను ప్రేమించింద‌ని అనుకున్నాన‌ని, కానీ అనామిక ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింద‌ని అప్పుకు చెప్పి బాధ‌ప‌తాడు.

అనామిక బాధ‌లో అర్థం ఉంద‌ని ఆమెను వెన‌కేసుకొని వ‌స్తుంది అప్పు. జీవితంలో డ‌బ్బు సంపాదించ‌డ‌మే గొప్పత‌నం అని అనామిక అనుకుంటుంద‌ని, అనామిక‌ను అర్థం చేసుకొని నేను డ‌బ్బు మ‌నిషిగా మారిపోవాలా అని అప్పుతో అంటాడు క‌ళ్యాణ్.అవ‌స‌రాల‌కు స‌రిపోయే డ‌బ్బు నా ద‌గ్గ‌ర‌కు ఉన్న‌ప్పుడు నా మ‌న‌సుకు న‌చ్చిన ప‌ని చేయ‌డంలో త‌ప్పేం లేద‌ని క‌ళ్యాణ్ అంటాడు.

అప్పు స‌ల‌హాలు...

నీ భార్య గురించి త‌క్కువ చేసి మాట్లాడ‌వ‌ద్ద‌ని క‌ళ్యాణ్‌కు క్లాస్ ఇస్తుంది అప్పు. కానీ అనామిక మాత్రం ఇప్ప‌టికి మ‌న ఇద్ద‌రి బంధాన్ని గురించి త‌ప్పుగానే మాట్లాడుతుంద‌ని అప్పుకు బ‌దులిస్తాడు క‌ళ్యాణ్. అనామిక‌ను బ్లేమ్ చేయ‌డం మానేసి నువ్వు ఏం చేయాలో ఆలోచించ‌మ‌ని క‌ళ్యాణ్‌కు స‌ల‌హా ఇస్తుంది అప్పు. అనామిక చెప్పిన‌ట్లు ఆఫీస్‌కు వెళ్లి బుద్దిగా ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టు లేదంటే నీకు న‌చ్చిన దారిలో స‌క్సెస్ అవ్వ‌డంపై దృష్టిలో పెట్ట‌మ‌ని స‌ల‌హా ఇస్తుంది.

క‌ళ్యాణ్ జోక్స్‌...

ట్యాబ్లెట్స్ తీసుకొని రాజ్ ఇంటికొస్తాడు. కావ్య ఎక్క‌డికి వెళ్లింద‌ని రాజ్‌ను అడుగుతుంది ఇందిరాదేవి. కావ్య‌, ఆమె బ‌య‌ట‌కు వెళ్లార‌ని, వారు రావ‌డానికి చాలా టైమ్ ప‌డుతుంద‌ని, ఇప్ప‌ట్లో ఇంటికి రాక‌పోవ‌చ్చున‌ని రాజ్ సెటైరిక‌ల్‌గా మాట్లాడుతాడు.

అప్పుడే బావ భాస్క‌ర్‌తో క‌లిసి ఇంట్లో అడుగుపెడుతుంది. సిటీ చూడ‌టానికి వెళ్లి అప్పుడేవ‌చ్చారేమిట‌ని ఇద్ద‌రిపై జోకులు వేస్తాడు రాజ్‌. నీ భార్య‌ను నువ్వు బ‌య‌ట‌కు తీసుకెళితే బాగుంటుంది కానీ అత‌డిని తీసుకెళ్ల‌మంటున్నావేమిట‌ని రాజ్‌తో అంటుంది ఇందిరాదేవి. వాళ్లు చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి పెరిగారు. బ‌య‌ట‌కు వెళితే త‌ప్పేమిట‌ని స‌మాధానం ఇచ్చి రాజ్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

అప్పు ప్రామిస్‌...

నీతో మాట్లాడిన త‌ర్వాత త‌న‌కు ధైర్యం వ‌చ్చింద‌ని అప్పుతో అంటాడు క‌ళ్యాణ్‌. నువ్వు నాకు ఎప్పుడు తోడు ఉంటావా, ఏ క‌ష్టం వ‌చ్చినా నా ప‌క్క‌నే ఉంటాన‌ని ప్రామిస్ చేయ‌మ‌ని అంటాడు. స‌రే అని క‌ళ్యాణ్‌కు మాటిస్తుంది అప్పు. క‌ళ్యాణ్ చేతిలో అప్పు చేయి వేసి ప్రామిస్ చేయ‌డం అనామిక‌, ధాన్య‌ల‌క్ష్మి చూస్తారు. పెళ్లైన మ‌గాడితో తిర‌గ‌డానికి అప్పుకు కొంచెమైనా సిగ్గు ఉండాలి అంటూ అనామిక ఫైర్ అవుతుంది.

మా పెళ్లి పెటాకులు చేసి దుగ్గిరాల ఇంటికి కోడ‌లు అయిపోవాల‌ని ప్లాన్ చేస్తుంద‌ని ధాన్య‌ల‌క్ష్మి మ‌న‌సులో అప్పు ప‌ట్ల ద్వేషాన్ని పెంచుతుంది అనామిక‌. క‌ళ్యాణ్ మ‌న‌సు మార్చ‌డానికే అత‌డి వెంట అప్పు ప‌డుతుంద‌ని చెబుతుంది. అప్పును ఇప్పుడే క‌డిగేస్తా అంటూ అనామిక కారు దిగ‌బోతుంది. కానీ ధాన్య‌ల‌క్ష్మి ఆపేస్తుంది. ఇలాంటి విష‌యాలు ఎక్క‌డ తేల్చుకోవాలో అక్క‌డే తేల్చుకుందామ‌ని అంటుంది.

కావ్య‌కు గుడ్‌న్యూస్‌...

కావ్య వంట చేస్తోండ‌గా నీకో గుడ్ న్యూస్ అంటూ రాజ్‌ ఆనందంగా అక్క‌డికి వ‌స్తాడు. ఈ క‌వ‌ర్‌లో నువ్వు కోరుకున్న‌ది ఉంద‌ని అంటాడు. అందులో ఏముందో చెప్ప‌క స‌స్పెన్స్‌లో పెడ‌తాడు. విడాకులు ఇస్తున్నాడేమోన‌ని కావ్య కంగారు ప‌డుతుంది. ఇందిరాదేవి, భాస్క‌ర్ కూడా టెన్ష‌న్ త‌ట్టుకోలేక‌పోతారు.

ఆ క‌వ‌ర్‌లో నుంచి కావ్య పాస్‌పోర్ట్ తీసి ఇస్తాడు. మీబావ‌తో సంతోషంగా అమెరికా వెళ్లిపో...నువ్వు దూర‌మైన బాధ‌లో నేను సోలో లైఫ్ వెళ్ల‌దీస్తాన‌ని కావ్య‌పై సెటైర్ వేస్తాడు. బెదిరించ‌డానికి పాస్‌పోర్ట్ కావాలంటే రాజ్ నిజంగానే కావ్యకు పాస్‌పోర్ట్ తెచ్చి ఇవ్వ‌డంతో కావ్య ఎమోష‌న‌ల్ అవుతుంది. రాజ్‌కు నాపై ప్రేమ లేదు. మ‌న‌సులో ప్రేమ ఉన్న ఎప్ప‌టికీ ఒప్పుకోన‌ప్పుడు ఈ నాట‌కాలు అవ‌స‌రం అంటూ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

చివ‌రి అస్త్రం...

రాజ్‌ను దారిలోకి తేవ‌డానికి చివ‌రి అస్త్రం ప్ర‌యోగించాల్సిందేన‌ని ఇందిరాదేవి అంటుంది. అదేమిట‌ని కావ్య అడ‌గ్గా విడాకులు అంటూ బ‌దులిస్తుంది. కావ్య‌కు విడాకుల ప‌త్రాలు తెచ్చి ఇస్తుంది. క‌ల‌ప‌డానికి విడిపోయే పాత్ర‌లు ఎందుకు కావ్య కంగారుగా అడుగుతుంది. క‌లిసి ఉన్న‌ప్పుడు తెలియ‌ని విలువ విడిపోతున్నామ‌ని అర్థ‌మ‌య్యిన‌ప్పుడే తెలుస్తుంద‌ని కావ్య‌తో అంటుంది ఇందిరాదేవి. విడాకుల‌తోనైనా రాజ్ దారిలోకి వ‌స్తాడ‌ని చెబుతుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.