Brahmamudi Promo: భ‌ర్త మ‌న‌సు గెలిచిన కావ్య - బెడిసికొట్టిన అనామిక ప్లాన్ - వ‌సు ట్విస్ట్‌కు రంగా మైండ్‌బ్లాక్‌-brahmamudi serial latest promo and guppedantha manasu next episode highlights star maa serials disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Promo: భ‌ర్త మ‌న‌సు గెలిచిన కావ్య - బెడిసికొట్టిన అనామిక ప్లాన్ - వ‌సు ట్విస్ట్‌కు రంగా మైండ్‌బ్లాక్‌

Brahmamudi Promo: భ‌ర్త మ‌న‌సు గెలిచిన కావ్య - బెడిసికొట్టిన అనామిక ప్లాన్ - వ‌సు ట్విస్ట్‌కు రంగా మైండ్‌బ్లాక్‌

Nelki Naresh Kumar HT Telugu
Jul 07, 2024 09:48 AM IST

Brahmamudi Promo: డ‌బ్బు కోసం అనామిక చేసిన కుట్ర‌ల‌ను కావ్య సాక్ష్యాల‌తో స‌హా కోర్టులో నిరూపించిన‌ట్లు బ్ర‌హ్మ‌ముడి కొత్త ప్రోమోలో క‌నిపిస్తోంది. తాను రిషి కాద‌ని నిరూపించాల‌ని అనుకున్న రంగాకు వ‌సుధార ట్విస్ట్ ఇచ్చిన‌ట్లుగా గుప్పెడంత మ‌న‌సు ప్రోమోలో చూపించారు.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ప్రోమో
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ప్రోమో

Brahmamudi Promo: క‌ళ్యాణ్‌తో పాటు దుగ్గిరాల కుటుంబంపై రివేంజ్ తీర్చుకోవాల‌ని ప్లాన్ చేసిన అనామిక‌కు కావ్య షాకిస్తుంది. అనామిక చేసిన కుట్ర‌ల‌ను సాక్ష్యాధారాల‌తో కోర్టులో బ‌య‌ట‌పెడుతుంది కావ్య‌. అనామిక‌తో మాట్లాడిన మాట‌ల్ని ఆమెకు తెలియ‌కుండా కావ్య రికార్డ్ చేస్తుంది. అందులో డ‌బ్బు కోస‌మే తాను క‌ళ్యాణ్‌ను పెళ్లిచేసుకున్న‌ట్లు అనామిక చెబుతుంది. త‌న పుట్టింటి కుటుంబ క‌ష్టాల‌ను తీర్చ‌డం కోస‌మే క‌ళ్యాణ్‌ను కోర్టు మెట్లు ఎక్కించిన‌ట్లు కావ్య‌తో అనామిక అంటుంది.

విడాకులు ఇవ్వాల్సిందే...

నిన్న‌టిదాకాక‌ళ్యాణ్, అనామికల‌ కాపురం నిల‌బెట్టాల‌ని తాను అనుకున్నాన‌ని జ‌డ్జ్‌తో కావ్య చెబుతుంది. అనామిక నిజ స్వ‌రూపం తెలిసిన త‌ర్వాత క‌ళ్యాణ్ తో ఆమె క‌లిసి ఉండ‌టంలో అర్థం లేద‌ని అనిపిస్తోంద‌ని అంటుంది. క‌ళ్యాణ్‌కు, అనామిక‌కు విడాకులు ఇప్పించ‌డ‌మే మంచిద‌ని కోర్టులో కావ్య అంటుంది.

కావ్య మాట‌ల‌తో అనామిక షాక‌వుతుంది. త‌న ప్లాన్ బెడిసికొట్ట‌డంతో క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. అదే కాకుండా అప్పు, క‌ళ్యాణ్‌కుమ‌ధ్య అక్ర‌మ సంబంధం లేకున్నా...తానే ఉన్న‌ట్లుగా అంద‌రిని న‌మ్మించాన‌ని, హోట‌ల్ రూమ్‌లో ఇద్ద‌రు దొరికిపోయేలా ప్లాన్ చేసింది తానే అని అనామిక స్వ‌యంగా ఒప్పుకున్న వీడియోను అప్పు, కావ్య క‌లిసి కోర్టులో ప్ర‌వేశ‌పెడ‌తారు.

దుగ్గిరాల ఫ్యామిలీ హ్యాపీ...

క‌ళ్యాణ్‌ను జైలు శిక్ష నుంచి త‌ప్పించ‌డ‌మే కాకుండా అత‌డు ఏ త‌ప్పు చేయ‌లేద‌ని కావ్య కోర్టులో నిరూపించ‌డంలో దుగ్గిరాల ఫ్యామిలీ ఆనందానికి అవ‌ధులు లేకుండాపోతాయి. భార్య తెలివితేట‌ల‌కు రాజ్ మురిసిపోతాడు.

రాజ్ మ‌న‌సులో ఉన్న మాట‌...

కావ్య బెడ్ రూమ్‌లో బ‌ట్ట‌లు స‌ర్ధుతుంటుంది. కావ్య ఒంట‌రిగా క‌నిపించ‌డంతో త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను ఆమెను వ్య‌క్తం చేయాల‌ని రాజ్ ఫిక్స‌వుతాడు. కావ్య‌ను ఎత్తుకొని గిరాగిరా తిప్పుతాడు. ఆ త‌ర్వాత క‌ళావ‌తి ఐ ల‌వ్ యూ అని ఆమెకు త‌న మ‌న‌సులో చాలా రోజులుగా దాచుకున్న మాట‌ను చెబుతాడు. రాజ్ చెప్పిన మాట విని కావ్య ఆనందం ప‌ట్ట‌లేక‌పోతుంది. భ‌ర్త ప్రేమ‌ను గెల‌వ‌డంతో సంబ‌ర‌ప‌డిన‌ట్లుగా బ్ర‌హ్మ‌ముడి కొత్త ప్రోమోలో చూపించారు.

క‌ళ్యాణ్ నిర‌ప‌రాధి...

కావ్య‌ అందించిన సాక్ష్యాల‌తో అనామిక ప్లాన్ ఎలా బెడిసికొట్టింది? అనామిక చేసిన ఆరోప‌ణ‌ల‌ను త‌ప్ప‌ని జ‌డ్జ్ తీర్పు ఇచ్చాడా? క‌ళ్యాణ్‌, అప్పు ఈ కేసు నుంచి నిర‌ప‌రాధాలుగా బ‌య‌ట‌ప‌డ్డారా? లేదా? అన్న‌ది సోమ‌వారం నాటి బ్ర‌హ్మ‌ముడి ఎపిసోడ్‌లో తేల‌నుంది.

అనుప‌మ‌కు ఫ‌ణీంద్ర క్ష‌మాప‌ణ‌లు...

ఎండీ ప‌ద‌వికి మ‌ను అడ్డు రాకుండా తండ్రి పేరుతో అత‌డిని ప‌దే ప‌దే అవ‌మానిస్తారు దేవ‌యాని, శైలేంద్ర‌, మ‌ను, ఏంజెల్‌ల‌ను కాలేజీలో దేవ‌యాని అన్న మాట‌ల‌ను మొత్తం ఫ‌ణీంద్ర ముందు బ‌య‌ట‌పెడ‌తారు మ‌హేంద్ర‌, అనుప‌మ. దేవ‌యాని త‌ర‌ఫున అనుప‌మ‌కు ఫ‌ణీంద్ర క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు. తండ్రి త‌న‌ను ఏం అక‌పోవ‌డంతో శైలేంద్ర సంబ‌ర‌ప‌డ‌తాడు.

దేవ‌యాని బ్లాక్‌బెయిల్‌...

ఎండీ ప‌ద‌వికి అడ్డుగా మ‌ను ఆట క‌ట్టించ‌డానికి వ‌సుధార రాసిన లెట‌ర్‌ను బ్ర‌హ్మాస్త్రంగా వాడుకోవాల‌ని దేవ‌యాని ఫిక్స‌వుతుంది. ఆ లెట‌ర్‌ను అనుప‌మ‌కు చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తుంది. మ‌ను కాలేజీ వ‌దిలిపెట్టివెళ్ల‌క‌పోతే వ‌సుధార లెట‌ర్‌లో రాసిన నిజాన్ని అంద‌రి ముందు బ‌య‌ట‌పెడ‌తాన‌ని దేవ‌యాని అంటుంది. వ‌సుధార రాసిన లెట‌ర్ చూసి అనుప‌మ కంగారు ప‌డిందా? మ‌నును కాలేజీ నుంచి పంపించిందా? లేదా అన్నది గుప్పెడంత మ‌న‌సు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

రంగాకు వ‌సుధార‌ ట్విస్ట్‌...

మ‌రోవైపు తాను రిషి అంటూ పొర‌బ‌డుతోన్న వ‌సుధార‌కు అస‌లు నిజం చెప్పాల‌ని రంగా ఓ ప్లాన్ వేస్తాడు. కానీ అత‌డికే ట్విస్ట్ ఇస్తుంది వ‌సుధార‌. అదేమిట‌న్న‌ది సోమ‌వారం నాటి గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్‌లో తేల‌నుంది.

WhatsApp channel