Guppedantha Manasu June 24th Episode: గుప్పెడంత మనసు - రంగాకు సైట్ కొట్టిన వసు - ముష్టివాడంటూ శైలేంద్రకు అవమానం
Guppedantha Manasu June 24th Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో రంగానే రిషి అని వసుధార అనుమాన పడుతుంది. ఆ మాట రంగా నోటితోనే చెప్పించాలని రంగా ఆటోలో షికారుకు బయలుదేరుతుంది. తన కళ్ల ముందే రంగాకు వసుధార సెట్ కొట్టడం సరోజ తట్టుకోలేకపోతుంది.
Guppedantha Manasu June 24th Episode: తన క్యాబిన్‌లో ఏంజెల్‌తో మాట్లాడుతుంటాడు మను. అప్పుడే అక్కడికి వచ్చిన శైలేంద్ర మను,ఏంజెల్‌పై ఫైర్ అవుతాడు. మా తాత కట్టించిన కాలేజీ ఇదని, ఇందులోకి అక్రమంగా ప్రవేశించి అడ్డగోలు పనులు చేస్తున్నారని ఇద్దరిని అవమానిస్తాడు. మధ్యలో ఏంజెల్ శైలేంద్ర మాటలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది.

కానీ అసలు నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకొచ్చావని, నీకు కాలేజీకి ఏం సంబంధం లేదని ఏంజెల్‌తో చులకనగా మాట్లాడుతాడు శైలేంద్ర. మీ బావ మరదళ్ల సరసాలు ఏమైనా ఉంటే బయట పెట్టుకుంటే మంచిదని కాలేజీలో కాదని మను, ఏంజెల్‌లను నానా మాటలు అంటాడు శైలేంద్ర.
శైలేంద్రను కొట్టబోయిన మను...
ఏంటో ఈ కాలేజీ ఖర్మ...దిక్కులేనివాళ్లందరికి ఈ కాలేజీ దిక్కు అవుతుందని మనును అవమానిస్తూ మాట్లాడుతాడు శైలేంద్ర. ఇక్కడ దిక్కులేని వాళ్లు ఎవరు లేరని శైలేంద్ర కోపంగా సమాధానమిస్తాడు మను. కన్న తండ్రి ఎవరో తెలియనివాళ్లు దిక్కులేని వాళ్లేనని మను మనసును నొప్పిస్తాడు శైలేంద్ర.
ఆ మాటతో మను కోపం పట్టలేకపోతాడు. శైలేంద్రను కొట్టడానికి చెయ్యేత్తుతాడు. కానీ ఏంజెల్ ఆపుతుంది. ఇంకో మాట మాట్లాడితే మను కాదు నేను కొడతానని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తుంది. మీరు కొడుతుంటే నేను చూస్తు ఊరుకుంటానా అని ఆమెకు ఆన్సర్ ఇస్తాడు శైలేంద్ర. ఏం చేస్తావని శైలేంద్ర పైకి వెళతాడు మను. దాంతో శైలేంద్ర భయంతో వెనక్కి తగ్గుతాడు.
పెళ్లి జరిపిస్తా....
మీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను..అందుకు బదులుగా నాకు ఎండీ సీట్ ఇవ్వాలని మను, ఏంజెల్‌లకు ఆఫర్ ఇస్తాడు శైలేంద్ర. మా పెళ్లి సంగతి పక్కనపెట్టు కానీ నీ ఫ్యూచర్ మాత్రం నాకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందని ఏంజెల్ అంటుంది. త్వరలోనే సర్వస్వం కోల్పోయి, అందరికి దూరమై అడుక్కుతింటావు. జరగబోయేది ఇదేనని శైలేంద్రతో అంటుంది ఏంజెల్.
మీరు ఏమైనా అనుకొండి నాకు ఎండీ సీట్ కావాలని ఇద్దరిని బతిమిలాడటం మొదలుపెడతాడు శైలేంద్ర. ముష్టివాళ్లు ఎక్కువైపోయారు. ఒక్కసారి లేదని చెప్పిన అడుక్కుంటూనే ఉంటారు. దిక్కుమాలిన సంత అని శైలేంద్ర పరువు మొత్తం తీసేస్తుంది ఏంజెల్.
వసుధార రిక్వెస్ట్...
ఆటో తీసుకొని రంగా కిరాయి వెళ్లబోతుంటాడు. అతడిని వసుధార ఆపుతుంది. ఇంట్లో బోర్ కొడుతుందని, తనను బయటకు తీసుకెళ్లమని కోరుతుంది. రంగాను రిషి అంటూ వసుధార పిలుస్తుంది. వసుధార ఎన్నిసార్లు పిలుస్తున్నా రంగా పట్టించుకోడు. అప్పుడే అక్కడికి సరోజ వస్తుంది. వసుధార పిలుస్తున్నా రంగా పట్టించుకోనట్లుగా ఉండటం చూసి సంతోషంగా ఫీలవుతుంది. తాను రిషి కాదని, ఆ పేరుతో ఎన్నిసార్లు పిలిచినా పలకనని వసుధారతో అంటాడు రంగా.
ఊరు చూడాలని ఉంది...
తనను ఊరు తిప్పి చూపించమని రంగాను కోరుతుంది వసుధార. తాను ఆటోను కిరాయి తిప్పడానికి తీసుకెళుతున్నానని, ఈ మధ్య సరిగ్గా పనికి వెళ్లలేదని రంగా బదులిస్తాడు. నన్ను ఊరికే ఊరు మొత్తం తిప్పద్దని ఆ కిరాయి డబ్బులు తానే ఇస్తానని వసుధార అంటుంది.ఎక్కడి నుంచి ఇస్తారు..ఎప్పుడు ఇస్తారు అని వసుధారను అడుగుతాడు రంగా. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఇస్తానని రంగాకు ఆన్సర్ ఇస్తుంది వసుధార.
సరోజ వాదన...
తనను బయటకు తీసుకెళ్లమని రంగాను బతిమిలాడుతుంది వసుధార. వద్దని సరోజ అంటుంది. చివరకు వసుధారను తన ఆటోలో బయటకు తీసుకెళ్లాలని రంగా ఫిక్సవుతాడు. అయితే తాను ఆటోలో వస్తానని సరోజ పట్టుపడుతుంది. అందుకు వసుధార ఒప్పుకోదు. తాను కిరాయి మాట్లాడుకున్నానని, ఒక్కదానినే వెళతానని సరోజతో వసుధార వాదిస్తుంది వసుధార మాటలను పట్టించుకోకుండా ఆటోలో కూర్చుంటుంది సరోజ. వసుధార కూడా ఎక్కడంతో ఆటో తీసుకొని బయలుదేరుతాడు రంగా.
రంగానే చూస్తూ...
ఆటోలో షికారుకు బయలుదేరిన వసుధార ఊరును కాకుండానే రంగానే చూస్తూ మైమరచిపోతుంటుంది. అతడికి సైట్ కొడుతుంది. ఇదే మా ఊరు అని రంగా అంటాడు. బాగుంది అని వసుధార బదులిస్తుంది. ఊరును కాకుండా రంగానే చూసి వసుధార ఆ మాట అన్నదని సరోజ అనుకుంటుంది.
ఇలాగే తాను సైలెంట్‌గా ఉంటే రంగా తనకు దక్కకుండా పోతాడని భయపడుతుంది. ఊరు అటుంది ...ఇటు లేదు అని వసుధారపై సెటైర్ వేస్తుంది. నేను చూడాల్సిందే చూస్తున్నానని సరోజకు పంచ్ ఇస్తుంది వసుధార.
సరోజకు పంచ్...
వసుధార తననే చూస్తూ ఉండటం రంగా కనిపెడతాడు. ఆటో ఆపేస్తాడు. మీరు ఊరు కాకుండా నన్నే చూస్తున్నారని, అలా మీరు చూడటం తనకు ఇబ్బందిగా ఉందని అంటాడు. మీకు ఇబ్బందిగా ఉంటే నేను ఏం చేస్తాను. నా మనసుకు సంతోషాన్ని ఇస్తుందే చూస్తున్నానని వసు బదులిస్తుంది.
తన కళ్ల ముందే రంగాను లైన్‌లో పడేయానికి వసుధార ప్రయత్నాలు చేయడం సరోజ తట్టుకోలేకపోతుంది. ఆమె దృష్టి మరలించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ అవేవి వర్కవుట్ కాదు. ఎంత చెప్పిన వసుధార మాత్రం రంగానే చూస్తూ ఉంటుంది.
ఆటో దిగిన సరోజ...
ఆటో ఆపమని రంగాతో చెబుతుంది సరోజ. జర్నీ చేయడం తన వల్ల కాదని, నీ ఆటోలో ప్రయాణం చేయలేనని ఇంటికి వెళ్లిపోతానని చెబుతుంది. రంగా ఎంత బతిమిలాడిన వినదు. నడుచుకుంటూ అయినా ఇంటికి వెళ్లిపోతా కానీ నీ ఆటోలో మాత్రం రానని చెబుతుంది. వసుధారపై తనకున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది సరోజ . వసుధారను శత్రువుగా భావిస్తుంది. ఆమె అంతు చూడాలని ఫిక్సవుతుంది.
రౌడీల అన్వేషణ
అప్పుడే వసుధారపై ఎటాక్ చేసిన రౌడీలు సరోజ దగ్గరకు వస్తారు. వసుధార ఫొటో చూపించి ఆమెను ఎక్కడైనా చూశావా అని అడుగుతారు. చూశానని, ఇప్పుడే ఆటోలో వెళ్లిందని రౌడీలతో అంటుంది సరోజ . వసుధార ఎక్కడ ఉంటుందో కూడా తెలుసునని చెబుతుంది.
ఆమె గురించి ఎందుకు అడుగుతున్నారని రౌడీలను అడుగుతుంది సరోజ. తాను వసుధారకు మావయ్యను అవుతానని రౌడీ గ్యాంగ్ లీడర్ అబద్ధం ఆడుతాడు. వారికి వసుధారను అప్పగిస్తే తన అడ్డు తొలగిపోతుందని సరోజ అనుకుంటుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.