Guppedantha Manasu: మను ట్విస్ట్‌కు భయంతో వణికిపోయిన శైలేంద్ర - అచ్చం రిషిలా మారిన రంగా - వసుధార కన్నీళ్లు
Guppedantha Manasu: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో శైలేంద్ర కుట్రలను సాక్ష్యాలతో ఫణీంద్ర ముందు బయటపెట్టాలని అనుకుంటాడు మను. ఆ విషయం తెలిసి శైలేంద్ర కాళ్లబేరానికి వస్తాడు. తన నిజస్వరూపం గురించి తండ్రికి చెప్పొద్దని మనును బతిమిలాడుతాడు.
Guppedantha Manasu: మనును చంపడానికి రౌడీలతో కలిసి స్కెచ్ వేస్తాడు శైలేంద్ర. మను అడ్డు తొలగిపోతే తాను కాలేజీ ఎండీ కావచ్చునని కలలు కంటాడు. మనును రౌడీలు చంపేసి ఉంటారని ఊహాల్లో తెలిపోతుంటాడు. సడెన్‌గా శైలేంద్ర ముందు మను ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూసి శైలేంద్ర షాకవుతాడు.
నాపై ఎటాక్ చేయించింది నువ్వే అని నాకు తెలుసునని మను అంటాడు. తనకు ఈ ఎటాక్‌కు ఏ సంబంధం లేదని మొదట శైలేంద్ర బుకాయిస్తాడు. కానీ తనపై ఎటాక్ చేసిన రౌడీలను వెంటపెట్టుకొని శైలేంద్ర ఇంటికివస్తాడు మను. ఆ రౌడీలను శైలేంద్రకు చూపిస్తాడు. వారు నిజం చెప్పిన సంగతి బయటపెడతాడు.
అడ్డంగా దొరికిపోవడంతో తానే ఈ ఎటాక్ చేయించానని, నిజాలు తెలిసిన నువ్వు నన్ను ఏం చేయాలని మనుపై రివర్స్ ఎటాక్ చేస్తాడు శైలేంద్ర. ఈ సారి మిస్సయిన ప్రతిసారి మిస్సవ్వదని, ప్రాణాల మీద ఆశ ఉంటే నా దారికి అడ్డు రావొద్దని మనుకు వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర.
దొంగ దెబ్బ తీయను...
నీ మాటలకు భయపడే రకం నేను కాదని శైలేంద్రకు ధీటుగా సమాధానమిస్తాడు మను. నీలా దొంగ దెబ్బలు తీయనని, ఏదైనా స్ట్రెయిట్‌గానే తేల్చుకుంటానని శైలేంద్రకు చెబుతాడు. నీపై ఫణీంద్రకు కంప్లైంట్ ఇవ్వడానికే మీ ఇంటికి వచ్చానని శైలేంద్రను భయపెడతాడు మను. నువ్వే నాపై ఎటాక్ చేయించావని నిజాన్ని ఫణీంద్రతో చెబుతానని మను అంటాడు.
ఎవరికైనా చెప్పుకో...నువ్వు భయపెడితే నేను భయంపడే రకం కాదని, నువ్వు చెప్పింది అబద్ధమని మా నాన్నను నేను నమ్మిస్తానని మనుకు బదులిస్తాడు శైలేంద్ర. నేను చెబితే ఫణీంద్ర నమ్మకపోవచ్చు కానీ నాపై ఎటాక్ చేసిన రౌడీలు చెబితే మాత్రం ఫణీంద్ర సార్ తప్పకుండా నమ్ముతారని మను అనగానే శైలేంద్ర కంగారు పడతాడు. నిజం చెప్పద్దొని మనును బతిమిలాడుతాడు. నీ విషయంలో తప్పు చేశానని, ఇంకోసారి ఇలా చేయనని రిక్వెస్ట్ చేస్తాడు. శైలేంద్ర కాళ్లబేరానికి వస్తాడు. డాడీకి నిజం చెబితే ఆయన నన్ను చంపేస్తారని శైలేంద్ర తెగ భయపడతాడు.
నేరాల చిట్టా విప్పుతా...
ఎంత చెప్పిన నీలో మార్పు రాదని అర్థమైందని, నీ నేరాల చిట్టా ఫణీంద్ర ముందు మొత్తం బయటపెడతాడనని మను అనగానే శైలేంద్ర భయంతో వణికిపోతాడు.. ఇంకోసారి నీ జోలికి రాను...నువ్వు ఏం చెబితే అదే చేస్తాను...ఈ విషయం మాత్రం మా నాన్నకు చెప్పొద్దని మనును వేడుకుంటాడు శైలేంద్ర.
అప్పుడే మనును చూసి ఫణీంద్ర బయటకువస్తాడు. , శైలేంద్ర ఏదైనా వెధవ వేశాలు వేస్తున్నాడా...నాకు చెప్పు వీడి తాట నేను తీస్తానని ఫణీంద్ర అనడంతో శైలేంద్ర భయం మరింత పెరుగుతుంది. శైలేంద్ర భయాన్ని చూసి ఎటాక్ గురించి నిజం దాచిపెడతాడు మను. ఫణీంద్ర వెళ్లగానే
భయం అంటే ఎలా ఉంటుందో తెలిసిందిగా...ఇంకోసారి తోక జాడిస్తే కట్ చేస్తానని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు మను.
వెన్నెల్లో వసు, రంగా...
ఇంటి బయట కూర్చొని వెన్నెలను ఆస్వాదిస్తుంటాడు రంగా. అతడి దగ్గరకు వస్తుంది వసుధార. రిషి కూడా ఇలాగే వెన్నెలలో కూర్చోవడానికి ఇష్టపడేవారు. చందమామను చూస్తూ తన మనసులోని ఫీలింగ్స్‌ను బయటపెట్టేవారు అని వసుధార అంటుంది.
నేను ఏం చేసిన, ఏం మాట్లాడిన రిషి టాపిక్ తీసుకు రావడం బాగాలేదని వసుధారతో అంటాడు రంగా. పొగరు అన్నందుకు ఆ మాట రిషినే నన్ను అంటాడు. అలా పిలిచే హక్కు అతడికే ఉందని అన్నారు. ప్రతి విషయంలో మీరు నన్ను రిషితో కంపేర్ చేయడం ఇబ్బందిగా ఉందని రంగా అంటాడు. మీ మనసుకు నేను రిషి అనిపిస్తే ఏం చేయలేనని రంగా అంటాడు.
రిషి గొప్పతనం గురించి...
అసలు మీ రిషి ఏం చేస్తుంటాడని వసుధారను అడుగుతాడు రంగా. సొసైటీ కోసం, నా కోసం రిషి ఎంతో చేశాడని వసుధార అంటుంది. బాధల్లో ఏ ఒక్కరు ఉన్నా చూస్తూ ఉండలేడని, చీమకు కూడా హానీ తలపెట్టడని అంటూ రిషి గురించి గొప్పగా చెబుతుంది వసుధార. మీ కోసం రిషి ఏం చేశాడని వసుధారను మరో ప్రశ్న అడుగుతాడు రంగా.
నా కళ్లలో ఒక్క కన్నీటి చుక్క కనిపించిన రిషి తట్టుకోలేకపోయేవాడని, నా మొహంలో చిన్న బాధ కనిపించిన విలవిలలాడేవాడని వసుధార అంటుంది. రిషితో తన ప్రేమకథ , పెళ్లి ఎలా జరిగిందో మొత్తం వివరంగా రంగాకు చెబుతుంది వసుధార. తమకు ఎదురైన కష్టాలను ఎదురించి రిషి, తాను ఎలా పోరాడింది వివరిస్తుంది.
కళ్ల ముందు రిషి ఉన్నా...
ఇప్పుడు రిషి తన కళ్ల ముందే ఉన్న కొత్త వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడని, తాను ఎవరో తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నాడని వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషి చనిపోయాడని అందరూ అన్నారు. కానీ నా భర్త బతికే ఉన్నాడని నేను నమ్మాను. నా నమ్మకం నిజమైందని అంటుంది. రిషి కళ్ల ముందే ఉన్నా ఎవరికి నమ్మకంగా చెప్పుకోలేకపోతున్నానని ఆవేదనకు లోనవుతుంది.
రిషి వేరు..రంగా వేరు...
ఎంత చెప్పిన తాను రిషి కాదని రంగా అంటాడు. రిషి నిజంగా బతికి ఉంటే అతడు మిమ్మల్ని కలవాలని కోరుకుంటాడు. కానీ నాలో మీ రిషిని చూసుకోవద్దని, నేను రంగానని మరోసారి గట్టిగా వసుధారకు బదులిస్తాడు రంగా.రిషి వేరు...రంగా వేరు అని చెబుతాడు. రిషి గొప్పకుటుంబంలో పుట్టాడని, ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాడని, తాను మాత్రం సాధారణ ఆటోడ్రైవర్‌నని, మధ్య తరగతి కుటుంబంలో పుట్టినవాడినని, నాకు రిషికి అసలు సంబంధం లేదని రంగా తేల్చిచెబుతాడు.
రంగాతో ఛాలెంజ్...
కానీ రంగాది యాక్టింగ్ అని అంటుంది వసు. నిజం బయటపెట్టేవరకు ఇక్కడి నుంచి తాను కదలనని చెబుతుంది. మీరు రంగా కాదు రిషి అనే నిజం ఏదో ఒక రోజు బయటపెడతానని ఛాలెంజ్ చేస్తుంది. తనకు కొత్త బట్టలు కొనివ్వమని రంగాను అడుగుతుంది వసుధార. మొదట అందుకు ఒప్పుకోడు రంగా. సరోజ డ్రెస్‌లతో అడ్జెస్ట్ అవ్వమని అంటాడు. కానీ వసుధార బలవంతం చేయడంతో అందుకు అంగీకరిస్తాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.