Brahmamudi September 20th Episode: అనామిక రీఎంట్రీ - కళ్యాణ్, అప్పులపై రివేంజ్ - రాజ్‌కు కావ్య సర్‌ప్రైజ్
Brahmamudi September 20th Episode: బ్రహ్మముడి సెప్టెంబర్ 20 ఎపిసోడ్‌లో కళ్యాణ్, అప్పులైఫ్‌లోకి మళ్లీ అనామిక రీఎంట్రీ ఇస్తుంది. వారిపై పగతో దుగ్గిరాల కుటుంబానికి ప్రత్యర్థి అయిన సామంత్ అనే వ్యక్తికి దగ్గరవుతుంది. కళ్యాణ్, అప్పు రోడ్డుపై నడిచిరావడం చూసి అవమానిస్తూ మాట్లాడుతుంది.
Brahmamudi September 20th Episode: కావ్య విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని అంతరాత్మతో వాదిస్తాడు రాజ్. జీవితంలో మీ ఇంటి గడప తొక్కనని కావ్య అన్న మాటలతోనే తాను హర్ట్ అయినట్లు అంతరాత్మతో అంటాడు రాజ్. అందుకే చెక్ బుక్ తీసుకొని భార్యగా నటిస్తే డబ్బులు ఇస్తానని కావ్యకు ఆఫర్ ఇచ్చినట్లు చెబుతాడు. మా అమ్మను జాగ్రత్తగా చూసుకోమని చెబితే ఆ బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయడం కావ్య తప్పు రాజ్ వాదిస్తాడు.
కంపెనీ కంటే అమ్మ ప్రాణాలు ముఖ్యం...
కంపెనీ సేఫ్‌గా ఉండటం కంటే అమ్మ ప్రాణాలే ముఖ్యమని కావ్య తెలుసుకోలేకపోయిందని అంతరాత్మతో చెబుతాడు రాజ్. కావ్య ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయంలో కొంత రుద్రాణి మాటలతో తాను ప్రభావితం అయిన మాట నిజమేనని అంతరాత్మ ముందు ఒప్పుకుంటాడు రాజ్. అయినా కావ్యను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని తాను అనలేదని అంతరాత్మతో రాజ్ అంటాడు. రుద్రాణి వెళ్లిపొమ్మని అంటే తనకేం సంబంధం అని అంతరాత్మ ముందు తన మనసులోని ఆవేదనను మొత్తం వెళ్లగక్కుతాడు రాజ్.
కావ్య వల్ల తల్లి ముందు తాను ఫూల్ కావాల్సివచ్చిందని చెబుతాడు. చివరకు అత్తకోడళ్లు ఒక్కటైపోయారని అంటాడు. తన ముందు నగలు పెట్టి పరాయి మొగుడిగా నటించాలని, బొమ్మలకు రంగులు వేయాలని కావ్య అన్న మాటలను గుర్తుతెచ్చుకొని కోపం పట్టలేకపోతాడు. కానీ అంతరాత్మ మాత్రం రాజ్ మాటలనే తప్పు పడతాడు.
కారు కూతలు ఎందుకు కూశావు...
జీతమిస్తా కోడలిగా నటిస్తావా అని సొంత పెళ్లాన్ని ఎవడైనా అడుగుతాడా అంటూ రాజ్‌పై అంతరాత్మ ఫైర్ అవుతుంది. చెక్కురాసిస్తా, జీతం ఇస్తా అంటూ కారు కూతలు ఎందుకు కూశావు. నీ నోటిదూళ అంటూ రాజ్‌కు క్లాస్ పీకుతుంది అంతరాత్మ. క్షమించమని అడిగి కావ్యను కాపురానికి తీసుకొస్తే సరిపోయేదిగా అని అంటాడు.
కావ్యకు క్షమాపణలు చెప్పడం జన్మలో జరగదని రాజ్ అంటాడు. అంతరాత్మను వెళ్లిపొమ్మని అంటాడు. నువ్వు చచ్చేదాకా మారవు...నిన్ను మార్చాలని అనుకోవడం నాదే బుద్ది తక్కువా అని అంతరాత్మ వెళ్లిపోతుంది.
కావ్య ఎమోషనల్...
మరోవైపు తమ పెళ్లిఫొటో చూస్తూ కావ్య ఎమోషనల్ అవుతుంది. రాజ్ తనపై ప్రేమను కురిపించిన జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటుంది. అదే టైమ్‌లో బలవంతంగా తనతో కాపురం చేశానని రాజ్ అన్న మాటలను తలచుకొని బాధపడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లి తన రూమ్‌లోకి రాగానే పెళ్లిఫొటోను దాచేస్తుంది. కన్నీళ్లు తల్లికి కనబడకుండా ఆనందంగా ఉన్నట్లు నటిస్తుంది.
కావ్య ఎంట్రీ...
రాజ్ ఉదయం కళ్లు తెరవగానే కాఫీ కప్పుతో కావ్య కనిపిస్తుంది.భార్యను చూసి నువ్వా అంటూ రాజ్ షాకవుతాడు. ప్రేమ లేకుండా పెళ్లిచేసుకున్న భర్తగారు కాఫీ తీసుకొండి అంటూ కప్‌ను రాజ్‌కు అందివ్వబోతుంది కావ్య. ఎలా వచ్చావు అని కావ్యను అడుగుతాడు రాజ్.
షేర్ ఆటోలో వచ్చానని కావ్య తిక్కతిక్కగా సమాధానమిస్తుంది. నా మాటలకు భయపడి, బాధపడి బెదిరిపోయి వచ్చావా అని కావ్యతో అంటాడు రాజ్. అంతలేదని కావ్య బదులిస్తుంది. నా ఛార్జర్ మర్చిపోయానని చెబుతుంది. తెగిపోయిన రెండు చెప్పులు ఇక్కడ ఉండిపోయానని, వాటిని తీసుకెళ్లడానికి వచ్చానని రాజ్‌కు తగ్గట్లుగా సమాధానమిస్తుంది.
ఏ పోస్ట్‌లో ఉండాలి...
ఎలాగూ వచ్చావు కదా...ఇక్కడే ఉండిపోమ్మని కావ్యతో అంటాడు రాజ్. ఎలా ఉండాలి. ఎందుకు ఉండాలి. ఏ పోస్ట్‌లో ఉండాలి కోడలిగానా...భార్యగానా...పనిమనిషిలానా, వంట మనిషిలాగా ఎలా ఉండాలని చెప్పమని రాజ్‌ను అడుగుతుంది కావ్య.
నా భార్యను నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లిచేసుకున్నానని, ఎవరి బలవంతం మీద కాకుండా పూర్తి స్పృహలోనే ఉండి కాపురం చేశానని బాండ్ పేపర్ రాసిస్తే ఉంటానని కావ్య అంటుంది. తాను బాండ్ రాసే ప్రసక్తే లేదని రాజ్ అంటాడు. పనిమనిషి పిలుపుతో కల నుంచి బయటకు వస్తాడు. కావ్యపై అపర్ణ బాగా బెంటపెట్టుకుందని, వెంటనే భార్యను ఇంటికి తీసుకురమ్మని రాజ్‌కు పనిమనిషి సలహా ఇస్తుంది.
పనిమనిషి సలహా…
ఇంట్లో వాళ్లతో పాటు పనిమనుషులు కూడా సలహా ఇవ్వడం రాజ్ సహించలేకపోతాడు. మరోవైపు కలలో కూడా కావ్య తనతో పొగరుగా మాట్లాడిన మాటల్ని గుర్తుచేసుకొని కోపం పట్టలేకపోతాడు. కానీ పనిమనిషి ఇచ్చిన కాఫీ తాగలేకపోతాడు. కావ్య చేసే కాఫీ టేస్ట్ గుర్తుచేసుకుంటాడు.
అనామిక రీఎంట్రీ...
కళ్యాణ్, అప్పు మార్కెట్‌లో కూరగాయలు కొనుక్కొని ఇంటికొస్తుంటారు. సడెన్‌గా ఓ కారు వచ్చి వాళ్ల ముందు ఆగుతుంది. ఆ కారులో నుంచి అనామిక దిగుతుంది.ఆమె పక్కన ఓ కొత్త వ్యక్తి ఉంటాడు. దుగ్గిరాల వారసుడు రోడ్డుపై పడ్డట్లున్నాడు. కనీసం కారు కూడా లేదా అంటూ కళ్యాణ్‌ను అవమానిస్తుంది అనామిక. నీలా పరాయివాళ్ల కార్లలో తిరిగే అలవాటు మాకు లేదని అప్పు సమాధానమిస్తుంది. తనకు కాబోయే భర్త సామంత్‌ను కళ్యాణ్, అప్పులకు పరిచయం చేస్తుంది అనామిక.
దుగ్గిరాల ప్రత్యర్థితో...
దుగ్గిరాల కుటుంబానికి చెందిన స్వరాజ్ గ్రూప్‌కు ప్రత్యర్థి అయినా సామంత్ జ్యూవెల్లరీ కంపెనీ ఓనర్ అని, త్వరలోనే స్వరాజ్ గ్రూప్‌ను నామరూపాలు లేకుండా సామంత్ చేయడం ఖాయమని అనామిక పొగరుగా ఉంటుంది. ఆమె మాటలు చూసి అప్పు, కళ్యాణ్ నవ్వుకుంటారు. ఓ చీమ...ఎనుగును పాతాళానికి తొక్కేస్తానని ప్రగల్భాలు పలికిందంటా నీ మాటలే అలానే ఉన్నాయని అనామికతో అంటాడు కళ్యాణ్.
సామంత్‌కు అప్పు సలహా...
నిన్ను మొత్తం ఊడ్చేసి అనామిక రోడ్డుపై పడేస్తుందని సామంత్‌తో అప్పు అంటుంది. రోడ్డున పడటం అంటే ఏమిటో త్వరలోనే అనామిక నీకు తెలిసేలా చేస్తుందని అప్పు చెబుతుంది. మా కంపెనీపై ఉన్న పగతోనే అప్పు నీకు దగ్గరైందని సామంత్‌కు సలహా ఇస్తుంది అప్పు. దీని బతుక్కి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదని అనామికకు ధీటుగా మాట్లాడుతుంది అప్పు.
నాతో ఉన్నప్పుడు యువరాజులా ఉండేవాడివి, ఇప్పుడు సామాన్యుడిలా అయిపోవావని కళ్యాణ్‌ను ఎగతాళి చేస్తుంది అనామిక. నాకు పట్టిన దరిద్రం కోర్టులోనే వదిలిపోయిందని అనామికకు బదులిస్తాడు కళ్యాణ్. నీతో గడిపిన రోజులు నరకమని అంటాడు. ఇప్పుడు చిన్న గదిలో అప్పుతో కలిసి ఉన్నా స్వర్గంలా ఉందని కళ్యాణ్ బదులిస్తాడు.
నువ్వు కవితలు రాయడం తప్ప ఏం చేయలేవని, సంపాదించడం చేతకానీ చవటను చేసుకున్నందుకు బాధపడి ఏదో ఒకరోజు అప్పు కూడా నిన్ను వదిలి వెళ్లిపోవడం ఖాయమని కళ్యాణ్‌తో అంటుంది అనామిక. నేను ప్రేమించినోడిని నాకు దక్కేలా చేసినందుకు నీకు థాంక్స్ అంటూ అనామికతో కోపాన్ని మరింత పెంచేలా మాట్లాడుతుంది అప్పు.
కనకం ఫైర్...
మరోవైపు తండ్రితో కలిసి బొమ్మలు చేస్తుంటుంది కావ్య. సంతోషంగా అత్తారింట్లో కాపురం చేయాల్సిన కూతురు పుట్టింట్లో బొమ్మలు చేయడం చూస్తుంటేతల్లిగా నాకు చాలా గర్వంగా ఉందని కనకం అంటుంది. భర్త కృష్ణమూర్తిని తప్పుపడుతుంది. మరోవైపు పనిమనిషి చేసే వంటల టేస్ట్ చూసి రాజ్ షాకవుతాడు. తినలేకపోతాడు. ఇంట్లోవాళ్లు ఇన్నాళ్లు తృప్తిగా భోజనం చేయడానికి కారణం కావ్యనే కారణం అని రాజ్‌తో అంటుంది అపర్ణ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.