Bandi Sanjay on Hydra : ఇళ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా.. హైడ్రాపై బండి సంజయ్ ఫైర్-union minister bandi sanjay made sensational comments on hydra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay On Hydra : ఇళ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా.. హైడ్రాపై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay on Hydra : ఇళ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా.. హైడ్రాపై బండి సంజయ్ ఫైర్

Basani Shiva Kumar HT Telugu
Sep 29, 2024 02:45 PM IST

Bandi Sanjay on Hydra : హైడ్రాపై విమర్శలు రోజురోజూకు పెరుగుతున్నాయి. హైడ్రా విషయంలో ఇన్నాళ్లు సైలెంట్‌గా బీజేపీ.. ఇప్పుడు స్వరం పెంచుతోంది. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ హైడ్రాపై ఫైర్ అయ్యారు. రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. బండి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

బండి సంజయ్
బండి సంజయ్

కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రాపై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఏదో మార్పు తెస్తారని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే.. ప్రజలను గోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులకు.. ప్రస్తుత పాలకులకు తేడా లేదని విమర్శించారు. తీరు మార్చుకోకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

'6 గ్యారంటీలు చూసి ప్రజలు మీకు ఓటేశారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పారు.. ఇళ్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా.. రుణమాఫీ చేయకపోవడం ఇందిరమ్మ రాజ్యమా.. ఉద్యోగులను మోసం చేయడం ఇందిరమ్మ రాజ్యమా.. మహిళలను మోసం చేయడం ఇందిరమ్మ రాజ్యమా.. ఇళ్లు కోల్పోయిన పేదలను చూస్తే ఆవేదన కలుగుతోంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వారి ఇళ్లను కూలుస్తారా' అని బండి సంజయ్ ప్రశ్నించారు.

'కిరాయి ఉన్నవారిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించి ఇళ్లు కూల్చేస్తారా.. ఇదేం పరిపాలన. కాంగ్రెస్ కారణంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. హైడ్రా కారణంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నా.. హైడ్రాను కొనసాగించడం కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది' అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎఫ్‌టీఎల్‌లో కట్టుకున్న ఇళ్లే కూల్చేస్తున్నామని వివరించారు. బఫర్ జోన్‌లో ఉన్నవాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

'రేవంత్‌రెడ్డిది రాతి గుండె. మీకో రూల్‌.. పేదలకు మరో రూలా. మూసీ ప్రాంత వాసులకు అండగా ఉంటాం. అవసరమైతే రోజుకో ఎమ్మెల్యే ఇక్కడే ఉంటాం. బుల్డోజర్లు మమ్మల్ని దాటుకుని రావాల్సిందే. నోరెత్తని పేదలకు నోటీసులు ఇస్తున్నారు. బాధితుల తరపున కోర్టు నుంచి స్టే ఆర్డర్‌లు తెస్తాం. ఎప్పుడొచ్చినా తెలంగాణ భవన్‌ తలుపులు తెరిచే ఉంటాయి' అని మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

ఇటు హైడ్రాపై కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. హైడ్రా తీరును తప్పుబడుతున్నారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖాళీ చేయించాల్సింది. కూల్చిన ఇళ్లకు సమీపంలోనే నివాసం ఏర్పాటు చేస్తే మంచిది. మూసీ ప్రక్షాళన అవసరం ఉంది. భవిష్యత్తులో మూసీ విపత్తు పరిణామాల నుంచి ప్రజలకు ఇబ్బందుల కలగొద్దని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. పేదల ఇళ్ల కూల్చివేత అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా' అని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.