BRS Harish Rao: ఆరు గ్యారంటీలపై రాహుల్ అబద్దాలు… క్షమాపణలు చెప్పాలన్న హరీష్‌రావు
BRS Harish Rao: ఆరు గ్యారంటీల పైన అబద్దం ఆడిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ నేతల హరీష్ రావు డిమాండ్ చేశారు.
BRS Harish Rao: ఆరు గ్యారంటీల పైన అబద్దాలు చెప్పిన కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసారు.
రాహుల్ గాంధీ నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన ప్రసంగం పై స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లో మహా లక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ 2,500 ఇవ్వకముందే, కాంగ్రెస్ ప్రభుత్వం నెల నెల ఇస్తుందని రాహుల్ గాంధీ అంటున్నాడని ఆయన అన్నారు. తన ఉపన్యాసం ఎవరు రాస్తున్నారు, ఎందుకు అబద్దాలు ఆడి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, అని మాజీ మంత్రి రాహుల్ గాంధీ ని ప్రశ్నించారు.
డబ్బులు ఎవరి అకౌంట్ లో వేశారో చెప్పాలి…
నిజంగా డబ్బులు ఇస్తే, అవి ఎవరి అకౌంట్లో పడ్డాయో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని అయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఒకవైపు, రాహులు గాంధీ ఉపన్యాసంలో అబద్దాలు చెబుతుంటే పక్కన్నే ఉన్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చప్పట్లు కొడుతూ అభినందిస్తున్నాడని, హరీష్ రావు అన్నారు.
వందరోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం, ఐదు నెలలు దాటినా ఇప్పటివరకు ఒక్కటే గ్యారంటీ మాత్రమే ఇచ్చిందని. ఆ విషయం రాహుల్ గాంధీ తెలిసి మాట్లాడ్తున్నాడా, కావాలనే అబద్దాలు ఆడుతున్నాడా అనేది తేలాలని, హరీష్ రావు డిమాండ్ చేసారు.
గద్వాలలో మరొక సభలో మాట్లాడనున్న, రాహుల్ గాంధీ తన ఉపన్యాసం మార్చుకోవాలని, అబద్దాలు చెప్పినందుకు క్షమాపణ కూడా చెప్పాలని అయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని గ్యారంటీలు ఇస్తే, దానిపైన ప్రభుత్వం ఒక వైట్ పేపర్ విడుదల చేయాలనీ అయన కోరారు.
రేవంత్ రెడ్డి తో ఓపెన్ డిబేట్ కు నేను రెడీ....
ఆరు గ్యారంటీల అమలుపైన, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాను ఓపెన్ డిబేట్ లో పాల్గొనడానికి తాను రెడీ గా ఉన్నానని, ఆ మాజీ మంత్రి మరొకసారి ముఖ్యమంత్రికి సవాలు విసిరారు.
అబద్దాలు ఆడటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తీ విశ్వనీయత కోల్పోయిందని, హరీష్ రావు అన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాందీ, ఆరు గ్యారంటీల అమలు చూపించే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అబద్దాలు అది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
తెలంగాణాలో హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఒక్కో మహిళా బ్యాంకు అకౌంట్లో సంవత్సరానికి ఒక లక్ష డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చి మరొక మోసానికి తెర తెస్తుందని, హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని మర్చిపోరని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతారని అయన ఆశాభావం వ్యక్తం చేసారు.
మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధికి మద్దతుగాహరీష్ రావు మెదక్ జిల్లాలోని తూప్రాన్, రామాయంపేట పట్టణాలలో ఈ రోజు సాయంత్రం ప్రచారం లో పాల్గొన్నాడు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం