Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో దుమ్ములేపుతోన్న గౌతమ్.. ఒక్కసారిగా పడిపోయిన నిఖిల్ గ్రాఫ్.. ఎలిమినేట్ ఎవరంటే?
Bigg Boss Telugu 8 Tenth Week Nomination Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో గౌతమ్ కృష్ణ టాప్‌లో దుమ్ములేపుతున్నాడు. విన్నర్ మెటీరియల్‌గా వచ్చిన నిఖిల్‌ను పక్కకు నెట్టేసి మరి మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇక డేంజర్ జోన్‌లో విష్ణుప్రియ ఉంది.
Bigg Boss Telugu 8 Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్ కూడా హోరాహోరాగా సాగాయి. అయితే, ఈ వారం కూడా బిగ్ బాస్ 8 తెలుగు 10వ వారం నామినేషన్స్ ఒక్కరోజే జరిగాయి. అది కూడా కంటెస్టెంట్స్ ఇతర ఒక ఇంటి సభ్యుడిని మాత్రమే నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు.
నామినేషన్స్‌లో ఏడుగురు
ఇంతకుముందు ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరి చొప్పున నామినేట్ చేయాల్సి ఉండేది. కానీ, బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాల్సిందిగా కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ చెప్పాడు. ఇలా జరిగిన పదో వారం నామినేషన్స్‌లో ఏడుగురు నామినేట్ అయ్యారు. వీరికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయినరోజు నుంచే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి.
అశ్వాత్థామ ఈజ్ బ్యాక్
అలా బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో జెన్యూన్ కంటెస్టెంట్ అయిన గౌతమ్ కృష్ణ టాప్‌లో దుమ్ములేపుతున్నాడు. నామినేషన్స్‌లో అశ్వాత్థామ ఈజ్ బ్యాక్ అని చెప్పిన గౌతమ్ ఓటింగ్‌లో మొదటి స్థానంలో నిల్చున్నాడు. అది కూడా విన్నర్ మెటీరియల్‌గా వచ్చిన నిఖిల్‌ను పక్కకు నెట్టేసి, దాటేసి మరి టాప్‌లో నిలబడ్డాడు.
పడిపోయిన నిఖిల్ గ్రాఫ్
25.44 శాతం ఓటింగ్, 7,450 ఓట్లతో గౌతమ్ టాప్‌లో ఉంటే.. 19.3 శాతం ఓటింగ్, 5,651 ఓట్లతో నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు. పానిపట్టు టాస్క్‌లో నిఖిల్ చేసిన నిర్వాకం, నామినేషన్స్‌లో గౌతమ్‌ను అనవసరంగా టార్గెట్ చేయడంతో అతని గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. టాస్క్‌లో ప్రేరణ, యష్మీలపై మృగంలా రెచ్చిపోయిన నిఖిల్ యష్మీని గౌతమ్ అక్క అని పిలవడంపై నామినేట్ చేయడం చాలా సిల్లీగా ఉందని ప్రజలు భావించారు.
కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్
నిఖిల్ ఓవర్ అగ్రెషన్‌ను ప్రేరణ, యష్మీ తప్పు పట్టకుండా గౌతమ్‌దే తప్పు అని అనడంతో ఓటింగ్ పెరిగిపోయింది. కన్నడకు చెందిన నిఖిల్, యష్మీ, ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని, అందుకే వారిలో ఒకరైన నిఖిల్ ఎంత రచ్చ చేసిన క్వశ్చన్ చేయట్లేదని, అనవసరంగా గౌతమ్‌ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారని గట్టి డిబెట్ జరుగుతోంది.
డేంజర్‌లో విష్ణుప్రియ
ఇదిలా ఉంటే, బిగ్ బాస్ ఓటింగ్‌లో మూడో స్థానంలో 16.47 శాతం ఓటింగ్, 4,822 ఓట్లతో ప్రేరణ ఉంది. 12.81 శాతం ఓటింగ్, 3,751 ఓట్లతో పృథ్వీ నాలుగో స్థానంలో, 10.73 శాతం ఓటింగ్, 3,143 ఓట్లతో యష్మీ ఐదో స్థానంలో ఉన్నారు. ఇక హరితేజ (7.86 శాతం ఓటింగ్, 2,301 ఓట్లు), విష్ణుప్రియ (7.4 శాతం ఓటింగ్, 2,168 ఓట్లు) చివరి ఆరు, ఏడు స్థానాల్లో వరుసగా ఉన్నారు.
ఎలిమినేట్ ఎవరంటే?
అంటే, హరితేజ, విష్ణుప్రియ డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ, ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. బిగ్ బాస్‌కు విష్ణుప్రియ లవ్ ట్రాక్ కావాలి కాబట్టి ఈ యాంకర్‌ను ఎలిమినేట్ చేయరు. కాబట్టి, ఈ వారం యష్మీ, హరితేజకే ఎక్కువ ముప్పు ఉంది. బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం హరితేజ ఎలిమినేట్ అయ్యే సూచనలు దాదాపుగా కనిపిస్తున్నాయి.
టాపిక్